న్యూఢిల్లీ: యాంత్రిక్స్–దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి సమానమైన 2 పూచీకత్తులపై జడ్జి సంతోష్ స్నేహిమన్ శనివారం బెయిలిచ్చారు. బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. నిందితులకు బెయిల్ లభిస్తే వారు దేశం నుంచి పారిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాయర్‌తో పాటు ఇస్రో మాజీ డైరెక్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఆర్ శ్రీధర్ మూర్తిలకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాని మరో ముగ్గురికి బెయిల్ నిరాకరించింది. వీడియో, మల్టీమీడియా సేవలందించే ఎస్–బ్యాండ్‌ను దేవాస్ మల్టీమీడియాకు అప్పగించడం ద్వారా యాంత్రిక్స్ కార్పొరేషన్ రూ.578 కోట్ల నష్టానికి కారణమైందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment