గులాబీలు గుప్పే పిల్లడే... | Mechanic Rocky Movie Guulledu Lyrical Video Song | Sakshi
Sakshi News home page

గులాబీలు గుప్పే పిల్లడే...

Published Thu, Aug 8 2024 5:19 AM | Last Updated on Thu, Aug 8 2024 5:19 AM

Mechanic Rocky Movie Guulledu Lyrical Video Song

‘‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే...’ అంటూ మొదలవుతుంది ‘మెకానిక్‌ రాకీ’ సినిమాలోని ‘గుల్లేడు గుల్లేడు...’ పాట. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో ‘గుల్లేడు గుల్లేడు..’ అంటూ సాగే ఫోక్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. జేక్స్‌ బిజోయ్‌ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. 

‘జాతి రత్నాలు’ దర్శకుడితో...  మంగళవారం విశ్వక్‌ 13వ సినిమా ప్రకటన రాగా, బుధవారం ఆయన 14వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement