ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్‌గా 'జెర్సీ' బ్యూటీ | Actress Shraddha Srinath Interesting Comments On Irugapatru Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Shraddha Srinath On Irugapatru: ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్‌గా 'జెర్సీ' బ్యూటీ

Published Wed, Oct 4 2023 4:09 PM | Last Updated on Wed, Oct 4 2023 4:34 PM

Actress Shraddha Srinath Comments On Irugapatru Movie - Sakshi

శ్రద్ధ శ్రీనాథ్‌.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ నాని 'జెర్సీ' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 'విక్రమ్‌ వేద' మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేర్కొండ పార్వై' చిత్రంతో సత్తాచాటింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. తమిళంలో చేసిన కొత్త సినిమా 'ఇరుగపట్రు'. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

యువరాజ్‌ దయాళన్‌ దర్శకత్వంలో పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్‌ ప్రభు, విధార్థ్, శ్రద్ధా శ్రీనాథ్, మహిమా నంబియార్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్‌.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత జనరేషన్ ఈగో సమస్యల కాన్సెప్ట్‌తోనే 'ఇరుగపట్రు' తీశారని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. 

(ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement