ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది.
ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ‍్యాన్స్‌కు దివాళీ విషెస్ తెలిపారు.
విఘ‍్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment