
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు.

వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్‌కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము.

ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment