Nayana thara
-
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్‌గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్‌గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్‌లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
త్రిష కృష్ణన్ Vs నయనతార
-
నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్‌పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్‌కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. 'O2' రివ్యూ
టైటిల్: ఓ2 (O2-ఆక్సిజన్) నటీనటులు: నయన తార, రిత్విక్ జోతిరాజ్, భరత్ నీలకంఠన్ తదితరులు దర్శకత్వం: జీఎస్ విక్నేష్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: తమిళ ఎ అళగన్ విడుదల తేది: జూన్ 17, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) లేడీ సూపర్ స్టార్ నయన తార ఇటీవల ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైంది. పెళ్లికి ముందు విఘ్నేష్ దర్శకత్వంలో వచ్చిన 'కణ్మని రాంబో ఖతిజా' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్ విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ: ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. పార్వతి (నయన తార) కొడుకు వీర (రిత్విక్ జోతిరాజ్) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటాడు. ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే వీరకు ఊపిరి అందదు. వీరిద్దరు అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బస్సులో వెళతారు. బస్సు ప్రయాణిస్తున్న దారిలో వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడి రోడ్డుతో సహా మట్టిలోకి కూరుకుపోతుంది. ఈ బస్సు జర్నీలో లేచిపోవాలనుకునే ప్రేమ జంట, మాజీ ఎమ్మెల్యే, పోలీసు ఇలా ఉంటారు. ఈ ప్రమాదం నుంచి ఎవరు బతికారు ? ఆక్సిజన్ దొరకనప్పుడు మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ఆ స్థితిలో వారు ఏం చేయడానికి సిద్ధపడతారు ? తన కొడుకు వీరను పార్వతి ఎలా కాపాడుకుంది ? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఓ2 (O2) చూడాల్సిందే. విశ్లేషణ: మానవ మనుగడకు ప్రాణదారం ఆక్సిజన్. ఈ సందేశంతో ఆక్సిజన్ దొరక్కపోతే మనుషుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. మట్టిలో కూరుకుపోయిన ఒక బస్సు, అందులో విభిన్న మనసత్వాలు ఉన్న వ్యక్తులు ఎలా బతికి బయటపడ్డారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాయింట్‌ను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొంతవరకే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మట్టిలో బస్సు కూరుకుపోయాక వచ్చే సీన్లు బాగున్నాయి. అయితే బస్సు లోయలో పడిపోయిందనే విషయం రెస్క్యూ టీమ్‌కు తెలియడం, తర్వాత వారి చర్యలు అంతా ఆసక్తిగా అనిపించవు. అక్కడక్కడా స్క్రీన్ ప్లే కాస్తా స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి తరహాలో వచ్చే సౌత్ ఇండియా సినిమాల్లో క్లైమాక్స్‌ను ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా, కొన్ని మలుపులతో కథ రాసుకుంటే ఇంకా బాగుండేది. ఎవరెలా చేశారంటే? నయన తార నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొడుకును కాపాడుకునే తల్లిగా నయన తార అదరగొట్టింది. అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వీర పాత్రలో మాస్టర్ రిత్విక్ జోతిరాజ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లలో రిత్విక్ యాక్టింగ్ హత్తుకునేలా ఉంటుంది. మిగతా నటీనటుల నటన కూడా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే బస్సులోని సీన్లు విజువల్‌గా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా తమిళ్ ఎ. అళగన్ పనితనం చక్కగా కనిపిస్తుంది. 'దేవుడిచ్చిన లోపాన్ని కూడా.. తల్లి సరిచేయగలదు' అనే డైలాగ్ ఎమోషనల్‌గా హత్తుకుంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
Aaradugula Bullet Movie: బుల్లెట్ వస్తోంది
‘బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర’.. వంటి పలు హిట్ చిత్రాలు తీసిన బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్–నయనతార జంటగా నటించారు. తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్’ థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా తాండ్ర రమేష్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్, నయనతార నటన, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’’ అన్నారు. -
రాణి వేలు నాచ్చియార్
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను. 1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానాన్ని పాలించారు వేలు నాచ్చియార్. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు సుశీ గణేశన్ ఓ చిత్రం తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో రాణి పాత్రకు నయనతారను అనుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి నయన కూడా పచ్చజెండా ఊపారట. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు నయనతార. కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు. ‘సైరా’లో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణి సిద్ధమ్మ పాత్రకు చక్కగా సరిపోయారు. అందుకే ‘వేలు నాచ్చియార్’కి నయనతార యాప్ట్ అని సుశీ గణేశన్ అనుకుని ఉంటారు. వేలు నాచ్చియార్కి యుద్ధ విద్యల్లో మంచి నైపుణ్యం ఉంది. గుర్రపు స్వారీ, విలు విద్య, కర్ర సాము వంటివన్నీ తెలుసు. ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి నయనతార ఈ విద్యలన్నీ నేర్చుకుంటారని ఊహించవచ్చు. -
హ్యాపీ బర్త్‌డే బంగారం
తంగమే... నయనతారను విఘ్నేష్ శివన్ అలానే పిలుస్తారు. అంటే బంగారమే అని అర్థం. ‘హ్యాపీ బర్త్‌డే తంగమే’ అని బుధవారం తన గర్ల్ ఫ్రెండ్‌కి శుభాకాంక్షలు చెప్పారు విఘ్నేష్. ‘‘నువ్వెప్పుడూ ఇలానే స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇంతే అంకితభావంతో, క్రమశిక్షణతో, ఇలానే నిజాయతీగా కొనసాగాలి. ఎప్పటికీ ఇలానే ఎదుగుతూ ఉండాలి. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని, విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో పాజిటివిటీతో మరో సంవత్సరం ఆరంభం అయింది’’ అని కూడా విఘ్నేష్ పేర్కొన్నారు. కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్, నయన ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పుట్టినరోజు సందర్భంగా నయనతార రెండు లుక్స్‌తో అభిమానులను ఖుషీ చేశారు. ఒకటి తమిళ చిత్రం ‘నెట్రిక్కన్’, ఇంకోటి మలయాళ చిత్రం ‘నిళల్’. ‘నెట్రిక్కన్’ అంటే శివుడి మూడో కన్ను అని అర్థం. ఇందులో నయన అంధురాలిగా నటిస్తున్నారు. నగరంలో వరుస హత్యలకు గురయ్యే యువతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఓ సీరియల్ కిల్లర్ నయనను అంతం చేయడానికి ప్రయత్నించడం చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. ‘నిళల్’ మలయాళ సినిమా. నీడ అని అర్థం. ఇందులో హీరోకి దీటుగా ఉండే పాత్రను నయనతార చేస్తున్నారు. -
అమ్మవారు ఓటీటీలోకి వస్తున్నారు
నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. ముక్కుపుడుక అమ్మవారు అని అర్థం. ఆర్జే బాలాజీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. భూమి మీదకు వచ్చిన అమ్మవారికి, ఓ సాధారణ మనిషికి మధ్య జరిగే సంఘటనలే ఈ చిత్రకథాంశం. అమ్మవారి పాత్ర కోసం షూటింగ్ జరిగినన్నాళ్లూ నయనతార పూర్తి శాకాహారిగా మారిపోయారు. అమ్మవారి పాత్రలో ఆమె లుక్‌కి మంచి స్పందన కూడా వచ్చింది. -
కోకిలగా జాన్వీ
2018లో నయనతార నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘కోకో (కోలమావు కోకిల). తమిళ తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. నయనతార చేసిన పాత్రను జాన్వీ కపూర్ చేయనున్నారని సమాచారం. ఈ హిందీ రీమేక్‌ను దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో అనుకోకుండా డ్రగ్స్ రాకెట్లో చిక్కుకొని డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసే అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
తమిళంపై ఫోకస్ పెట్టారా?
తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టినట్టున్నారు సమంత. ఆమె అంగీకరిస్తున్న సినిమాలన్నీ తమిళ భాషవే కావడం అందుకు కారణం. ‘మాయ, గేమ్ ఓవర్’ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు సమంత. ఇది ద్విభాషా చిత్రం అని సమాచారం. దాని తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు. ఇదో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని తెలిసింది. తాజాగా మరో తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పారని కోలీవుడ్ టాక్. గౌతమ్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ సమంతకు బాగా నచ్చిందని, ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరో ఎవరు? ఏ జానర్ సినిమా అనేది ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘కత్తి, తేరీ, మెర్సల్, ఇరంబుదురై, సూపర్ డీలక్స్’ వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్ అయ్యారు సమంత. ప్రస్తుతం ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా కమిట్ కాకపోవడం తెలుగు ఫ్యాన్స్‌కు చిన్న నిరాశే అని చెప్పొచ్చు. -
రజనీ జోరు.. దర్బార్‌కు భారీ వసూళ్లు
హైదరాబాద్: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘దర్బార్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. పాజిటివ్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు చేసింది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్‌మసాలా అంశాలు, ఫైట్లతోపాటు రజనీని సూపర్‌స్టైలిష్‌గా చూపించిన ‘దర్బార్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. చాలాకాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో కనిపించడం.. మురగదాస్ తనదైన శైలిలో తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసివస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం రజనీకాంత్ యాక్టింగ్, స్టైల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఇప్పటికీ బలంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాడులోనే తొలిరోజు దాదాపు రూ. 19 కోట్ల వరకు రాబట్టింది. ఇటు దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా ‘దర్బార్’భారీ వసూళ్లు రాబడుతోంది. -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్‌తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్‌గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్‌తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్‌గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్‌కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్‌లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్‌గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్‌ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్‌గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్‌గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్‌గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్‌గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్‌గా ఉండటంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్‌గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
మళ్లీ శాకాహారం
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. -
నల్ల మనసు
సెట్లో వాచ్‌లను పంచి పెట్టారు కథానాయిక నయనతార. తాజా తమిళ చిత్రం ‘మిస్టర్ లోకల్’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారీ బ్యూటీ. అందుకే యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చారు. ఇది తెలిసిన ఆమె అభిమానులు నయనతారది నల్ల (మంచి)మనసు అని అభిమానంగా చెప్పుకుంటున్నారు. శివ కార్తీకేయన్, నయనతార జంటగా రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ ‘మిస్టర్ లోకల్’ సినిమా తెలుగులో నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ సినిమాకు రీమేక్ అనే వార్తలను ఖండించింది చిత్రబృందం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటీవల ‘ఎన్జీకే’ షూటింగ్ పూర్తయినప్పుడు సూర్య, ‘కాట్రిన్మొళి’ కంప్లీట్ అయినప్పుడు జ్యోతిక ఆయా చిత్రబృందాలకు గోల్డ్ కాయిన్స్‌ను బహుకరించిన విషయం తెలిసిందే. అలాగే ‘పందెం కోడి 2’ పూర్తయినప్పుడు కీర్తీ సురేశ్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. మొత్తానికి కోలీవుడ్‌లో ఇలా బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ అయింది. -
ఆట పాట
ఇటీవల జార్జియాలో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు ‘సైరా’ టీమ్. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్నారు. ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లోనే నయనతార, తమన్నా పాల్గొంటారు. చిరంజీవి, నయనతార, తమన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలతోపాటుగా పాటలను కూడా చిత్రీకరించనున్నారట. ఆల్రెడీ యాభైశాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని వినికిడి. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
సంక్రాంతి ముహూర్తాన?
ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. మరి.. ఆయన నెక్ట్స్ ఏంటీ? అంటే కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు వాస్తవమేనని, చిరంజీవి– కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఓపెనింగ్ వచ్చే ఏడాది సంక్రాంతికి జరగనుందని కొందరు గాపిస్రాయుళ్లు చెబుతున్న మాట. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారట. కొరటాల గత చిత్రాలు ‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను’ చిత్రాల్లా ఈ చిత్రం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తారని కొందరి ఊహ. ఇక.. ‘సైరా’ దగ్గరకు వస్తే.. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందతున్న సినిమా ఇది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జార్జియాలో జరగనుందని టాక్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► మహేశ్‌బాబు హీరో కాకముందు బాల నటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఎ) 6 బి) 5 సి) 9 డి) 4 ► హీరో రామ్ ‘దేవదాసు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అదే సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) హన్సిక సి) షీలా డి) ఇలియానా ► దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసిన విజయవాడ అమ్మాయి ఎవరో తెలుసా? ఎ) రంభ బి) రోజా సి) లయ డి) రవళి ► కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్లది చాలా క్రేజీ కాంబినేషన్. ఏ చిత్రం ద్వారా ఈ కాంబినేషన్ ఫేమస్ అయ్యిందో తెలుసా? ఎ) మామగారు బి) చినరాయుడు సి) ఆ ఒక్కటీ అడక్కు డి) మాయలోడు ► ‘మనసుగతి ఇంతే.. మనిషి బతుకింతే.. మనసున్న మనిషికి సుఖము లేదింతే..’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) ఆత్రేయ బి) కొసరాజు సి) దాశరథి డి) ఆరుద్ర ► టాలీవుడ్లో వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) స్టూడియోను ప్రారంభించిన హీరో ఎవరో తెలుసా? ఎ) ఉదయ్‌కిరణ్ బి) కల్యాణ్రామ్సి) నితిన్ డి) మంచు విష్ణు ► ‘దిల్’ సినిమా నిర్మించటం ద్వారా వెంకటర మణారెడ్డి ‘దిల్ రాజు’ అయ్యాడు. మరి ‘దిల్’ సినిమా దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) బోయపాటి శ్రీను బి) సుకుమార్ సి) వీవీ వినాయక్ డి) వంశీ పైడిపల్లి ► శ్రీకాంత్ నటించిన ఓ సినిమాకు హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సినిమా పేరేంటి? ఎ) ఆపరేషన్ దుర్యోధన బి) రాధాగోపాళం సి) కౌసల్య సుప్రజ రామ డి) శ్రీకృష్ణ 2006 ► కార్తీ నటించిన మొదటి సినిమా ‘పరుత్తివీరన్’. అందులో నటించిన హీరోయిన్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరా హీరోయిన్? ఎ) త్రిష బి) ప్రియమణి సి) రీమాసేన్ డి) ఆండ్రియా ► ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్ ఏ పాత్రను పోషిస్తున్నాడో తెలుసా? ఎ) ఆర్మీ ఆఫీసర్ బి) పైలెట్ సి) పోలీసాఫీసర్ డి) నేవల్ ఆఫీసర్ ► ‘అల్లరి’ నరేశ్ తన తర్వాతి చిత్రంలో మొదటిసారి ఓ ప్రముఖ హీరోకి సోదరుడిగా నటిస్తున్నాడు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) యన్టీఆర్ సి) నాని డి) రవితేజ ► తమన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఐ తమన్నా బి) యువర్స్ తమన్నా సి) తమన్నా స్పీక్స్ డి) తమన్నాభాటియా ► విఘ్నేశ్ శివన్ అనే తమిళ దర్శకుడు తెలుగులో చాలామంది టాప్ హీరోలతోనటించిన హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడు. ఆ మలయాళ కుట్టి ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) మమతా మోహన్‌దాస్ బి) నివేథా థామస్ సి) నయనతార డి) అనుపమ పరమేశ్వరన్ ► ‘అర్జున్‌రెడ్డి’ తెలుగు సినిమాను తమిళ్లో ‘వర్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తోన్న ధృవ్ ఓ ప్రముఖ హీరో కొడుకు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సజ్జా సి) కార్తీక్ డి) ప్రభు ► ప్రత్యూష ఫౌండేషన్ అనే సేవాసంస్థ ద్వారా తన సహాయ సహకారాల్ని అందిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్? ఎ) అనుష్క శెట్టి బి) సమంతా అక్కినేని సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) శ్రుతీహాసన్ ► ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కట్ వేసిండే..’ పాట ‘ఫిదా’ చిత్రంలోనిది. ఈ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సుద్ధా అశోక్ తేజ బి) సిరివెన్నెల సి) వనమాలి డి) కృష్ణచైతన్య ► ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవికి 151వ చిత్రం. ఈ చిత్రకథ ఏ తెలుగు ప్రాంతానికి చెందిన కథో తెలుసా? ఎ) రాయలసీమ బి) కోనసీమ సి) తెలంగాణ డి) ఉత్తరాంద్ర ► నటి ఖుష్బూను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ.కోదండరామిరెడ్డి బి) కె.రాఘవేంద్రరావు సి) బి.గోపాల్ డి) కోడి రామకృష్ణ ► ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) ప్రేమనగర్బి) ప్రేమాభిషేకంసి) ప్రేమడి) ప్రేమంటే ఇదేరా ► ఈ ఫొటోలో ఉన్న బాలనటుడు, ఇప్పటి హీరో ఎవరో గుర్తుపట్టగలరా? ఎ) కమల్హాసన్బి) అల్లు అర్జున్సి) తరుణ్ 4) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) డి 3) ఎ 4) ఎ5) ఎ 6) డి 7) సి 8) బి 9) బి 10) ఎ 11) ఎ 12) సి 13) సి 14) ఎ 15) బి 16) ఎ 17) ఎ 18) బి 19) ఎ 20) సి -
చిరుకు జోడీ కుదిరింది
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు భారీ ప్రచారమే లభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. కథ కూడా ఫైనల్ కావటంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టారు. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను చిన్నపాటి మార్పులతో చిరు హీరోగా రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో చిరంజీవి హీరోగా ఠాగూర్ లాంటి ఘన విజయం సాధించిన వివి వినాయక్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కథ కథనాలు కూడా ఫైనల్ అయ్యాయన్న టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్గా నయనతారను ఫైనల్ చేశారు. ప్రస్తుతం సౌత్‌లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా ఉన్న నయన్, ఈ సినిమాతో తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది. చిరు వయసు దృష్ట్యా హీరోయిన్గా నయన్ అయితేనే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి నయన్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే మే నెలలో షూటింగ్ నిమిత్తం నయన్ డేట్స్ కూడా ఇచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.