రాజ్యసభకు మెటర్నిటీ బెనిఫిట్ బిల్లు
న్యూఢిల్లీ : ఎంతో కాలంగా వేచిచూస్తున్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదంతో వర్కింగ్ మహిళలకు ప్రసూతి సెలవులు 26 వారాలు పొందడానికి మార్గం సుగుమం కానుంది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లును మొదట పెద్దల సభలో ఆమోదం పొందనున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులున్న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవును ఈ సవరణ ప్రతిపాదనతో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లోనూ మహిళ ఉద్యోగులకు తప్పనిసరిగా 26 వారాల ప్రసూతి సెలవు పొందనున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉండదు. ప్రస్తుతానికి ఈ బిల్లును మహిళలకు ఉద్దేశించి మాత్రమే ప్రవేశపెట్టారు. ఇంటి నుంచి పని చేసే సదుసాయం మహిళలకు అందుబాటులో ఉండేలా ఈ బిల్లును సవరించారు. అయితే పని నేపథ్యం బట్టి ఉంటుందని అధికారులు చెప్పారు.