Yashoda OTT Rights: Samantha Yashoda Gets The OTT Streaming Partner Amazon Prime Video! - Sakshi
Sakshi News home page

Samantha Yashoda Movie: సమంత యశోద మూవీ.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్..!

Published Fri, Nov 11 2022 9:32 PM | Last Updated on Sat, Nov 12 2022 11:54 AM

Samantha Yashoda Movie Locked Digital Partner Of Film - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఈ చిత్రం తన డిజిటల్ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. 

(చదవండి: Yashoda Twitter Review: యశోద ట్విటర్‌ రివ్యూ)

సమంత 'యశోద' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా దాదాపుగా మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సమంత గర్భవతిగా నటించడంతో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచే సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ మూవీలో రావు రమేష్, సంపత్, మురళీ శర్మ, కల్పిక, వరలక్ష్మి శరత్‌కుమార్, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement