ఆట పాట | syera narasimha reddy regular starts on wednesday | Sakshi
Sakshi News home page

ఆట పాట

Published Mon, Nov 5 2018 1:21 AM | Last Updated on Mon, Nov 5 2018 1:21 AM

syera narasimha reddy regular starts on wednesday - Sakshi

ఇటీవల జార్జియాలో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించారు ‘సైరా’ టీమ్‌. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలుకానుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం నుంచి స్టార్ట్‌ కానుందని సమాచారం.

ఈ షెడ్యూల్‌లోనే నయనతార, తమన్నా పాల్గొంటారు. చిరంజీవి, నయనతార, తమన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలతోపాటుగా పాటలను కూడా చిత్రీకరించనున్నారట. ఆల్రెడీ యాభైశాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యిందని వినికిడి. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement