యశోద మూవీపై గుణశేఖర్ ట్వీట్.. సామ్ రిప్లై ఇదే..! | Gunasekhar Tweet On Samantha Latest Movie Yashoda Action | Sakshi
Sakshi News home page

Gunasekhar On Yashoda: ఆసక్తికరంగా యశోద యాక్షన్ సీన్స్.. సమంత నటనకు గుణశేఖర్ ఫిదా

Published Sat, Nov 12 2022 2:53 PM | Last Updated on Sat, Nov 12 2022 3:43 PM

Gunasekhar Tweet On Samantha Latest Movie Yashoda Action - Sakshi

హీరోయిన్ సమంత నటనపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈనెల 11న విడుదలైన 'యశోద' మూవీలో ఆమె నటన అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు సామ్‌ను అభినంందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన ఆసక్తికరంగా సాగిందని కొనియాడారు. యశోద మూవీ ప్రారంభంలో అమాయకపు అమ్మాయిలా చూపించి.. కథలో రాబోయే ట్విస్ట్‌లకు తగినట్లుగా ఆమె తీర్చిదిద్దారు. ఈ సినిమా విజయం సమంత కెరీర్‌లో మరో కిరీటంగా నిలిచిందంటూ అభినందించారు.  

(చదవండి: Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ)

గుణశేఖర్ అభినందించడంతో కథానాయిక సమంత సైతం రిప్లై ఇచ్చింది. సమంత స్పందిస్తూ..' థ్యాంక్యూ గుణశేఖర్ సార్. నేను శాకుంతలం కోసం ఎదురుచూస్తున్నా. నేను ఏదైతే మ్యాజిక్ చూశానో అదే ప్రేక్షకులకు చూపించేందుకు ఇకపై వేచి ఉండలేను' అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మేమంతా శాకుంతలం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మూవీ అప్‌డేట్స్‌ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు.  యశోద చిత్రంలో సామ్‌ నటనను మెచ్చుకుంటూ నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు.

కాగా.. ‘శాకుంతలం’ విషయానికి వస్తే కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజుల ప్రణయ గాథ నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, అల్లు అర్హ కీలకపాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement