
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment