
నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’. ముక్కుపుడుక అమ్మవారు అని అర్థం. ఆర్‌జే బాలాజీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. భూమి మీదకు వచ్చిన అమ్మవారికి, ఓ సాధారణ మనిషికి మధ్య జరిగే సంఘటనలే ఈ చిత్రకథాంశం. అమ్మవారి పాత్ర కోసం షూటింగ్ జరిగినన్నాళ్లూ నయనతార పూర్తి శాకాహారిగా మారిపోయారు. అమ్మవారి పాత్రలో ఆమె లుక్‌కి మంచి స్పందన కూడా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment