'నీటియుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారు'
గుంటూరు: రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారని వైఎస్‌ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. అయినా వైఎస్ జగన్ హెచ్చరికల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందని నాగిరెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత సాగునీరే రాదు, తాగునీటికీ ఇబ్బందులు తలెత్తాయని నాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరగటం తప్ప రైతుల కోసం చేసిందేమీలేదని నాగిరెడ్డి విమర్శించారు.
ఆయన గతంలో సీఎంగా చేసినప్పుడు చోద్యం చూడబట్టే ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కట్టాయని నాగిరెడ్డి ఆరోపించారు. గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా జూన్‌లో వర్షభావం ఏర్పడిందని నాగిరెడ్డి తెలిపారు.