
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
వివరాల ప్రకారం.. లిక్కర్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, అందుకు ఆరు వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్ కోరుతూ శరత్‌చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్ దాఖలుచేయగా నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే, తాజాగా తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా శరత్ చంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు దిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఢిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: రేపటి వరకు లాస్ట్.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కార్ వార్నింగ్..
Comments
Please login to add a commentAdd a comment