భార్యకు బహుమతిగా ఆ సినిమా.. స్టార్ హీరో కామెంట్స్! | Vikram Prabhu Speech At Irugapatru Movie | Sakshi
Sakshi News home page

Vikram Prabhu: కొత్త మూవీపై విక్రమ్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Thu, Sep 28 2023 5:39 PM | Last Updated on Thu, Sep 28 2023 5:45 PM

Irugapatru Movie Vikram Prabhu Comments - Sakshi

మానగరం, మాన్‌స్టర్‌, టాణాకారన్‌ లాంటి డిఫరెంట్ హిట్ సినిమాలని నిర్మించిన పొటాన్షియల్‌ స్టూడియోస్‌ సంస్థ తీసిన కొత్త మూవీ 'ఇరుగప్పట్రు'. విక్రమ్‌ప్రభు, విధార్థ్‌, శ్రీ, శ్రద్ధాశ్రీనాథ్‌, సానియా అయప్పన్‌, అపర్నది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'ఎలి' ఫేమ్‌ యువరాజ్‌ దయాళన్‌ దర్శకత్వం వహించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందించారు. అక్టోబర్‌ 6న థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ)

రిలీజ్ దగ్గరపడిన సందర్భంగా చైన్నెలోని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ టైలర్‌మేడ్‌ పాత్ర పోషించారని, ఈ మూవీ కోసం బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. నటుడు విధార్ధ్‌ పారితోషికం లేకుండానే ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారని తెలిపారు. 

నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. అక్టోబరు తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. అక్టోబరు 6 తన తాతగారు శివాజీగణేశన్‌ పుట్టినరోజు అని, అలానే తన భార్య పుట్టినరోజు కూడా అని చెప్పాడు. అందుకే ఆ చిత్రాన్ని తన భార్యకు బహమతిగా ఇస్తానని చెప్పానని పేర్కొన్నాడు. 

(ఇదీ చదవండి: 'స్కంద' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement