Gopichand Aaradugula Bullet Movie Release Date Locked - Sakshi
Sakshi News home page

Aaradugula Bullet Movie: బుల్లెట్‌ వస్తోంది

Published Mon, Jun 21 2021 12:06 AM | Last Updated on Mon, Jun 21 2021 12:23 PM

Gopichand Aaradugula Bullet Getting Ready To Release - Sakshi

‘బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర’.. వంటి పలు హిట్‌ చిత్రాలు తీసిన బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. గోపీచంద్‌–నయనతార జంటగా నటించారు. తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

థియేటర్స్‌ రీ ఓపెన్‌  కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌’ థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా తాండ్ర రమేష్‌ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్, నయనతార నటన, బి. గోపాల్‌ డైరెక్షన్‌, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్‌  ఈ సినిమాకి  హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement