Madhavan Nair
-
క్రికెటర్లుగా మారిన సినీతారలు.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందండోయ్!
ఆటకు వేళాయె అంటూ కొందరు స్టార్స్ ప్లేయర్స్‌గా మారారు. క్రికెటర్లుగా, కోచ్‌లుగా మౌల్డ్ అయిపోయారు. అయితే ఈ ఆట అంతా సినిమాల కోసమే. ప్రస్తుతం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి. కొన్ని కాల్పనిక కథలు కాగా, కొన్ని బయోపిక్స్ కూడా ఉన్నాయి. ఇక వెండితెరపై క్రికెటర్లుగా అలరించనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ మీద ఉన్నారు. ‘లాల్ సలామ్’ చిత్రం కోసమే ఇదంతా. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో, రజనీకాంత్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తారనీ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా కనిపిస్తారనీ ప్రచారం జరుగుతోంది. మరి.. రజనీ ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి. ‘లాల్ సలామ్’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ► క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉంటున్నారు మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురూ కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఆడనున్న మ్యాచ్ ‘ది టెస్ట్’. తమిళ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ► శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంలో సలీమ్ మాలిక్ పాత్ర చేసిన మధుర్ మిట్టల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్ర చేస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. ‘‘మురళీధరన్ జీవితంలోని పలు కోణాలను ఈ చిత్రంతో వెండితెరపై ఆవిష్కరించనున్నాం. 800 వికెట్లు తీసిన ఏకైక ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మురళీధరన్ పేరిట రికార్డు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ► భారత ప్రముఖ మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ మూవీ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’. ఇందులో జులన్ గోస్వామిగా అనుష్కా శర్మ నటించారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. పశ్చిమ బెంగాల్ చక్దా ప్రాంతానికి చెందిన జులన్ గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలు మహిళా క్రికెటర్‌గా, కెప్టెన్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ను లీడ్ చేశారు. ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జులన్ రికార్డు సాధించారు. ► యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం క్రికెట్ బ్యాట్ పట్టారు. ‘మిస్టర్ అండ్ మిస్ట్రస్ మహి’ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్‌గా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రియల్ క్రికెటర్స్ దగ్గర శిక్షణ తీసుకుని జాన్వీ కపూర్ ఈ సినిమా చేశారు. వీరితోపాటు మరికొందరు క్రికెటర్ల బయోపిక్‌లు, క్రికెట్ ఆధారంగా సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ఇస్రో ప్రయోగం విఫలం: మాజీ ఛైర్మన్ దిగ్భ్రాంతి
సాక్షి, బెంగళూరు: ఇస్రో ప్రయోగం విఫలం కావడంపై సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలంకావడంపై స్పందించిన ఆయన ఇది మనందరికీ షాక్. కానీ షాక్ నుండి త్వరగా కోలుకుని, మళ్లీ ట్రాక్‌లో వస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో, వైఫల్యానికి మూల కారణాన్ని గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇస్రో సిబ్బందికి అంతటి సామర్థ్యముందని నాయర్ పేర్కొన్నారు. ఈ రకమైన ఎదురుదెబ్బలు అసాధారణమైనవేమీ కాదని, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఇస్రోకు సూచించారు. క్రయోజెనిక్ టెక్నాలజీపై ప్రావీణ్యతను సాధించిన ఇస్రో దృఢత్వంపై తనకు విశ్వాసముందన్నారు. ఇది చాలా క్లిష్టమైన మిషన్ అని పేర్కొన్న ఆయన సాధారణంగా, అన్ని ఇతర రాకెట్ ప్రొపల్షన్‌లతో పోలిస్తే క్రయోజెనిక్ స్టేజ్ చాలా కష్టమైందని వెల్లడించారు. క్రయోజెనిక్ దశలో వైఫల్యం దాదాపు 20 శాతం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు, రష్యాతో పోలిస్తే దాని ట్రాక్ రికార్డ్ బావుందని ఈ నేపథ్యంలో ఇస్రో తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. కాగాజీఎస్‌ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి రాకెట్ ప్రయోగం తొలి, రెండో దశలో సాధారణంగానే ఉన్నప్పటికీ మూడో దశలో రాకెట్ గతి తప్పిందని తెలిపిందే. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిన ఫలితంగా ఉద్దేశించిన మిషన్ పూర్తి కాలేదని స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. 2003 నుండి ఆరేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న మాధవన్ 25 మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
నిశ్శబ్దం కూడా...
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు. -
ఓటీటీలోనే మారా!
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’. నూతన దర్శకుడు దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్. దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రను మాధవన్ చేశారు. హీరోయిన్ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. లాక్డౌన్ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందట. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. -
20 ఏళ్ల సినీ ప్రస్థానం రెండు నిమిషాల్లో...
నటుడు ఆర్ మాధవన్ అంటే సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. సీరియల్ యాక్టర్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మాధవన్ సినీ నటుడిగా ఎదిగి వివిధ బాషలో నటించారు. నటన జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఆయన సినీ ప్రస్థానానికి సంబంధించి ఈ 20 ఏళ్లలో చేసిన సినిమాలను 2 నిమిషాల కన్నా తక్కువ నిడివిలో తెలిపే ఒక వీడియోని మాధవన్ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను హియాచద్దా రూపొందారు. దీనికి వాటర్ మిలన్ షుగర్ అని పేరు పెట్టారు. ఈ వీడియో వెనుక వినిపిస్తున్న సాంగ్‌ను హారీ స్టైల్స్ పాడారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మాధవన్ వీడియోను రూపొందిన హియా చద్దాకు కృతజ్ఙతలు తెలిపారు. (ఆ అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?) ‘20 యేళ్ల ప్రస్థానాన్ని 2 నిమిషాల్లో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన తరువాత అభిమానులు మాధవన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీని పై స్పందించిన ఒక అభిమాని మీరు మూడు నిమిషాలలో చాలా హృదయాలను గెలుచుకున్నారు అని కామెంట్ చేశాడు. మాధవన్ 90వ దశకంలో జీనే భీ దో యారో అనే హిందీ సీరియల్లో నటించారు. అలాగే కొన్ని సీరియల్స్ చేసిన అనంతరం ‘ఇన్ఫెర్నో’ సినిమాతో 1997లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మాధవన్ సఖి, చెలి వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. (మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం) View this post on Instagram Thank you so much Hiya Chadha. 20 years of a career in less than 2 min. Nostalgic ..❤️❤️❤️🙏🙏 A post shared by R. Madhavan (@actormaddy) on Jul 5, 2020 at 9:39am PDT -
జర్నలిస్ట్ షారుక్!
హీరో మాధవన్‌ను ప్రశ్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.. ఏం ప్రశ్నించారు? వాటికి మాధవన్ సమాధానాలు ఏమిటి? అనేవి వెండితెరపైనే తెలుసుకోవాలి. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో నటించి, దర్శకత్వం వహించారు మాధవన్ . జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నారు షారుక్ ఖాన్ . నంబి నారాయణన్ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే సన్నివేశంతో ‘రాకెట్రీ’ సినిమా మొదలై, ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి వెళుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. షారుక్ నటించిన గత చిత్రం ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
టాప్‌లో 3 ఇడియట్స్!
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్‌కి తాళం పడిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని ఈ పరిస్థితిలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న సినిమాలను చూస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న యుఎస్‌లో లాక్డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ నిలిచింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు హిరాణీ. ఇక ‘ది డార్క్‌నైట్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘ఇన్సెప్షన్’, ‘మ్యారేజ్ స్టోరీ’ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా యూఎస్ ప్రజానీకం ఎక్కువగా వీక్షించారు. -
ఆ అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?
‘‘అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్ చేశారంట.. కానీ ఎవరో ఏంటో కనిపించలేదంటున్నారు’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘నిన్న ఆర్ఫనేజ్‌కు వెళ్లిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి’, ‘ఇదంతా ఓ పాతికేళ్ల అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?’... వంటి ‘నిశ్శబ్దం’ చిత్రం ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో నాని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, ‘‘ఇదిగో.. మా స్వీటీ (అనుష్క) స్వీటెస్ట్ ‘నిశ్శబ్దం’ ట్రైలర్.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు. ‘‘ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న అనుష్క, మాధవన్ కొన్ని భయానకమైన విషయాలను చూస్తారు.. ఆ ఇంట్లో ఏముందోనని పోలీసుల అన్వేషణతో సినిమా నడుస్తుంది. మరో హీరోయిన్ అంజలి అమెరికన్ పోలీసాఫీసర్ పాత్రలో కనపడుతుంది. మాట్లాడలేని, చెవులు వినపడని బధిర అమ్మాయి సాక్షి పాత్రలో నటించిన అనుష్క తన సైగలతో అంజలికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. అసలు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎవరు? దెయ్యం ఇల్లు ఏంటి? అందులో జరిగే కథేంటి?’’ వంటి విషయాలన్నీ తెలియాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మాధవన్, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
వేసవిలో నిశ్శబ్దం
‘నిశ్శబ్దం’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖారరైంది. అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. -
తేదీ కుదిరింది
అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఈ నెల 31న విడుదల కావాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను నిర్ణయించారని సమాచారం. అనుష్క, మాధ వన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్, హాలీవుడ్ క్రాస్ ఓవర్ (రెండు ప్రాంతాల నటీనటులు కలసి నటించడం) చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ నిశ్శబ్దం
‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నాం. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్‌లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్ చేసిన స్కిప్ట్ర్ ‘నిశ్శబ్దం’. అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్‌లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్. హాలీవుడ్ రేంజ్లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘టెక్నికల్‌గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్‌గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్. -
సోనాలి... వాయిస్ ఆఫ్ సాక్షి
సాక్షి మాట్లాడలేరు. కేవలం సైగలతోనే స్పందిస్తారు. ఆ సైగల్ని సరిగ్గా అర్థం చేసుకోగల అమ్మాయి ఒకరున్నారు. ఆమే సోనాలి. సాక్షి గొంతు. ఆ సోనాలి పాత్రను పోస్టర్ ద్వారా సోమవారం పరిచయం చేసింది చిత్రబృందం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ‘సాక్షి’ అనే మూగ పెయింటర్ పాత్రలో అనుష్క నటించారు. సోనాలి పాత్రలో షాలినీ పాండే నటించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
బర్త్‌డే స్పెషల్
నిశ్శబ్ధంగా అమెరికాలో చిత్రీకరణ పూర్తి చేశారు ‘నిశ్శబ్ధం’ చిత్రబృందం. ఆల్రెడీ సినిమాలో అనుష్క, మాధవన్ లుక్స్‌ను విడుదల చేశారు. ఇప్పుడు టీజర్ రెడీ అని తెలిసింది. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను నవంబర్ 7న విడుదల చేయనున్నట్టు సమాచారం. నవంబర్ 7 అనుష్క బర్త్‌డే. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా ఈ టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం అమెరికా, ఇండియాలో ఏకకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటించారు. -
సైగల కోసం శిక్షణ
‘నిశ్శబ్దం’ సినిమాలో మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఆమె లుక్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమాలో సాక్షి పాత్రను చేయడానికి అనుష్క ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నారని తెలిసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, మైఖెల్ మ్యాడిసన్, అంజలి, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. చిత్రకారిణిగా నటించడం కోసం పెయింటింగ్ ప్రాక్టీస్ చేశారట అనుష్క. మాట్లాడలేనివాళ్లు సైగల ద్వారా సంభాషించుకుంటారు కదా. ఆ సైన్ భాష కూడా నేర్చుకున్నారట అనుష్క. అటు పెయింటింగ్, ఇటు సైగలను ఆరునెలల పాటు అభ్యసించి, సాక్షి పాత్రను చేశారట అనుష్క. ఈ ఏడాది చివర్లో ‘నిశ్శబ్దం’ విడుదల కానుంది. -
సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి
గత ఏడాది జనవరిలో విడుదలైన ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. బొమ్మలు గీస్తూ చూస్తున్న అనుష్క పోస్టర్‌పై ‘సాక్షి, ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఇందులో సాక్షి అనే మూగ చిత్రకారిణిగా అనుష్క నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్. -
మాది తొలి హాలీవుడ్ క్రాస్ఓవర్ చిత్రం
‘‘హాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కాంబినేషన్లో వస్తున్న తొలి ‘క్రాస్ఓవర్’ (రెండు వేరువేరు ఇండస్ట్రీలలోని నటులు కలసి పని చేయడాన్ని క్రాస్ ఓవర్ అంటారు) చిత్రం ‘నిశ్శబ్దం’. రెండేళ్లు ప్రయాణం చేసి రికార్డ్ టైమ్‌లో షూటింగ్ పూర్తి చేశాం. సెప్టెంబర్‌లో టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ సినిమా విశేషాల గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ హిట్ చిత్రం ‘కిల్‌బిల్’ సినిమాలో విలన్‌గా నటించిన మైఖేల్ మ్యాడిసన్‌తో పాటు 7–8 మంది హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా మా సినిమాకు పని చేశారు. అమెరికాలోని సియోటల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ మొత్తం సాగుతుంది. నలుగురు ఇండియన్స్‌కి అమెరికన్ పోలీసుల మధ్య జరిగిన క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా కేవలం బహుభాషా చిత్రమే కాకుండా బహు ప్రాంతాలకు చెందిన చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. గ్రాఫిక్స్‌కి స్కోప్ ఉన్న కథ. అన్నీ అనుకున్నట్లు కుదిరితే డిసెంబర్లోనే విడుదల చేస్తాం. లేకపోతే జనవరిలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నిశ్శబ్దంగా పూర్తయింది
ఈ మధ్య కాలంలో సినిమా పూర్తి కావాలంటే తక్కువలో తక్కువ ఆరునెలలు టైమ్ పడుతుంది. కానీ ‘నిశ్శబ్దం’ చిత్రబృందం సైలెంట్‌గా రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా మొత్తం షూటింగ్‌ని అమెరికాలోని సీటెల్‌లో జరిపారు. సైలెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కొందరు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించారు. ‘‘షూటింగ్ పూర్తయింది. ఈ థ్రిల్లర్‌ను మీ అందరికీ త్వరగా చూపించేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. -
ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!
మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను మ్యాడీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా..‘ ఎడిటింగ్ చాలా సరదాగా సాగపోతుంది. ఎంజాయ్ చేస్తున్నా. అదే సమయంలో ఎంతో భయపడుతున్నా. నేటితో ఈ ప్రయాణం ముగిసింది. నిజంగా వృద్ధుడిని అయిపోతున్నా అంటూ తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న మాధవన్ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని.. ‘నాకిప్పుడు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పేం లేదు కదా’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఇందుకు స్పందించిన మ్యాడీ.. ‘ఆ దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. నాకంటే ఎంతో విలువైన వ్యక్తిని భాగస్వామిగా పొందుతావు’ అంటూ ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. కాగా మాధవన్ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు అందగాడు మాత్రమే కాదు. మనసున్న వారు. మీ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో కలిసి నటించిన మాధవన్, సిమ్రాన్ ఈ సినిమాలో మరోసారి జంటగా కనిపించనున్నారు. వీరితో పాటు హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ రాకెట్రీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram Editing is so much fun and exhausting:. Enjoying and fearing it..End of long travel day. Definitely getting older .. 🤣🤣🚀🚀🙏🙏#rocketrythefilm #actormaddy #Rocketryfilm A post shared by R. Madhavan (@actormaddy) on Jul 23, 2019 at 11:08am PDT -
సైగలే మాటలు
మాటల్లేవ్. ఓన్లీ సైగలే అంటున్నారు అనుష్క. అందుకే చేతులతో సైగలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడున్న ఫొటోలో చేతులు చూశారు కదా. ఇది అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’ టైటిల్ పోస్టర్ లుక్. అనుష్క ఇండస్ట్రీలోకి వచ్చి పద్నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుష్క బదిర యువతి (చెవిటి మూగ) పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మరో హీరోయిన్ అంజలి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆర్. మాధవన్, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ దాదాపు ముగిసిందని తెలిసింది. యునైటెడ్ స్టేట్స్లోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీనివాస్ అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్, సుబ్బరాజు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. -
కుశాలీ ఖుషీ
హీరోయిన్గా తొలి అవకాశం వస్తే ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతేస్తుంది. అదీ మాధవన్ లాంటి నటుడు హీరో అంటే ఇక ఆ అమ్మాయి ఆనందం రెట్టింపు కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ కుశాలీ కుమార్ మాత్రం భయపడుతున్నారు. అశ్విన్ నీల్ మణి దర్శకుడిగా పరిచయం అవుతూ బాలీవుడ్లో ‘దహి చీని’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించనున్నారు. టీ–సీరిస్ వ్యవస్థాపకుడు, మ్యూజిక్ మొఘల్ గుల్షాన్ కుమార్ రెండో కుమార్తె, నిర్మాత భూషణ్ కుమార్ చెల్లి కుశాలీ కుమార్ ఈ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘‘హీరోయిన్గా నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. కానీ మాధవన్ లాంటి మంచి యాక్టర్‌తో కలిసి నటించాలంటే మాత్రం భయంగా ఉంది. అయితే బాగా కష్టపడి నా వంతు ప్రయత్నం చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు కుశాలీ. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. -
నిశ్శబ్దాన్ని విందాం
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ‘సూపర్’ (2005) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అనుష్కా శెట్టి. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’ (2006), ‘లక్ష్యం’ (2007), ‘అరుంధతి’ (2010), ‘మిర్చి’ (2013), ‘బాహుబలి’ (2017), ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ (2018) వంటి సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకులతో సూపర్ హీరోయిన్ అనిపించుకున్నారు అనుష్క. ఆమె నటించిన తొలి సినిమా ‘సూపర్’ విడుదలై ఈ నెల 21తో 14 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’లోని ఫస్ట్ లుక్‌ను ఈ ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బదిర యువతి (చెవిటి, మూగ) పాత్ర చేస్తున్నారు అనుష్క. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్‌లో జరుగుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
స్పేస్ జర్నీ ముగిసింది
‘రాకెట్రీ’లో మాధవన్ అంతరిక్ష ప్రయాణం సెర్బియాలో ముగిసింది. మాధవన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రానికి దర్శకుడు కూడా మాధవనే కావడం విశేషం. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం ఇది. ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాళ్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో మాధవన్, సిమ్రాన్ నటించారు. ‘‘రాకెట్రీ సినిమా ముగిసింది. నా జీవితంలోనే అత్యద్భుతంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. నా హృదయం ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయింది’’ అన్నారు మాధవన్. ఇందులో హాలీవుడ్ యాక్టర్లు రాన్ డోనాచీ (గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్), ఫిలిస్ లోగాన్ కీలక పాత్రలు చేశారు. -
అమెరికాలో సైలెంట్‌గా...
‘బాహుబలి’ తర్వాత అనుష్క నెక్ట్స్ సినిమా పట్ల చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏ సినిమా చేస్తున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ‘సైలెంట్’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడిసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్ షానీ డియోల్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మాధవన్ నాయర్‌కు బెయిల్
న్యూఢిల్లీ: యాంత్రిక్స్–దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి సమానమైన 2 పూచీకత్తులపై జడ్జి సంతోష్ స్నేహిమన్ శనివారం బెయిలిచ్చారు. బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. నిందితులకు బెయిల్ లభిస్తే వారు దేశం నుంచి పారిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాయర్‌తో పాటు ఇస్రో మాజీ డైరెక్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ శ్రీధర్ మూర్తిలకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాని మరో ముగ్గురికి బెయిల్ నిరాకరించింది. వీడియో, మల్టీమీడియా సేవలందించే ఎస్–బ్యాండ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అప్పగించడం ద్వారా యాంత్రిక్స్ కార్పొరేషన్ రూ.578 కోట్ల నష్టానికి కారణమైందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.