
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది.
(చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?)
తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్‌లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది.