కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు | Agri Mission Vice Chairman Nagi Reddy Slams On Lanna Laxminarayana | Sakshi
Sakshi News home page

కన్నా లేఖలోని అంశాలు.. పచ్చి అబద్దాలు

Published Mon, Apr 20 2020 12:10 PM | Last Updated on Mon, Apr 20 2020 12:10 PM

Agri Mission Vice Chairman Nagi Reddy Slams On Lanna Laxminarayana - Sakshi

సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,550 కల్పించాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాసిన లేఖలోని అంశాలన్ని పచ్చి అబద్ధాలని మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,760 మాత్రమే అని గుర్తుచేశారు.

కేంద్రం మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి డబ్బు చెల్లించదన్నారు. ప్రజా పంపిణీ కోసం కొనుగోలు చేస్తేనే రూ.1760 మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. వాస్తవాలు కాకుండా అవాస్తవాలను కన్నా ప్రచారం  చేస్తున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయాలనే ఉద్దేశంలోనే కన్నా ఇలాంటి లేఖలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ప్రభుత్వం  రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement