
గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహితం సాధ్యమా?
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యవసాయరంగం కుదేలయిందని, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... దేశానికి ఆహారభద్రత అందించే రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత ఆర్థికవ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు సత్వరమే చర్యలు తీసుకోకుంటే రైతాంగం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుందని తెలిపారు.