శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064’’. ఆర్‌కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధం కానుంది. అసలే కలియుగమ్.. ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబోతున్నారు? ఎలా చావబోతున్నారు? అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల విడుదల చేశారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే దక్షిణాది భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్ర పోషించారు.
ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నార్వేలో చేశారు. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరమని, ఇది యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment