Actress Varalaxmi Sarathkumar Emotional Post On Completing 10 Years In Industry, Goes Viral - Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: నన్ను తిరస్కరించిన వారందరికీ ధన్యవాదాలు.. నటి లేఖ వైరల్

Published Mon, Nov 14 2022 4:53 PM | Last Updated on Mon, Nov 14 2022 5:42 PM

Yashoda Movie Actress Varalaxmi Sarathkumar - Sakshi

క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజాగా యశోద మూవీలో నటించింది. ఆమె సినీ ప్రయాణం మొదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్‌మీడియాలో  ఏమోషనల్ పోస్ట్‌ చేసింది. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేసింది.  

(చదవండి: యంగ్ హీరో నాగశౌర్యకు అ‍స్వస్థత.. ఆస్పత్రికి తరలింపు)

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ లేఖలో ప్రస్తావిస్తూ.. 'సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ దశాబ్ద కాలంలో నా సినీ ప్రయాణం సులభంగా, అనుకున్న విధంగా సాగలేదనే చెప్పాలి. పదేళ్లలో ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొన్నా.  అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వాటినుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. దశాబ్ద కాలంగా ఎంతో కృషి చేశా. వెనక్కి తిరిగి చూసుకుంటే 45 సినిమాల్లో నటించి నేనెంటో నిరూపించుకున్నా. అలాగే నన్ను తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా కెరీర్‌ కష్టకాలంలో అండగా నిలిచిన దర్శక నిర్మాతలకు, కుటుంబసభ్యులకు వరలక్ష్మీ శరత్‌ కుమార్  కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement