బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన తమిళ మూవీ! | 'Irugapatru' Movie Successfully Running In Theatres | Sakshi
Sakshi News home page

Irugapatru Movie: బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన తమిళ మూవీ!

Published Mon, Oct 9 2023 10:19 AM | Last Updated on Mon, Oct 9 2023 10:36 AM

Irugapatru Movie Successfully Running In Theatres - Sakshi

హీరో విక్రమ్‌ ప్రభు, విదార్థ్‌, శ్రద్ధ శ్రీనాథ్‌, అపర్ణతి, సానియా అయ్యప్పన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్‌ దయాళ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్‌. ప్రభు తన పొటన్షియల్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు.

ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అయిందని ఆయన పేర్కొన్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement