ఓటీటీలోనే మారా! | Madhavan and Shraddha Srinath Maara opts for an OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలోనే మారా!

Published Fri, Sep 18 2020 7:13 AM | Last Updated on Fri, Sep 18 2020 7:20 AM

Madhavan and Shraddha Srinath Maara opts for an OTT - Sakshi

మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’. నూతన దర్శకుడు దిలీప్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్‌. దుల్కర్‌ సల్మాన్‌ చేసిన పాత్రను మాధవన్‌ చేశారు. హీరోయిన్‌ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించారు. లాక్‌డౌన్‌ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందట. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement