Maternity leave
-
కెరీర్ స్పీడ్‌కు ‘సెలవు’
ఎంచుకున్న వృత్తి, ఉద్యోగంలో పురుషులతో సమానంగా రాణిస్తూ... కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయి. కెరీర్‌ను ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. వేతనాల విషయంలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా ప్రసూతి సెలవులు పెడతారనే ఉద్దేశంతోనే కీలక పోస్టుల్లో మహిళలను నియమించేందుకు సైతం వెనుకాడుతున్నాయి. వీటితోపాటు ప్రసూతి సెలవులు అనంతరం వృత్తిపరంగా మహిళలు మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్విసెస్ సంస్థ అయాన్ చేపట్టిన ‘వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టడీ 2024’ సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల అనుభవాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోవడం కోసం ఈ సర్వే నిర్వహించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 560కు పైగా కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న 24,000 మంది మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. –సాక్షి, అమరావతి వివక్షతో మహిళా భాగస్వామ్యంపై ప్రభావం » పని ప్రదేశాలు, ఉద్యోగ నియామకాల్లో లింగ వివక్ష కారణంగా దేశంలో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువగా ఉంటోందని గతంలో ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్ 2022 వెల్లడించింది. » ప్రతి మహిళకు ఆమె ఎదుర్కొంటున్న అసమానతల్లో 98 శాతం లింగ వివక్ష, రెండు శాతం విద్యా, పని అనుభవం రూపంలో ఉంటోందని ఆ నివేదికలో తెలిపారు. » మెటెరి్నటీ బెని్ఫట్స్ యాక్ట్–2017 ప్రకారం గర్భం దాల్చిన మహిళా ఉద్యోగులకు 26 వారాల పాటు ప్రసూతి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాలతో నేటికీ కొందరు యాజమానులు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి, కీలక స్థానాల్లో ప్రోత్సహించడానికి వెనుకాడుతున్నారు. » వీరికి కీలక పదవులు అప్పగించినట్లయితే ప్రసూతి సెలవులు వంటి అంతరాయాలతో పనిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని యాజమాన్యాలు ఆలోచనలు చేస్తున్నట్లు మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. » ఈ కారణాలతో తమను తక్కువ వేతనం, పార్ట్ టైమ్ పాత్రల్లోకి నెట్టివేస్తున్నాయని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయాన్ వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టడీ–2024 సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు 75 శాతం ప్రసూతి సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరాక కేరీర్లో ఒకటి, రెండేళ్లు ఒడిదుడుకులు ఉంటున్నాయని వెల్లడించిన పని చేసే తల్లులు 40 శాతం ప్రసూతి సెలవుపై వెళ్లడం వల్ల తమ వేతనం, అంతకుముందు కంపెనీలో పోషించిన పాత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వెల్లడించినవారు 42 శాతం పనిలో పక్షపాతం ఎదుర్కొంటున్నామని అభిప్రాయపడినవారు53 శాతం నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉంటే ఆ సంస్థలోని మహిళా ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, తమ కెరీర్ వృద్ధిపై నమ్మకం పెరుగుతుందని తెలియజేసినవారు90 శాతం కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కోసం చాలెంజింగ్ ప్రాజెక్ట్‌లు చేయడానికి అదనపు సమయాన్ని వెచి్చంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినవారు -
కేంద్రం గుడ్ న్యూస్ : ఇకపై వారికీ ప్రసూతి సెలవు
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972ని సవరించింది.అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
రేషన్ షాపుల్లో కాదు.. గుండెల్లో పెట్టుకుంటాం!
‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం అన్నది ప్రతి ఒక్కరి హక్కు.. నిజం చెప్పాలంటే ప్రపంచం ఏమంత బాగాలేదు’.. – ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో వారం క్రితం నటి ప్రియాంక చోప్రా మాట ఇది.. .... బ్రిటన్ ను దాటి ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. కాలరెత్తుకున్న ఇండియన్ – ఓ మెట్టు ఎక్కిన ఆర్థిక భారతం. మానవాభివృద్థి సూచీలో 132వ స్థానంలో మనం.. – విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో మరో మెట్టుజారిన పేద భారతం.. .... ఈ రెండూ దాదాపు వారం తేడాతో వచ్చిన వార్తలే. కానీ పరస్పర విరుద్ధం. ఇది చూస్తే పాత జోక్ ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఓ రిచ్ స్టూడెంట్ పేదవాడిపై రాసిన వ్యాసం.. ‘వాళ్లింట్లో తల్లి, తండ్రి, పిల్లలు అంతా పేదవాళ్లే. వారి ఇంట్లో పనిమనిషి పేదవాడే, తోటమాలీ పేదవాడే.. చివరికి కారు డ్రైవరూ బాగా పేదవాడే..’ అని.. .... ఎకానమీ గణాంకాలు ఎప్పుడూ ‘ద్రవ్యోల్బణం’లా ఉంటాయి.. అర్థమైనట్టే ఉన్నా అయోమయంగా తోస్తాయి. పెరిగాయో, తగ్గాయో తెలియదు.. ఎక్కడ, ఎందుకు పెరుగుతాయో, తగ్గుతాయో సామాన్యులెవరికీ అర్థంకాదు. ... ‘ఏమంత బాగాలేదు’.. అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తుంది.. ఏదీ సెక్యూరిటీ? విద్య, వైద్యంతో కూడిన మానవాభివృద్థి సూచీకి ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఓ నెటిజెన్ షేర్ చేసిన ఈ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. ‘‘.. నేను పెద్దవాళ్లు చెప్పినట్టుగా డిగ్రీ చేశా.. మంచి ఉద్యోగం సంపాదించా.. సమాజ నియమాలకు అనుగుణంగా పెళ్లి చేసుకున్నా.. ఆర్థిక నిపుణుల సూచన మేరకు నడుచుకుని పొదుపు చేసుకున్నా. రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నా.. క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లనే లేదు. సర్కార్ చెప్పినట్టుగా ట్యాక్స్‌లు కట్టా.. లైఫ్ అంతా మంచి సిటిజెన్‌గా ఉన్నా.. నా భార్యకు కేన్సర్ వచ్చింది. ఇన్సూరెన్స్ పోను 20 లక్షలు ఖర్చయింది. పొదుపు చేసిందంతా పోయింది. పాతికేళ్ల కష్టం రోగం పాలైంది. ఇంటి ఈఎంఐలు ఆగిపోయాయి. పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి. ... ఇప్పుడు చెప్పండి మీరు చెప్పే నీతులపై, ఈ ప్రభుత్వాలపై నాకు ఎందుకు గౌరవం ఉండాలి? నాకు ఏం రక్షణ ఉందని నమ్మాలి. నా పిల్లల భవిష్యత్తుకు సొసైటీ, గవర్నమెంట్ ఉపయోగపడుతుందని విశ్వసించాలా? పిల్లల్ని నాలా ఒబీడియెంట్ సిటిజెన్లా పెంచమంటారా?’’ – జీవితంపైనా.. ప్రభుత్వంపైనా సంపూర్ణంగా ఆశలు పోయిన సందర్భం ఇది ఇదీ ప్రయారిటీ.. 132వ స్థానంలో ఉన్న మనం ఇలా ఉంటే.. కొద్ది సంవత్సరాలుగా ‘మానవాభివృద్థి సూచీ’లో అందరి కన్నా ముందు ఉంటున్న నార్వే ఎలా ఉందో చూద్దాం.. చమురు, సహజ వాయువు నిక్షేపాలు నార్వేకు ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇలా వచ్చిన డబ్బును ఆ దేశం ప్రజాపనులు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తుంటుంది. నార్వే అద్భుతమైన ఆరోగ్య రంగాన్ని రూపొందించుకుంది. ఎంతలా అంటే.. ఆ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఆరోగ్య బీమా కల్పిస్తుంది. అన్నిరకాల వైద్యం ఉచితంగా అందిస్తుంది. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన గాలి, నీరు లభించే ప్రాంతాల్లో ఒకటిగా నార్వే పేరు పొందింది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయేది ఆ దేశంలోనే.. కాలుష్య రహిత వాతావరణం, మంచి వైద్య సదుపాయాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ఆదాయం అన్నీ ఉన్న నార్వే ప్రజల ఆయుష్షు కూడా ఎక్కువే. అక్కడివారి సగటు జీవితకాలం 82.3 ఏళ్లు. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువు పూర్తిగా ఉచితం. విదేశీ విద్యార్థులకు కూడా ఫీజులు తీసుకోరు. నార్వే ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో 6.6శాతం విద్యా రంగంపైనే ఖర్చుపెడుతుంది . విద్య, వైద్యం కోసం తమ సంపాదన అంతా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఆ దేశంలో ధనిక, పేద అంతరం మరీ ఎక్కువగా ఉండదు. ప్రతి కుటుంబం మెల్లగా ధనిక స్థాయికి ఎదిగే వాతావరణం ఉంటుంది. ఖర్చు విషయంలో వెసులుబాటు కారణంగా.. ఇప్పటితరం తమ తాతలు, తండ్రుల కంటే ఎక్కువగా విహార యాత్రలు చేయడం, ఎంజాయ్ చేయడం పెరిగింది. నార్వేలో ఉద్యోగిత రేటు 74.4 శాతం. మిగతావారు స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు. అంటే నిరుద్యోగం అతి తక్కువ. అక్కడ టెలి కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉంటుంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా నార్వే తరహాలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో మెరుగ్గా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో నార్వే ప్రజలు ఎంతో సంతృప్తితో ఉన్నామని చెప్తుంటారు. రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడానికి ఏమాత్రం భయం అనిపించదని 88 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆ దేశంలో సంభవించే మొత్తం మరణాల్లో హత్యలు అరశాతం (0.5%) లోపే కావడం గమనార్హం. ఆ దేశంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సుమారు నాలుగు వేల మంది మాత్రమే. అక్కడి మహిళా ఉద్యోగులు గర్భం దాల్చితే.. పూర్తి జీతంతో కూడిన 8 నెలల (35 వారాలు) సెలవు (మెటర్నిటీ లీవ్) ఇస్తారు. లేదా 80 శాతం జీతంతో పది నెలలు (45 వారాలు) సెలవు తీసుకోవచ్చు. అవసరమైతే తండ్రులు కూడా పెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు పుట్టిన మూడేళ్లలోపు 12 వారాల పాటు వేతనంతో కూడిన సెలవు ఇస్తారు. ఇదేం చారిటీ ..! ఈ మధ్య ఓ రేషన్ షాప్ ముందు స్టాండప్ కామెడీ సీన్ ఒకటి జరిగింది. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి పేదవారికి ఇచ్చే కిలో బియ్యంలో కేంద్రం, రాష్ట్రవాటాల లెక్కలేశారు. పేదవారికి పెడుతున్న తిండిలో తమ వాటా 28 రూపాయలనీ, రాష్ట్రం వాటా 4 రూపాయలనీ, ప్రజల వాటా ఒక్క రూపాయనీ తేల్చారు. తమ వాటా ఇంత ఉండగా ప్రధాని మోదీ ఫొటో ఏదని నిలదీశారు... (క్లిక్ చేయండి: సదా.. మీ ‘చెప్పు’ చేతుల్లోనే..) ‘‘.. ఓ దేశం పేదరికాన్ని దాటడమనేది ‘చారిటీ’ కాదు. సహజ న్యాయంగా జరగాలి’’ అన్న నెల్సన్ మండేలా మాట ఆ సమయంలో గుర్తుకొచ్చి ఉంటే బాగుండేది. సహజన్యాయం జరిగితే... నేతలు తమ ఫొటోలను రేషన్ షాపుల్లో వెతుక్కోనక్కర్లేదు. అందరి ఇళ్లలో, గుండెల్లో అవి కనిపిస్తాయి. మానవాభివృద్థి సూచీ దానికదే పరుగులు పెడుతుంది. (క్లిక్ చేయండి: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) -
బిడ్డను కంటే.. 9 నెలల సెలవు
పిల్లలను కన్న తర్వాత వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అందులోనూ తల్లులు ఇంట్లో పని చేసుకుంటూ, ఉద్యోగానికి వెళ్లి వచ్చి... వీటన్నింటితో పాటు పిల్లలను కూడా చూసుకోవడం అంటే మరీ ఇబ్బంది. అందుకే తమిళనాడులో పిల్లలను కన్న తర్వాత మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవును 6 నుంచి 9 నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ దాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఇప్పటివరకు మాతృత్వ సెలవు 180 రోజులు ఉండేదని, దాన్ని 270 రోజులకు పెంచుతున్నామని ఆ జీఓలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెలువడేనాటికే మెటర్నిటీ లీవులో వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగినులకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, అంటే వాళ్లు కూడా మొత్తం 270 రోజుల సెలవు తీసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఇది కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుందని అందులో స్పష్టం చేశారు. ఉద్యోగినులు తమ ఇష్టం ప్రకారం ఈ సెలవు ప్రసవానికి ముందు నుంచి తర్వాతి వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చనే అవకాశం అందులో కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగినులకు మాతృత్వ సెలవులను 9 నెలలకు పెంచుతామన్నది జయలలిత ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటి. వాస్తవానికి 2011కు ముందు మూడునెలల సెలవు మాత్రమే ఉండగా, అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆమె 6 నెలలకు పొడిగించారు. ఇప్పుడు 9 నెలలు చేశారు. -
ప్రసూతి సెలవులు ఇక 9 నెలలు
చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం 110 నిబంధనల మేరకు సీఎం జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పొడిగిస్తూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు ఆరు నెలలుగా ఉన్న ఈ సెలవుల్ని తాజాగా తొమ్మిది నెలలకు పొడిగించారు. చెన్నై మహానగరంలో ఇప్పటికే రెండు వందల మినీ బస్సులు రోడ్లపై తిరుగుతుండగా, అదనంగా మరో వంద బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నారు. రవాణా సంస్థలో విధినిర్వహణలో మరణించిన 1,600 మంది సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వుల జారీకి నిర్ణయించారు. రూ. నాలుగు కోట్ల వ్యయంతో 50 అంబులెన్స్‌ల కొనుగోలు, రూ. ఐదు కోట్లతో పూందమల్లి, తిరువారూర్ ఆర్టీవో కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించనున్నారు. కాంచీపురం, వేలాంకన్నిలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి ఉన్న ఈ రెండు ప్రాంతాలను రూ. 403 కోట్లను వెచ్చించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. -
బిడ్డను కంటే.. ఆరు నెలల సెలవు!
మాతృత్వ ప్రయోజనాల చట్టంలో సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, ఇప్పటివరకు బిడ్డను కన్న మహిళలకు మూడు నెలల సెలవు మాత్రమే ఇస్తుండగా, దాన్ని ఆరు నెలలకు పెంచారు. ఆ ఆరు నెలల పాటు ఆమె ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేకుండా, పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోడానికి అంత సమయం అవసరమని చెబుతున్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న దాదాపు 18 లక్షల మంది ఉద్యోగినులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చట్ట సవరణలో ఇద్దరు పిల్లల వరకు అయితే ఆరు నెలలు, అంతకంటే మించితే మాత్రం మూడు నెలల సెలవు ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు బిడ్డను దత్తత తీసుకున్నవాళ్లకు కూడా మూడు నెలల సెలవు ఇస్తారు. 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలలో తప్పనిసరిగా పిల్లల సంరక్షణ కోసం క్రెష్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్ట సవరణలో పేర్కొన్నారు. -
రాజ్యసభకు మెటర్నిటీ బెనిఫిట్ బిల్లు
న్యూఢిల్లీ : ఎంతో కాలంగా వేచిచూస్తున్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదంతో వర్కింగ్ మహిళలకు ప్రసూతి సెలవులు 26 వారాలు పొందడానికి మార్గం సుగుమం కానుంది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లును మొదట పెద్దల సభలో ఆమోదం పొందనున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులున్న లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవును ఈ సవరణ ప్రతిపాదనతో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లోనూ మహిళ ఉద్యోగులకు తప్పనిసరిగా 26 వారాల ప్రసూతి సెలవు పొందనున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉండదు. ప్రస్తుతానికి ఈ బిల్లును మహిళలకు ఉద్దేశించి మాత్రమే ప్రవేశపెట్టారు. ఇంటి నుంచి పని చేసే సదుసాయం మహిళలకు అందుబాటులో ఉండేలా ఈ బిల్లును సవరించారు. అయితే పని నేపథ్యం బట్టి ఉంటుందని అధికారులు చెప్పారు. -
మెడికల్ రిప్స్ నిరసన దీక్ష
భీమవరం: తమకు కనీస వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌జీయూడీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మెడికల్ రిప్స్ నిరాహార దీక్ష చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తమకు కనీస వేతనాలు నిర్ణయించాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భీమవరంశాఖ అధ్యక్షుడు సీహెచ్‌ఎన్‌ఎం మురళీ ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ రిప్స్‌లో మహిళలకు ప్రసూతి సెలవులు ఆర్నెల్లు ప్రకటించాలని, మేడే సెలవు ఇవ్వాలని కోరారు. దీక్షలో ఎస్.శిరీష్‌కుమార్, కెఎంఎస్‌సీ రాజు, బాలకృష్ణ, పవన్‌కుమార్ తదితరులు కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు వాసుదేవరావు, స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ దీక్షకు మద్దతు తెలిపారు. -
మగాళ్లకు 180 రోజుల సెలవులు!
న్యూఢిల్లీ: సరోగసీ ద్వారా సంతానం పొందే దంపతులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు మార్చాలని యోచిస్తోంది. సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు 180 రోజులు ప్రెటర్నిటీ లీవు ఇవ్వాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ప్రతిపాదించింది. సరోగసీతో తండ్రులయ్యే పురుషులకూ ఆరు నెలలు ప్రెటర్నిటీ సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది. 'సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళలకు లేదా అద్దెగర్భం మోసే తల్లులకు ప్రెటర్నిటీ సెలవులు ఇవ్వడం అనేది ఇప్పటివరకు సర్వీసు రూల్స్ లో లేదు. నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకునేందుకు సరోగసీ దంపతులకు 180 సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించామ'ని డీఓపీటీ పేర్కొంది. ప్రతిపాదిత నిబంధనలను డీఓపీటీ తన వెబ్ సైట్ లో పెట్టింది. వీటిపై అభిప్రాయాలు తెలపాలని కోరింది. చైల్డ్ కేర్ లీవు(సీసీఎల్) నిబంధన సడలించాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. వికలాంగ చిన్నారుల సంరక్షణకు తల్లికి రెండేళ్లు(730 రోజులు) చైల్డ్ కేర్ లీవు ఇస్తున్నారు. అయితే సదరు చిన్నారి మైనారిటీ అయివుండాలన్న వయసు నిబంధనను సడలించాలని సిఫారసు చేసింది. సీసీఎల్ లో ఉన్నప్పుడు మహిళా ఉద్యోగులకు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. -
మహిళా వీఆర్ఏలకు రెండు నెలల ప్రసూతి సెలవు
హైదరాబాద్ : మహిళా వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)లకు రెండు నెలల ప్రసూతి సెలవు మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాకు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
మెటర్నిటీ లీవ్ ఇక ఎనిమిది నెలలు!
న్యూఢిల్లీ: తల్లి పాలు పట్టడమే శిశుకులకు బలమని ప్రచారం చేస్తోన్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ(డబ్ల్యూసీడీ).. ఆ మేరకు గర్భం దాల్చిన ఉద్యోగినులకు ఇచ్చే మెటర్నిటీ లీవ్ ను ఆరున్నర నెలల నుంచి ఎనిమిది నెలలకు పెంచాలన్న ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వంలోని ఇతర శాఖలన్నీ శనివారం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. దీంతో మెటర్నిటీ లీవ్ పై నిర్ణయం కీలక దశకు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులకు పూర్తి వేతనంతో కూడిన ఆరున్నర నెలల మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. అయితే శిశువులకు తల్లిపాలుపట్టి వారిని బలవర్ధకంగా తయారుచేసేందుకు ఈ సమయం సరిపోదని, మెటర్నిటీ లీవ్ ను కనీసం ఎనిమిది నెలలైనా మంజూరుచేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వాదిస్తున్నారు. సెలవుల పెంపుపై తమ శాఖ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. కేంద్ర కార్మిక శాఖ గతంలోనే ఆమోదం తెలుపగా ఇప్పుడు మిగతా శాఖలూ మెటర్నిటీ లీవుల ప్రతిపాదనలకు పచ్చజెండా ఉపాయి. 'ఎనిమిది నెలల మెటర్నిటీ లీవ్ కు అన్ని శాఖలు ఓకే చెప్పాయి. ఒకటి రెండు రోజుల్లో ఫైలును కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెక్రటరీల కమిటీకి పంపుతాం. వాళ్ల ఆమోదంతో ఫైలు నేరుగా కేంద్ర మంత్రివర్గం ఎదుటికి వెళుతుంది' అని డబ్ల్యూసీడీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
అబద్ధపు గర్భం.. ఆరునెలల జీతం
సాక్షి, హైదరాబాద్: ‘‘సార్ డాక్టర్ గారూ.. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. నేను విదేశాలకు వెళ్లాలి. కనీసం ఆరు నెలల సెలవు కావాలి. మీరు సహాయం చేయాలి’’ అని ప్రభుత్వ ఉద్యోగిని అడగ్గానే ‘‘ సరేనమ్మా, నీకు ప్రసూతి సెలవు వచ్చేలా పత్రాలు సృష్టిస్తాను. నాకు ఒక నెల జీతం ఇవ్వాలి’’ అని డాక్టర్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా కొంతమంది డాక్టర్లు, ఉద్యోగినులు కలసి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. గర్భిణులైన ఉద్యోగినులకు ప్రభుత్వం జీతంతో కూడిన ఆరు నెలల సెలవు మంజూరు చేస్తుంది. ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని కొంతమంది ఉద్యోగినులు.. తాము గర్భిణులమంటూ డాక్టర్ల సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆరు నెలలు సెలవులు ఎంజాయ్ చేయడంతో పాటు జీతాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత తమ గర్భం పోయిందనో, లేక బిడ్డ చనిపోయాడనో తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలా సెలవులు తీసుకున్నా వారు వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) కూడా తీసుకోకుండా విదేశాలకూ వెళ్లిరావడం ఆశ్చర్యపరుస్తోంది. శ్రీకాకుళం ఘటనపై విచారణ.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు గర్భిణి కాకుండానే మెటర్నిటీ సెలవుకు దరఖాస్తు చేసుకుని సెలవు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తనకు బిడ్డ పుట్టాడని, పుట్టిన తొమ్మిది రోజులకు చనిపోయాడని విచారణలో ఆ ఉద్యోగిని చెప్పింది. దీనిని శ్రీకాకుళం రిమ్స్‌కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యుడు ధ్రువీకరించారు. అయితే కలెక్టర్ విచారణలో ఆమెకు గర్భం అబద్ధమని, వైద్యుడు ఇచ్చిన నివేదిక కూడా తప్పు అని తేలింది. అంతేగాకుండా వైద్యుడిపైనా ఫిర్యాదులురావడంతో అతనిపైనా విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ వైద్యుడికి ఆ ఉద్యోగిని భారీగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్నున్నాయో ఆరా తీయాలని కలెక్టర్ ఆదేశించారు. దీన్నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఆ వైద్యుడు నానా తంటాలు పడుతున్నారు. కేసునుంచి బయటపడేందుకు ఒక మంత్రి పేషీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. డబ్బులిస్తే.. ధ్రువపత్రాలు వైద్యులను ఆశ్రయిస్తే చాలు గర్భిణి కాకపోయినా సరే ధ్రువపత్రాలు సృష్టిస్తారు. నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు, మందులు వాడినట్టు కూడా రికార్డులు సృష్టిస్తారు. అయితే దీనికోసం ఉద్యోగినులు ఒక నెల వేతనం ఇవ్వాలి. ప్రసవం డేటు, బిడ్డ పుట్టిన వివరాలు అన్నీ అలా సృష్టించేస్తారు. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి సమర్పిస్తే చాలు, ఆరునెలల సెలవులు ఎంజాయ్ చేస్తూ జీతం తీసుకోవచ్చు. ఒక నెల జీతమే కదా పోతే పోనీ అని చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు బయటికి వస్తున్నా రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి నకిలీ కేసులపై చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా నాలుగైదు వందల మంది ఇలాంటి సెలవులు తీసుకుంటున్నట్లు అంచనా. -
ప్రసూతి సెలవు 24 వారాలకు పెంపు!
న్యూఢిల్లీ: గర్భిణులైన ఉద్యోగులకు ప్రసూతి సెలవును రెట్టింపు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ప్రస్తుతం 12వారాలు ఉన్న సెలవు పరిమితిని 24 వారాలకు పెంచేలా ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961కి అవసరమైన సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా జూలై 16 వరకు 41వేల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఉద్యోగులకు బోనస్ రెట్టింపు చేయటం, ఉద్యోగాలు మారినప్పుడు గ్రాట్యుటీ కోల్పోకుండా గ్రాట్యుటీ పోర్టబుల్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనేదీ లేదని కూడా మంత్రి చెప్పారు.