కేంద్రం గుడ్‌ న్యూస్‌ : ఇకపై వారికీ ప్రసూతి సెలవు | Centre Allows 6 Months Maternity Leave For Staff In Case Of Surrogacy | Sakshi
Sakshi News home page

కేంద్రం గుడ్‌ న్యూస్‌ : ఇకపై వారికీ ప్రసూతి సెలవు

Published Mon, Jun 24 2024 2:35 PM | Last Updated on Mon, Jun 24 2024 3:56 PM

Centre Allows 6 Months Maternity Leave For Staff In Case Of Surrogacy

కేంద్ర ‍ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ఇకపై  సరోగసి తల్లులకు 6 నెలల  ప్రసూతి సెలవు

50 ఏళ్ల నాటి చట్ట నిబంధనకు కేంద్రం సవరణలు 

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు.  ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది.  చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972ని సవరించింది.

అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు.  అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా  బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement