
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది.
కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్‌పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్‌కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment