nagi reddy
-
తాడేపల్లిలో నాగిరెడ్డి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
జడ్చర్ల కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు. జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు. ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రాణి రుద్రమదేవి @ 1289
తెనాలి: కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి జీవిత అంశాలను గుంటూరు జిల్లాలోని మూడు శాసనాలు బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ప్రస్తుత పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం కొండపై గల శాసనం.. ఆమె మరణకాలంపై గల సందేహాలను తీరుస్తోంది. విజయవాడ కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్వేషణలో అక్కడి పురాతన బౌద్ధస్థావరం బహిర్గతమైంది. అక్కడి ఆయక స్తంభంపై చెక్కిన శాసనంలో గల రాణి రుద్రమదేవి వివరాలను తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ వెలుగులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లాలోని చందుపట్లలోని శాసనంపై గల కాలాన్నే నిజమైన మరణ తేదీగా ఎక్కువమంది భావిస్తారు. పుట్లగూడెం కొండపై వెలుగుచూసిన తాజా శాసనం ఆ కాలాన్ని బలపరిచేలా ఉందని హరగోపాల్ వెల్లడి చేశారు. క్రీ.శ 1289 డిసెంబర్ 15న వేసిన ఈ శాసనంలో రుద్రమదేవి మరణం తర్వాత, కొండపై గల ఆలయానికి భూమిని దానమిచ్చినట్టుంది. చందుపట్లలోని సోమనాథ దేవాలయ శాసనం(1289 నవంబర్ 25)లో రుద్రమదేవికి శివలోక ప్రాప్తి కోరుతూ దేవాలయానికి భూమిని దానం ఇచ్చినట్టుంది. రుద్రమదేవి మరణించాక, దశ దిన కర్మ జరిగేలోపు.. అంటే అందులోని తేదీకి దాదాపుగా పక్షం రోజుల ముందు ఆమె మృతిచెంది ఉంటారని చరిత్రకారుల అంచనా. గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర్లోని ఈపూరులో నాగమయ్యస్వామి ఆలయంగా వ్యవహరించే గోపాలస్వామి ఆలయం ఎదుట గల స్తంభంపై 1289 నవంబర్ 28న చెక్కిన శాసనంలో రుద్రమదేవితో పాటు అంగరక్షకుడు బొల్నాయినికి పుణ్యంగా స్వామికి భూమిని సమర్పించినట్టుంది. ఈ రెండు శాసనాల్లో రాణి రుద్రమదేవితోపాటు ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయుడు, అంగరక్షకుడు బొల్నాయినికి కూడా శివప్రాప్తి కోరారు. అంటే ముగ్గురూ ఒకేసారి మరణించారని చరిత్రకారులు చెబుతారు. చనిపోయే నాటికి ఆమె వయసు 80 ఏళ్లు! అంబదేవుడి తిరుగుబాటును అణిచివేసే యుద్ధంలో రుద్రమదేవి మరణించినట్టు చరిత్ర కథనం. చందుపట్ల, ఈపూరు శాసనాలు 1289 నవంబర్ 25, 28 తేదీల్లో వేయించినవి. అప్పటికి కొద్దిరోజుల ముందే ఆమె చనిపోయారు. పుట్లగూడెం కొండపై శాసనాన్ని అదే ఏడాది డిసెంబర్ 15న చెక్కారు. అంటే అప్పటికే రుద్రమదేవి జీవించి లేరని స్పష్టమైందని హరగోపాల్ వెల్లడించారు. చనిపోయేనాటికి ఆమె వయసు 80 ఉండొచ్చని ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి అంచనా. 1289లో రుద్రమదేవి మరణించినందున ఆమె జన్మ సంవత్సరం 1209 అయివుండొచ్చు. తన 52 ఏళ్ల వయసులో రుద్రమదేవి పట్టాభిషిక్తులయ్యారని వెల్లడవుతోంది. రుద్రమదేవికి చెందిన కీలక శాసనాలు మూడూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉండటం విశేషం. -
గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
సీఎం జగన్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు: నాగిరెడ్డి
-
‘తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్.. కానీ నువ్వు చేసిందేమిటి?’
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను అణిచివేశారని ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయన్నారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం నాశనం అయిందట.. చంద్రబాబు ఉన్నపుడు బాగుందట. కోనసీమలో క్రాప్ హాలిడే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కటైనా అమలు చేశారా?. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ రోజు చంద్రబాబును ప్రశ్నించారా?. చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించింది సీఎం వైఎస్ జగన్. 76 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇప్పటికే అందించాం. ఎఫ్‌సీఐ నుంచి రూ.300 కోట్లకు పైగా రావాలి. పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నించాలి.? ఆ డబ్బు ఇప్పించాలని బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు..?. కోనసీమలో ధాన్యం డబ్బు ప్రతి రైతుకు అందాయి. కోనసీమకు ఈ పని చేశానని చంద్రబాబు ధైర్యంగా చెప్పాలి. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే.. మేము వచ్చాక కరువు మండలాలే లేవు. రైతులకు పంటల బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ విషయంలో టీడీపీ చేసిందేమిటి...? చంద్రబాబు 11 శాతం మేర వ్యవసాయ బడ్జెట్ పెడితే.. మేము మొన్నటి బడ్జెట్లో 16 శాతం పెట్టాం. నేను వెళ్లడం వల్లే రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయ్ అని పవన్ అంటున్నాడు. ఆయన వెళ్లడం వల్లనే రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలు వచ్చాయా..?. కోనసీమ గొడవలు జరిగాక ఇప్పుడు మళ్లీ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని’’ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. -
రెండేళ్లలో పలు విశిష్ట సంక్షేమ పథకాలు
-
కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత
ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇచ్చారు. మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్‌రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్ కన్నుమూత కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట -
పక్కా వ్యూహంతో ముందుకు..
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజూ డీజీపీ పర్యటన కొనసాగింది. ఎస్పీ క్యాంపులోనే గురువారమంతా గడిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మావోయిస్టులు రాష్ట్ర, డివిజన్, ఏరియాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసువర్గాలు గుర్తించాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో సానుభూతిపరులతో బలం పెంచుకునే క్రమంలో వారిని ఆదిలోనే అదుపు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు డీజీపీ క్షేత్రస్థాయి పర్యటన సాగుతోంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తూ.. స్థానికంగా ఉన్న పరిస్థితులు తెలుసుకుంటున్నారు. మావోల ప్రభావం లేకుండా చేసేందుకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వ్యవహరించాలో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభావిత ప్రాంతాల్లో రోజుల తరబడి గడుపుతూ స్థానిక ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సరైన దిశలో వెళ్లేలా ప్రత్యేకంగా ఈ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కేబీఎం కమిటీ దళ సభ్యులను అదుపులోకి తీసుకోవాలన్న కృతనిశ్చయంతోనే ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది. ఇందుకోసం దళ సభ్యులకు ఏ వైపు నుంచీ సాయం అందకుండా పోలీసు ఇన్ఫార్మర్లను మరింతగా వాడుకోనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండురోజుల పాటు రాష్ట్ర పోలీస్ బాస్ ఆసిఫాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో గడపడం ఇదే తొలిసారి. ఇక మావోయిస్టు అగ్రనేత గణపతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు వార్తలు పూర్తిగా అ వాస్తవమని కేంద్ర కమిటీ నుంచి గురువారం ఓ ప్రకటన విడుదల కావడం అనుమానాలకు తెరదించినట్లయ్యింది. కాగా, వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, సిరికొండ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. మావోల సంచారంపై ఆరా తీశారు. ఇలా రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు వరుసగా సందర్శించడం ఆసక్తిగా మారుతోంది. మావోయిస్టుల సంచారం నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
రైతులకు అండగా వైఎస్ జగన్ సర్కార్
-
ఎన్నికల కోడ్ కఠినంగా అమలు
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమల్లో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను, ఎన్నికల ఇన్‌చార్జ్‌లను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్‌ను కచ్చి తంగా పాటించాలని, అధికార పార్టీతోసహా ఎవ రూ ఎక్కడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఓటింగ్‌కు రావడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూసుకోవాలని, అలాగే, అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సంసిద్ధతపై ఎస్ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలు ఇంకా సిద్ధం చేయని మునిసిపల్ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పోలింగ్ రోజు ప్రజల చేతి వేలిపై సిరా గుర్తు వేసేటప్పుడు నిశితంగా పరిశీలించాలని నాగిరెడ్డి సూచించారు. కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలన్నారు. మున్సిపల్‌శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల షెడ్యూల్ సవరించాలి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ రిజర్వేషన్లపై అభ్యంతరాలకు కనీసం వారం రోజుల సమయం ఉండేలా ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బీజేపీ ప్రతినిధిబృందం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ప్రకటించనుండగా, 7వ తేదీనే నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం సరిపోదని పేర్కొంది. అనేక మున్సిపాలిటీల్లో వార్డు విభజనల లెక్కల్లో తప్పులు, వార్డులు వారీగా ఓటర్ల జాబితాల్లో, ఎస్సీ,ఎస్టీ,బీసీ జనగణనలో అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ ఉపాధ్యక్షుడు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త డా.ఎస్.మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ,మహిళా రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని, నిజాంపేట, బడంగ్‌పేట,పెద్దఅంబర్‌పేట తదితర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల్లో తప్పులు వెంటనే సరిదిద్దాలని కోరారు. తాము పేర్కొన్న అంశాలపై నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని మల్లారెడ్డి మీడియాకు తెలిపారు. -
సంక్రాంతి కానుకగా రైతు భరోసా
-
రసాభాసగా అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరయిన కాంగ్రెస్ పార్టీ నేతలు మధ్యలోనే వాకౌట్ చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్‌రావు ఎన్నికల కమిషనర్‌తో వాదనలకు దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీంతో తాము వాకౌట్ చేస్తున్నామంటూ మర్రి శశిధర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా.. మిగతా పార్టీలు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. అయితే వారి డిమాండ్లను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. షెడ్యూల్లో మార్పులు చేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరామని, దానిపై ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్‌రావు మాట్లాడుతూ... రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లా ఉందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు నాగరాజు వ్యాఖ్యానించారు. బీసీల రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు తగ్గించి కుట్ర చేశారన్నారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పినా ఎన్నికల కమిషనర్ పట్టించుకోలేదని విమర్శించారు. దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ... కుల దురహంకారం చూపించారని, రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చెబితే తనపై దాడి చేశారన్నారు. తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఆయన తెలిపారు. -
ఎన్నికల కోడ్ నిబంధనలపై కమీషనర్లకు నాగిరెడ్డి సూచనలు
-
సంతృప్త స్థాయిలో పథకం వర్తింపు
-
వైఎస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు
సాక్షి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనతో పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైఎస్సార్ సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్ 10వ వర్ధంతి సందర్భంగా ఆసిల్ మెట్ట జంక్షన్‌లోని మహానేత విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమనసంక్షేమ సంఘ గౌరవాధ్యక్షులు సత్తి నాగేశ్వరరెడ్డి, అధ్యక్షులు ఎన్. వివేకానందరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి , వేమన సంఘం ప్రధాన కార్యదర్శి సత్తి రామకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరా కుమార్ రెడ్డి, సంఘ నాయకులు సుబ్బారెడ్డి, కర్రి రామారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజలకి అండగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నెలల తన పాలనలోనే ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకుండానే లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. -
వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు
-
మున్సిపల్ ఎన్నికలు.. ఎవరి గుర్తులు వారికే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఈనెల 10న సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. పలు వివరాలను వెల్లడించారు. ‘‘మున్సిపల్, వార్డుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తాం.12వ తేదీలోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వచ్చు. 14వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితాను ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని నూతన జాబితా సిద్ధం చేస్తాం. ప్రతి వార్డులో ఎంత మంది ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలను నిర్వహిస్తాం. దాదాపు పాత పోలింగ్ కేంద్రాలనే ఈ ఎన్నికలకు కూడా ఉపయోగిస్తాం. ఈ నెల11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతాం. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాం’’ అని తెలిపారు. నాగిరెడ్డితో భేటీలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నిరంజన్, బీజేపీ మల్లారెడ్డి, సీపీఐ పళ్ల వెంకట్ రెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, ఎంఐఎం జాఫ్రీ మున్సిపల్. -
పరిషత్ ఫలితాలు వాయిదా వేయాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల చివరివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి బుధవారం బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఫలితాలు వెలువడ్డాక జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నెలకుపైగా వ్యవధి ఉంటున్నందున పెద్దఎత్తున క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టు అవుతుందని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఎస్ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో చిన్న జిల్లా పరిషత్‌లు ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు పెరిగే అవకాశమున్నందున పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని వారు కమిషనర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రలోభాలకు అవకాశం: కె.లక్ష్మణ్ దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని లక్ష్మణ్ విమర్శిం చారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పరిషత్ ఫలి తాలు వెలువడ్డాక, జూలై 12న జెడ్పీపీ చైర్పర్సన్ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారని, ఇంత వ్యవధి ఇస్తే పెద్దఎత్తున ప్రలోభాలకు అవకాశంతో పాటు గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీకి అనుకూలంగా తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నారు. అందువల్ల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును జూన్ ఆఖరు వరకు వాయిదా వేయాలని కమిషనర్ ను కోరామన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులున్నారు. -
కష్టాలు మాకు..కాసులు మీకా?
సాక్షి, అమరావతి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా చేస్తారా? అన్నదాతా సుఖీభవా అంటూ రైతులకే శఠగోపం పెడతారా? అని మంగళవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు మిలాఖత్ అయి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని మండిపడింది. ఒక బస్తా వడ్లు పండించడానికి రైతు రక్తమాంసాలను పణంగా పెడుతుంటే మిల్లర్లు అడుగు కదలకుండా అడ్డగోలు దోపిడీకి పాల్ప డుతున్నారని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టేందుకు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న మోసాల తీరును వివరించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను కలవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రముఖ రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాధ్, ఏపీ రైతు సంఘం నేత ఆంజనేయులు, ఏపీ కౌలు రైతుల సంఘం నేత విద్యాధరరావు, రైతు నాయకులు అనుమోలు గాంధీ, కొలనుకొండ శివాజీ, అక్కినేని చంద్రరావు, వై.రమేష్, కె.శ్రీనివాసరావు, కొల్లా రాజమోహన్ తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు నాయకులు ఈ సదస్సులో తమ స్వానుభవాలను వివరించారు. 75 కిలోల బస్తాకి 1200 గ్రాముల ధాన్యాన్ని తారం కింద వ్యాపారులు అదనంగా తీసుకునేది చాలదన్నట్టు టన్నుకి మరో 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను ధాన్యం కొనుగోళ్ల నుంచి ఓ పథకం ప్రకారం తప్పించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లకు వచ్చే ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి రైతుకు దక్కాల్సిన రవాణా చార్జీలను కూడా మిల్లర్లే తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని తిరిగి మరాడించి మిల్లర్లు లబ్ధి పొందుతుంటే పౌరసరఫరాల అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ నిబంధన పేరిట రైతుల్ని ఐకేపీ సెంటర్లలో అష్టకష్టాలు పెడుతున్నందునే రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు రైతులకు ఇస్తామని ప్రకటించిన మొత్తాన్ని ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని పలువురు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగ దుస్థితిని వివరించారు. 75 కిలోల బస్తాకి 175 నుంచి 180 రూపాయల మధ్య రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలతో ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్క ధాన్యం విషయంలోనే ఇలా జరగడం లేదని, రైతు పండించే ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. రైతులు సమైక్యంగా ముందుకు కదిలితే అనుకున్నది సాధించవచ్చని పిలుపునిచ్చారు. సదస్సు తీర్మానాలు... – ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దగాను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలి. – ఈ విషయాన్ని చర్చించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల కమిషనర్‌ను కలవాలి. – రైతు సంఘాలు, మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. – రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. – అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల అధికారులపై వేటు వేయాలి. రేపట్నుంచి బాబూ మా పక్కకే ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత అవకతవకలకు ఇప్పటి వరకు ప్రథమ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు రేపట్నుంచి తమ పక్కన చేరి పోరాడాల్సిందేనని రైతు నాయకుడు అనుమోలు గాంధీ అన్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించక తప్పదన్నారు. 23వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెద్ద మార్పు రాబోతోందని ఈనాటి మొదటి ముద్దాయి (ముఖ్యమంత్రి చంద్రబాబు) రేపొద్దున ప్రతిపక్ష నేతగా రైతు సమస్యలపై గళం విప్పక తప్పదన్నారు. ఎవరొచ్చినా కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సిందేనని, వాళ్లతో కలిసి మున్ముందు ఇతర రైతు సంఘాలు, పార్టీలు పోరాడక తప్పదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. -
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్‌నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్‌పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలి: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి టీపీసీసీ ఫిర్యాదు చేసింది. వచ్చేనెల 27 వరకు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మల్లారెడ్డి తన అధికార లెటర్‌హెడ్‌పై పార్టీ పదవి నియామకం చేస్తూ ఉత్తర్వు లు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని నాగిరెడ్డికి ఇచ్చిన ఫిర్యా దులో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కీసర మండల అధ్యక్షుడిగా సుధాకరరెడ్డిని నియమిస్తూ మంత్రి ఇచ్చిన నియామకపత్రం ప్రతిని కూడా ఈ ఫిర్యాదుకు జతచేశారు -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల హడావిడి మళ్లీ మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీస్థానాలు ఉన్నాయన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు, మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని వెల్లడించారు. నేటి నుంచి కోడ్ అమలులోకి రానుందని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్ పేపర్, గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్ పేపర్లు ఉంటాయని తెలిపారు. ఎంపీటీసీలకు రూ 1.5 లక్షలు, జెడ్పీటీసీలకు రూ.4 లక్షల గరిష్ట వ్యవపరిమితిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. మొత్తం 32 వేల 7 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం ఒక కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లు ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారని అన్నారు. మొదటి విడతలో 197 జెడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 180 జెడ్పీటీసీలు, 1913 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడతలో 161 జెడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు లక్షా 47 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని, అలాగే ఎన్నికల ఫలితాలను మే 27న వెల్లడిస్తామని చెప్పారు. తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25న ఫిర్యాదులు: ఏప్రిల్ 27 నామినేషన్ ఉపసంహరణ: ఏప్రిల్ 28 వరకు పోలింగ్: మే 6న రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28 వరకు నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 29న ఫిర్యాదులు: మే 1న నామినేషన్ ఉపసంహరణ: మే 2 వరకు పోలింగ్: మే 10న మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు) నామినేషన్: ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు నామినేషన్ల పరిశీలన: మే 3న ఫిర్యాదులు: మే 5న నామినేషన్ ఉపసంహరణ: మే6 వరకు పోలింగ్: మే 14