
సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో అభిమానులను మెప్పించింది. ప్రతి సీన్‌లో సమంత అద్భుతమైన నటనతో ఆకట్టుకుందంటూ సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు సమంత కృతజ్ఞతలు తెలిపారు. యశోద సక్సెస్‌పై తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
(చదవండి: సమంత నటించిన 'యశోద' మేకింగ్ వీడియో చూశారా?)
ప్రియమైన ప్రేక్షకులకు.. 'యశోద' మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మద్దతు నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబురాలు చూశా. సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్నా. దీని వెనుక మా చిత్ర బృందం నిర్విరామంగా పడిన కష్టం కనిపిస్తోంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. 'యశోద' ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన వాళ్లందరికీ థాంక్స్. నా పైన నమ్మకముంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు హరి, హరీష్, వరలక్ష్మీ శరత్ కుమార్,ఉన్ని ముకుందన్, చిత్రబృందానికి నా కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది.
🙇♀️🙇♀️🙇♀️#Yashoda pic.twitter.com/O6xdboY0AT
— Samantha (@Samanthaprabhu2) November 18, 2022
Comments
Please login to add a commentAdd a comment