సమంత అనారోగ్య పరిస్థితిపై చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని సమంత పోస్ట్ చేయడంతో ఇండస్ట్రీ సహా ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. తాజాగా సమంత అనారోగ్యంపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు.
'12 ఏళ్లుగా సామ్‌తో పరిచయం ఉంది. యశోద సినిమాలో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. సెట్స్‌లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ టైంలో సామ్ అనారోగ్యంతో బాధపడుతుందని మాకు తెలీదు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. యశోద షూటింగ్ పూర్తయిన తర్వాతే సామ్ ఆరోగ్యం క్షీణిందని అనుకుంటున్నా.
కానీ ఆమె ఒక ఫైటర్. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment