నల్ల మనసు | Nayanatara is the latest Tamil film Mr Lokal | Sakshi
Sakshi News home page

నల్ల మనసు

Published Sun, Feb 10 2019 1:40 AM | Last Updated on Sun, Feb 10 2019 1:40 AM

Nayanatara is the latest Tamil film Mr Lokal - Sakshi

సెట్‌లో వాచ్‌లను పంచి పెట్టారు కథానాయిక నయనతార. తాజా తమిళ చిత్రం ‘మిస్టర్‌ లోకల్‌’లో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారీ బ్యూటీ. అందుకే యూనిట్‌ సభ్యులకు  ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చారు. ఇది తెలిసిన ఆమె అభిమానులు నయనతారది నల్ల (మంచి)మనసు అని అభిమానంగా చెప్పుకుంటున్నారు. శివ కార్తీకేయన్, నయనతార జంటగా రాజేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

రాధిక, సతీష్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలను కుంటున్నారు. ఈ ‘మిస్టర్‌ లోకల్‌’ సినిమా తెలుగులో నాని హీరోగా నటించిన ‘నేను లోకల్‌’ సినిమాకు రీమేక్‌ అనే వార్తలను ఖండించింది చిత్రబృందం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటీవల ‘ఎన్‌జీకే’ షూటింగ్‌ పూర్తయినప్పుడు సూర్య, ‘కాట్రిన్‌మొళి’ కంప్లీట్‌ అయినప్పుడు జ్యోతిక ఆయా చిత్రబృందాలకు గోల్డ్‌ కాయిన్స్‌ను బహుకరించిన విషయం తెలిసిందే.  అలాగే ‘పందెం కోడి 2’ పూర్తయినప్పుడు కీర్తీ సురేశ్‌ గోల్డ్‌ కాయిన్స్‌ ఇచ్చారు. మొత్తానికి కోలీవుడ్‌లో ఇలా బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ అయింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement