
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్‌లో విశ్వక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెప్తూనే శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

ఫలక్‌నుమా దాస్ సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్‌నే తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment