sharath chandra reddy
-
లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్.. శరత్ చంద్రారెడ్డికి బెయిల్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. వివరాల ప్రకారం.. లిక్కర్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, అందుకు ఆరు వారాలు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్ కోరుతూ శరత్‌చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్ దాఖలుచేయగా నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా శరత్ చంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు దిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఢిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: రేపటి వరకు లాస్ట్.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సర్కార్ వార్నింగ్.. -
సమావేశానికి పిలవాల్సిన అవసరమేంటి? వారే రావాలి: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు కాస్తా.. నేతల మధ్య చాపకింద నీరులా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమవడంతో కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంగళవారం దేవరయాంజల్లో జరిగిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.. సమ్మేళనానికి ఆహ్వానం లేకపోవటం వల్లే హాజరు కాలేదని సుధీర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్కొంటుండగా, వారిని పిలవాల్సిన అవసరమేంటి..? వారే రావాలని మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలని అధిష్టానమే ఆదేశించిందని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిని తాను పిలవడం ఏంటని.. వారే రావాలి కదా అని మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. గతంలో మండల, పురపాలక స్థాయి సమావేశాల్లో పాల్గొన్న వారిని.. ఎవరు పిలిస్తే వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆ సమావేశాలకు ఆహ్వానం ఉండటం వల్లే పాల్గొన్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారాన్ని, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఇలా.. మేడ్చల్ జిల్లాలో దాదాపు నెల రోజులుగా మండల, పురపాలక సంఘాలు, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాల విజయవంతం కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. మార్చి 24 నుంచి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుండగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం 10 పురపాలక సంఘాలు, 5 మండలాల సమావేశాలకు 6 పురపాలికలు, 4 మండలాల్లో మాత్రమే జరిగాయి. ఇంకా పీర్జాదిగూడ, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ పురపాలక సంఘాలతోపాటు ఎంసీపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేదాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోతాయని భావించినా.. మరింత ముదురుతుండటంతో పరిస్థితి ఎక్కడి దారి తీస్తుందోనని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. గతంలోనే మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు లేవు. గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్న విషయం తేల్సిందే. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను కూడా మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తేల్సిందే. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోగా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోŠల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నప్పటికీ వారి మధ్యనే విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. మూడింటిలో తారస్థాయిలో.. మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ మినహాయించి మిగతా కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చాపకింద నీరులా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు మాత్రం సజావుగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆత్మీయ సమ్మేళనాల తీరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల బోడుప్పల్ పురపాలక సంఘంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దీనికి నిదర్శంగా నిలుస్తోంది. బోడుప్పల్ సమ్మేళనంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా సమన్వయకర్త, పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. వాగ్వాదాలకు దిగడం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది. -
మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తమపై అవాకులు చెవాకులు పేలుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థాగత కమిటీల్లో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నందున జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని శరత్ చంద్రారెడ్డి చెప్పారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ఆవరణలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, శరత్‌లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించడంతోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జిల్లా టీఆర్ఎస్ నేతలతో సమావేశమవుతానని కేసీఆర్ సర్దిచెప్పినట్లు సమాచారం. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని, అందువల్ల తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరత్ చంద్రారెడ్డి వెల్లడించారు. కాగా అసెంబ్లీకి వచ్చిన శరత్ చంద్రారెడ్డికి విజిటర్ పాస్ లేకపోవడంతో పోలీసులు లోనికి అనుమతించలేదు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఆయనను లోనికి తీసుకెళ్లారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
గుండెపోటుతో తరిమెల శరత్‌చంద్రారెడ్డి మృతి
శింగనమల: వైఎస్సార్సీపీ రైతు విభాగం రాయలసీమ కో–ఆర్డినేటర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి(63) గుండెపోటుతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో గురువారం మృతి చెందారు. ఈనెల 12న ఆయనకు గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించగా స్టెంట్ వేశారు. ఆ తర్వాత వెన్నెముక సమస్య తలెత్తడంతో బుధవారం కిమ్స్‌లో చేరారు. గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. తరిమెల శరత్‌చంద్రారెడ్డి కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే తరిమెల రంగారెడ్డి రెండో కుమారుడు. శరత్‌చంద్రారెడ్డి తొలుత 2009లో టీడీపీలో చేరి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2014 వరకు అదే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ప్రసుత్తం రాయలసీమ రైతు విభాగం కో–ఆర్డినేటర్‌గా ఉన్నారు. రైతు సంఘాల సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన రైతు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. భూగర్భజలం తగ్గిపోతోందని అందోళన చేశారు. ఈ విషయమై జైలు జీవితం గడిపారు. ఆయనకు భార్య, కుమారుడు వంశీగోకుల్‌రెడ్డి, కుమార్తె గాయత్రి ఉన్నారు. శింగనమలలో విషాదఛాయలు.. తరిమెల శరత్‌చంద్రారెడ్డి మృతితో శింగనమల మండలంలో విషాదం అలుముకుంది. శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహితం సాధ్యమా?
-
గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహితం సాధ్యమా?
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయరంగం కుదేలయిందని, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... దేశానికి ఆహారభద్రత అందించే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత ఆర్థికవ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు సత్వరమే చర్యలు తీసుకోకుంటే రైతాంగం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుందని తెలిపారు.