ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న సమంత.. క్లారిటీ ఇదే..! | Samantha Ruth Prabhu denies reports of her exit from upcoming films due to myositis | Sakshi
Sakshi News home page

Samantha Ruth Prabhu: ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్న సమంత.. క్లారిటీ ఇదే..!

Published Wed, Dec 21 2022 3:30 PM | Last Updated on Wed, Dec 21 2022 3:33 PM

Samantha Ruth Prabhu denies reports of her exit from upcoming films due to myositis - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇటీవల అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా సామ్ వెల్లడించింది. ఇటీవలే ఆ‍మె నటించిన యశోద మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించింది. సినిమా విడుదలకు ముందే సమంత తన వ్యాధిపై ప్రకటన చేసింది. అదే సమయంలో బెడ్‌పై నుంచే సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో సామ్‌ బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఆమె ఖుషి చిత్రంతో పాటు తమిళంలోనూ మరో సినిమాకు సంతకం చేసింది. తాజాగా ఆమె కొద్ది రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే ఈ వార్తలను సమంత మేనేజర్ ఖండించారు. 

ఈ విషయంపై సమంత మేనేజర్ మహేంద్ర ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..'సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. జనవరిలో సంక్రాంతి తర్వాత ఖుషి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. ఆ తర్వాత తన బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. జనవరి నుంచి హిందీ సినిమాకు డేట్స్ ఇచ్చాం. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాల షూటింగ్‌లు దాదాపు ఆరు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె హిందీ సినిమా షూటింగ్‌ ఏప్రిల్ లేదా మే మాత్రమే పాల్గొనగలదు.' అని అన్నారు. 

ఓ హాలీవుడ్‌ మూవీతో పాటు ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా మూవీ శాకుంతలం అనంతరం సామ్‌ వరుసగా పలు చిత్రాల్లో నటించాల్సి ఉంది. అయితే తాను మయోసైటిస్‌ బారిన పడటంతో ప్రస్తుతం స్వల్ప కాలం పాటు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ సినిమాల విషయంలో సామ్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపించాయి.

ఏ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేదు:  'సినిమా నిర్మాణం చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఎవరినైనా వేచి ఉండేలా చేయడం మంచిది కాదు. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ముందుకు సాగాలని మొదటి నుంచి మేకర్స్‌కు క్లారిటీ ఇస్తున్నాం. అధికారికంగా అంగీకరించిన ఏ ప్రాజెక్ట్ నుండి సమంత బయటకు రాలేదు. ఆమె తన రాబోయే ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకున్నట్లు వచ్చిన వార్తలలో ఇప్పటివరకు నిజం లేదు.' అన్నారాయన.  ప్రస్తుతం సమంత పూర్తిగా క్షేమంగా ఉన్నారని.. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నారని సమంత మేనేజర్ మహేంద్ర వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement