నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో విలనిజంతో మెప్పిస్తోంది. తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె రవితేజ క్రాక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాంది, చేజింగ్ వంటి చిత్రాల్లో నటించి లేడీ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రం యశోదలో నటించింది. సమంత లీడ్ రోల్‌తో తెరకెక్కిన ఈచిత్రంలో ఆమె ఓ కీ రోల్ పోషించింది. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరోగసి నేపథ్యంలో యశోద సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో సరోగసి అంశం హాట్‌టాపిక్ మారింది, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా.. ‘సరోగసీ అనేది కాంప్లికేటెడ్ అంశం కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల దీనిపై చర్చ నడుస్తోంది. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పిల్లలు పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ’ అని పేర్కొంది.
చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే
ఇటీవల లేడీ సూపర్ నయనతార సరోగసిని ఆశ్రయించడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం చెప్పాలని యాంకర్ వరలక్ష్మిని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. పని పాట లేని వాళ్లే పక్కవారి లైఫ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం సెలబ్రెటీల జీవితంలో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. అందరు తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పని పాట లేనివాళ్లే ఇలా చేస్తారు. వాళ్లకు ఏం పని ఉండదమో అందుకే పక్కవాళ్ల గురించి ఆలోచిస్తుంటారు’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment