స్క్రీన్‌ టెస్ట్‌ | tolly wood movies screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Feb 23 2018 12:47 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

tolly wood movies screen test - Sakshi

స్క్రీన్‌ టెస్ట్‌

► మహేశ్‌బాబు హీరో కాకముందు బాల నటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా?
ఎ) 6  బి) 5  సి) 9  డి) 4

► హీరో రామ్‌ ‘దేవదాసు’ చిత్రం ద్వారా  హీరోగా పరిచయమయ్యాడు. అదే సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్‌ ఎవరు?
ఎ) కాజల్‌ అగర్వాల్‌ బి) హన్సిక  సి) షీలా డి) ఇలియానా

► దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసిన విజయవాడ అమ్మాయి ఎవరో తెలుసా?
ఎ) రంభ  బి) రోజా సి) లయ డి) రవళి

► కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్‌లది చాలా క్రేజీ కాంబినేషన్‌. ఏ చిత్రం ద్వారా ఈ కాంబినేషన్‌ ఫేమస్‌ అయ్యిందో తెలుసా?
ఎ) మామగారు      బి) చినరాయుడు సి) ఆ ఒక్కటీ అడక్కు  డి) మాయలోడు

► ‘మనసుగతి ఇంతే.. మనిషి బతుకింతే.. మనసున్న మనిషికి సుఖము లేదింతే..’ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) ఆత్రేయ  బి) కొసరాజు సి) దాశరథి డి) ఆరుద్ర

► టాలీవుడ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ (గ్రాఫిక్స్‌) స్టూడియోను ప్రారంభించిన హీరో ఎవరో తెలుసా?
ఎ) ఉదయ్‌కిరణ్‌ బి) కల్యాణ్‌రామ్‌సి) నితిన్‌   డి) మంచు విష్ణు

► ‘దిల్‌’ సినిమా నిర్మించటం ద్వారా వెంకటర మణారెడ్డి ‘దిల్‌ రాజు’ అయ్యాడు. మరి ‘దిల్‌’ సినిమా దర్శకుడెవరో చెప్పుకోండి?
ఎ) బోయపాటి శ్రీను బి) సుకుమార్‌ సి) వీవీ వినాయక్‌ డి) వంశీ పైడిపల్లి

► శ్రీకాంత్‌ నటించిన ఓ సినిమాకు హీరో నాని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సినిమా పేరేంటి?
ఎ) ఆపరేషన్‌ దుర్యోధన  బి) రాధాగోపాళం సి) కౌసల్య సుప్రజ రామ డి) శ్రీకృష్ణ 2006

► కార్తీ నటించిన మొదటి సినిమా ‘పరుత్తివీరన్‌’. అందులో నటించిన హీరోయిన్‌కి నేషనల్‌ అవార్డు వచ్చింది. ఎవరా హీరోయిన్‌?
ఎ) త్రిష      బి) ప్రియమణి సి) రీమాసేన్‌  డి) ఆండ్రియా

► ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్‌ ఏ పాత్రను పోషిస్తున్నాడో తెలుసా?
ఎ) ఆర్మీ ఆఫీసర్‌ బి) పైలెట్‌ సి) పోలీసాఫీసర్‌ డి) నేవల్‌ ఆఫీసర్‌

► ‘అల్లరి’ నరేశ్‌ తన తర్వాతి చిత్రంలో మొదటిసారి ఓ ప్రముఖ హీరోకి సోదరుడిగా నటిస్తున్నాడు. ఎవరా హీరో కనుక్కోండి?
ఎ) మహేశ్‌బాబు బి) యన్టీఆర్‌ సి) నాని  డి) రవితేజ

► తమన్నా ట్విట్టర్‌ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?
ఎ) ఐ తమన్నా     బి) యువర్స్‌ తమన్నా సి) తమన్నా స్పీక్స్‌  డి) తమన్నాభాటియా

► విఘ్నేశ్‌ శివన్‌ అనే తమిళ దర్శకుడు తెలుగులో చాలామంది టాప్‌ హీరోలతోనటించిన హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడు. ఆ మలయాళ కుట్టి ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) మమతా మోహన్‌దాస్‌  బి) నివేథా థామస్‌ సి) నయనతార  డి) అనుపమ పరమేశ్వరన్‌

► ‘అర్జున్‌రెడ్డి’ తెలుగు సినిమాను తమిళ్‌లో ‘వర్మ’ అనే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తోన్న ధృవ్‌ ఓ ప్రముఖ హీరో కొడుకు. ఎవరా హీరో?
ఎ) విక్రమ్‌ బి) అర్జున్‌ సజ్జా సి) కార్తీక్‌ డి) ప్రభు

► ప్రత్యూష ఫౌండేషన్‌ అనే సేవాసంస్థ ద్వారా తన సహాయ సహకారాల్ని అందిస్తున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌?
ఎ) అనుష్క శెట్టి     బి) సమంతా అక్కినేని సి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌  డి) శ్రుతీహాసన్‌

► ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే క్రీమ్‌ బిస్కట్‌ వేసిండే..’ పాట ‘ఫిదా’ చిత్రంలోనిది. ఈ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) సుద్ధా అశోక్‌ తేజ బి) సిరివెన్నెల సి) వనమాలి    డి) కృష్ణచైతన్య

► ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవికి 151వ చిత్రం. ఈ చిత్రకథ ఏ తెలుగు ప్రాంతానికి చెందిన కథో తెలుసా?
ఎ) రాయలసీమ   బి) కోనసీమ సి) తెలంగాణ    డి) ఉత్తరాంద్ర

► నటి ఖుష్బూను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఎ.కోదండరామిరెడ్డి బి) కె.రాఘవేంద్రరావు  సి) బి.గోపాల్‌        డి) కోడి రామకృష్ణ

► ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) ప్రేమనగర్‌బి) ప్రేమాభిషేకంసి) ప్రేమడి) ప్రేమంటే ఇదేరా

► ఈ ఫొటోలో ఉన్న బాలనటుడు, ఇప్పటి హీరో ఎవరో గుర్తుపట్టగలరా?
ఎ) కమల్‌హాసన్‌బి) అల్లు అర్జున్‌సి) తరుణ్‌ 4) మహేశ్‌బాబు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి 2) డి 3) ఎ 4) ఎ5) ఎ 6) డి 7) సి 8) బి 9) బి 10) ఎ

11) ఎ 12) సి 13) సి 14) ఎ 15) బి 16) ఎ 17) ఎ 18) బి 19) ఎ 20) సి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement