Water War
-
టీఎస్ జెన్ కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
-
రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ నేతల విమర్శలు : పేర్ని నాని
-
సాగునీటికి కయ్యం!
సాక్షి, మూసాపేట (దేవరకద్ర) : సాగునీరు మాకు కావాలంటే.. మాకే ముందు కావాలని మూసాపేట, అడ్డాకుల మండలాల రైతులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పూర్తి వివరాలిలా.. మూసాపేట మండలంలోని మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న మక్ మల్లాయకుంటకు గత సంవత్సరం వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలోని ఘణప సముద్రం పెద్ద చెరువు నుంచి సాగునీరు వదిలారు. ఇందుకు రెండో తూము ద్వారా వచ్చే నీటి కోసం గ్రామస్తులంతా కలిసి చందాలు వేసుకుని కాలువలు తవ్వి కుంటకు రెండు పక్కల పొర్లు దిండ్లను కట్టుకున్నారు. అయితే ఖరీఫ్‌లో నీరు విడుదల కావడంతో చెరువు కింద 360 ఎకరాల్లో వరినాట్లు వేశారు. అయితే రెండు రోజులుగా అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన దాదాపు వంద మంది రైతులు మక్మల్లాయ కుంటకు ఘణపసముద్రం నుంచి వచ్చే దారిలో ఉన్న దిండును పగలగొట్టడంతో రెండు గ్రామాల మధ్య చిచ్చు రగులుకుంది. వాదోపవాదనలు లేకలేక చెరువుకు నీళ్లు వస్తే చెరువు కింద భూమిని అంతా శిస్తు చేశామని, ఉన్నట్టుండి దిండును పగలగొడితే ఎలాగని మహ్మదుస్సేపల్లి రైతులు కందూరు గ్రామస్తులను నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో పక్క చెరువు కింద ఉన్న పాటు కాలువలను రెండు జేసీబీలతో తవ్వడంతో ఇరు గ్రామాల ప్రజలు చెరువు కట్టపై మొహరించి నీరు తీసుకెళతామని ఒకరు, ఇవ్వలేమని మరొకరు వాదిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం మక్మల్లయ కుంట నిండిన అనంతరం మహ్మదుస్సేన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న లోక సముద్రానికి నీరు వదులుతామని అక్క డి నుంచి మొత్తం మీ శివారుకే నీరు వస్తాయని పలువురుపెద్దలు సూచించినా వినకపోవడంతో రాజకీయ నాయకులు సైతం ఈ విషయంలో జో క్యం చేసుకుంటున్నారు. కందూరు మాజీ సర్పంచు నాగిరెడ్డి తమ గ్రామానికి చెందిన రైతులకు నచ్చజెప్పి ఘణపురం చెరువు కుడి కాలువ ద్వారా నీరు విడుదల చేయించడానికి వెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఊరంతా శిస్తు కట్టాం కొన్నేళ్ల తర్వాత కుంటకు నీళ్లు వస్తే ఊరు ఊరంతా శిస్తు కట్టాం. ఓర్వలేని కందూరు గ్రామరైతులు రాత్రికిరాత్రే దిండుని పగలగొట్టిండ్రు. అంతటితో ఆగకుండా ఘణపురం చెరువు నుంచి వచ్చే నీళ్లను కూడా దారిమళ్లించడానికి చూసిండ్రు. ఇది మంచి పద్ధతి కాదు. – మోహన్‌రెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి సమంజసం కాదు మా ఊరి చెరువు నుంచి దౌర్జన్యం చేసి నీటిని తీసుకెళ్లడం సబబా. ఈ ఏడు కుంట కింద ఉన్న 320 ఎకరాల సంగతేంకావాలి. వరి పంట ఎదుగుతున్న వేళ చెప్పాపెట్టకుండా నీళ్లను మళ్లించడం మానుకోండి. – కిష్టారెడ్డి, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి నా చేనంతా నాశనంమైంది కందూరు రైతులు నీళ్ల కోసం కట్ట దిండును ధ్వంసం చేసిండ్రు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ దగ్గరుండి దిండును పగలగొట్టడమే కాక నా పంటకు నష్ట పరిహారం ఇస్తానడం బెదిరించడమే కదా. పద్ధతి మార్చుకోకపోతే ఊరంతా కట్ట దగ్గరే కూర్చోవాల్సి వస్తది. – నరేశ్, రైతు, మహ్మదుస్సేన్‌పల్లి మాకూ నీళ్లు కావాలి మా ఊరికి కూడా నీళ్లు కావాలి. సరిగ్గా వర్షాలు కురవక మొక్కలన్నీ ఎండుతున్నా యి. మహ్మదుస్సేన్పల్లిలో కుంట కింద ఉన్న భూమం తా శిస్తు చేశారు. కనీసం తుకాలనైనా ఎండిపోకుండా కాపాడుదామంటే వినడంలేదు. అందుకే మా ఊరి రైతులు దానికి ఉన్న రెండు వరస రాళ్లను తొలగించారు. – నాగిరెడ్డి, మాజీ సర్పంచ్, కందూరు -
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత
-
పాకిస్థాన్‌పై భారత్ జల యుద్ధం చేస్తే....
న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్ పీచమణచడానికి సంప్రదాయక యుద్ధం చేయడం అంత సులువు కాకపోతే జల యుద్ధం చేయాలని పలు వర్గాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తున్నాయి. జల యుద్ధం అంటే ఇరు దేశాల మధ్య పారుతున్న నదుల పరివాహక ప్రాంతాల్లో జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సింధు నదీ జలాల ఒప్పందంపై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఆ ఒప్పందాన్ని మనం ఏకపక్షంగా రద్దు చేసుకోవచ్చా? ఏకపక్షంగా చేసుకున్నా అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఫలితంగా ఇరు దేశాలు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రసిద్ధ సింధూతోపాటు జీలం, చీనాబ్, సట్లేజ్, బియాస్, రావి అనే ఉప నదులు పారుతున్నాయి. ఈ నదీ జలాల పంపకం కోసం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. పశ్చిమ ప్రాంతంలో ప్రవహిస్తున్న సింధూ, జీలమ్, చీనాబ్ నదుల జలాలను పాకిస్థాన్ ఎక్కువగా వాడుకుంటే, తూర్పున ప్రవహిస్తున్న సట్లేజ్, బియాస్, రవి నదుల జలాలను భారత్ ఎక్కువగా వినియోగించుకుంటోంది. ఈ ఆరు నదులు భారత భూభాగం నుంచే పోతున్నందున పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ‘సింధూ ఒప్పందం’ రద్దు చేసుకొని పాకిస్థాన్‌కు నదీ జలాలు వెళ్లకుండా నియంత్రించాలన్నది పలు వర్గాల నుంచి భారత ప్రభుత్వానికి అందుతున్న సూచన. తద్వారా పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిని భారత్ దారికొస్తుందన్నది వారి వాదన. ఈ ఒప్పందం విషయంలో ఎప్పుడైనా వివాదం తలెత్తితే జోక్యం చేసుకునే అధికారం పరిమితంగానైనా ప్రపంచ బ్యాంకుకు ఉంది. సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ ‘మధ్యవర్తి’ని ప్రపంచ బ్యాంకు నియమించవచ్చు. దీన్ని పట్టించుకోకుండా కూడా భారత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ ఆరు నదుల్లో నీటిని దిగువకు వదలకుండా నిల్వ చేసుకోవడానికి భారీ డ్యామ్‌లేవీ మన భూభాగంలో లేవు. వాటిని నిర్మించుకోవడానికి మనకు చాలాకాలమే పడుతుంది. ఒకవేళ నిర్మించినప్పటికీ నీటిని మనవైపు మళ్లించేందుకు ఆస్కారమే లేదు. ఇరుదేశాల సరిహద్దుల్లో వున్న భౌగోళిక పరిస్థితులే అందుకు కారణం. భారీ డ్యామ్‌లు నిర్మించుకున్నా కొంతకాలం మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయకుండా ఆపగలంగానీ, ఎక్కువ సేపు ఆపలేం. డ్యామ్‌లు నిండితే వదలకుండా ఏం చేయలేం. ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌లో పరిశోధన చేస్తున్న ఉత్తమ్ కుమార్ లాంటి వారు ఎంతో మంది అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి ఇదివరకే వివరించారు. పాక్‌తో సింధూ జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే బంగ్లా, నేపాల్ దేశాలతో మనం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఆ దేశాలకు నీరివ్వలేం. వాటితో కూడా అంతర్జాతీయ వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేన్ని ఖాతరు చేయకుండా తాత్కాలికంగానైనా పాక్‌కు నదుల జలాలను నిలిపేయాలకుంటే చైనా తక్షణమే రంగప్రవేశం చేస్తుంది. సింధూ, సట్లేజ్ నదులు టిబెట్ నుంచి పారుతున్నందున టిబెట్ చైనా ఆధీనంలో ఉండడం వల్ల అక్కడ ఆ నదులకు అడ్డుకట్ట వేస్తోంది. ఇటీవలనే ఈ విషయాన్ని చైనా స్పష్టం చేసింది కూడా. ఏ రకంగా చూసినా జల యుద్ధం అన్ని రకాలుగా భారత్‌కే నష్టం. అందుకనే భారత్, పాక్ మధ్య జరిగిన 1965, 1971, 1999 యుద్ధాలేవి ఈ జల వనరుల ఒప్పందంపై ప్రభావం చూపలేకపోయాయి. -
మండలిలో 'వాటర్ వార్'
హైదరాబాద్: ‘వాటర్ గ్రిడ్ పైపులైన్ భూ వినియోగ హక్కు’ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం శాసనమండలి నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. మొదట ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ.. తెలంగాణ గృహ సంబంధ, పారిశ్రామిక వాటర్ గ్రిడ్ పైపులైనుల ( భూ వినియోగ హక్కును ఆర్జించుట) బిల్లును శాసనమండలిలో ప్రతిపాదించగా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలిలో కాంగ్రెస్ విపక్ష నేత డి.శ్రీనివాస్ (డీఎస్) మాట్లాడుతూ.. బిల్లు అసమగ్రంగా ఉందని, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అన్నారు. బిల్లును సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును దీనికి అనుసంధానించడం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రచర్చ అవసరమని, హడావుడిగా చేయడం తగదని ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ ఎమ్మెల్సీలు పొట్ల నాగేశ్వరరావు, ఎ.నర్సారెడ్డి మాట్లాడుతూ.. రైతులు తమ భూమిలో మొక్కలు పెంచినా, ఇతరత్రా పనులు చేపట్టినా జైలుకు పంపించేలా రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి మాట్లాడుతూ పైపులైన్ కంపెనీలను బతికించడానికే ఈ ప్రాజెక్టును తెచ్చారని ఆరోపించారు. లక్ష కి.మీ పైప్‌లైన్‌కు రూ.40 వేల కోట్లు కావాలని, కేవలం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మాత్రమే అనుసంధానిస్తే వన్‌సైడ్ పైప్‌లైన్ తగ్గిపోతుందని సూచించారు. దీనిపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొంటూ కొత్తగా పైప్‌లైన్ వేసేది నాలుగున్నర వేల కి.మీ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గతంలో అనంతపురం జిల్లాలో మంచినీటి పథకానికి పంచాయతీరాజ్ శాఖ అంచనావేస్తే రూ.900 కోట్లు అవసరమని తేలిందని, అదే సత్యసాయిబాబా ట్రస్ట్ కేవలం రూ.300 కోట్లలోనే ఆ పథకాన్ని పూర్తిచేసిందని తెలిపారు. ఓట్లు రావనే భయంతో అడ్డుకుంటున్నారు: హరీశ్ వాటర్ గ్రిడ్ పథకం అమలైతే తమకు పుట్టగతులుండవనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతీ ఇంటికి మంచి నీళ్లు ఇవ్వలేకపోతే ఓట్లు అడగమని సీఎం కేసీఆర్ చెప్పారని, దీంతో ఇప్పుడొచ్చిన కొన్ని సీట్లు కూడా తమకు రావని విపక్షాలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మరింత సమయం కోల్పోకుండా పనులు జరగాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రభుత్వం తెచ్చిందన్నారు. బిల్లు శాసనమండలి ఆమోదం పొందాకే విపక్షాలు వాకౌట్ చేశాయన్నారు. గుజరాత్లో ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నారని, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. అత్యంత పారదర్శకంగా టెండర్లను ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలి పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంబంధీకులు కూడా టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. -
వాటర్ వార్
-
నీటి యుద్ధం మొదలు!
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది. కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఏపి అధికారులు పట్టుబడుతున్నారు. 834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపాలని కూడా తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపైన, బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
జల జగడాలు
-
'నీటియుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారు'
గుంటూరు: రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు వస్తాయని వైఎస్ జగన్ ముందే చెప్పారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. అయినా వైఎస్ జగన్ హెచ్చరికల్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టిందని నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సాగునీరే రాదు, తాగునీటికీ ఇబ్బందులు తలెత్తాయని నాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరగటం తప్ప రైతుల కోసం చేసిందేమీలేదని నాగిరెడ్డి విమర్శించారు. ఆయన గతంలో సీఎంగా చేసినప్పుడు చోద్యం చూడబట్టే ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కట్టాయని నాగిరెడ్డి ఆరోపించారు. గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా జూన్‌లో వర్షభావం ఏర్పడిందని నాగిరెడ్డి తెలిపారు. -
రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి మధ్య ఈ ఏడాదీ ‘వాటర్ వార్’ మొదలైంది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఇద్దరూ జగడానికి దిగారు. ముందుగా తాడిపత్రి ప్రాంతంలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని జేసీ... కాదు తన నియోజకవర్గంలో తాగునీటి అవసరాలు తీర్చాలని శైలజానాథ్ పంతానికి పోవడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రాజేసే ప్రమాదం కన్పిస్తోంది. సుబ్బరాయసాగర్ జలాశయం తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) వ్యవస్థలో ఉంది. హెచ్చెల్సీ ద్వారా ఇందులోకి నీటిని నింపి... తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) ఆయకట్టుకు, పుట్లూరు మండలంలో తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తుంటారు. గత నెల 15వ తేదీనే సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సి వుండగా... హెచ్చెల్సీ ప్రధాన కాలువకు నీటి లభ్యత లేని కారణంగా ఈ నెల ఒకటి నుంచి వదులుతున్నారు. హెచ్చెల్సీ వ్యవస్థలోనే ఉన్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంపెర డీప్‌కట్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సుబ్బరాయసాగర్‌లోకి 8.5 మీటర్ల మేర నీరు వచ్చి చేరింది. ఇక టీబీసీకి విడుదల చేయడమే తరువాయి. ఇంతలోనే జేసీ, శైలజానాథ్ మధ్య రగడ మొదలైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో పత్తి, కరివేపాకు పంటలు ఎండుతున్నాయని, కావున ముందుగా ఆయకట్టుకు నీరు వదలాలని జేసీ పట్టుబడుతున్నారు. ఇందుకు శైలజానాథ్ ఒప్పుకోవడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని తీర్చడానికి ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు వదలాలంటూ ఏకంగా సీఎం పేషీ నుంచే హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తమ ప్రాంత ప్రజల మెప్పు పొందేందుకే ఇరువురు ప్రజాప్రతినిధులు జల జగడానికి దిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎ.కొండాపురంలో రైతులతో అధికారుల సమావేశం సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల విషయంపై చర్చిం చేందుకు బుధవారం హెచ్చెల్సీ ఈఈ ధనుంజయరావు పుట్లూ రు మండలం ఎ.కొండాపురం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయం లో పుట్లూరు, తాడిపత్రి మండలాలకు చెందిన కొద్దిమంది రైతులతో రహస్యంగా సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి శైలజానాథ్ ఆదేశాల మేరకు ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు ఆరు రోజులు నీటిని విడుదల చేస్తామని, ఆ తర్వాత తాడిపత్రి మండలంలోని అయకట్టుకు నీరు ఇస్తామని అధికారులు సూచించడంతో రైతులువ్యతిరేకించినట్లు తెలుస్తోంది. -
నీటియుద్ధాలే రేపటి నిజం
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ మధ్యన నదీ జలాల గురించి పత్రికల వారి సమావేశంలో మా ట్లాడారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ చర్చ అవసరాన్ని మరింత స్ప ష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా నీటి కోసం ఎలాంటి యుద్ధాలు, వివాదాలు తలెత్తబో వని మంత్రి మాటల సారాంశం. తెలంగాణవాదులు కూడా ఇదే చెప్పారు. మంత్రివర్యులు తన మీడియా ప్రసంగంలో కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన కేటాయింపుల వివరాలు కూడా అందించారు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం - ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్న వారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెంతైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవసాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ గణాంకాలన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్ స్థానంలో వచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేయబోయే నీటి కేటాయింపుల వల్ల జరిగే అనర్థాలు. రెండవది, మిగులు జలాలకు సంబంధించినది. తెలంగాణవాదులు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అంశం-నీటి దోపిడి. తెలంగాణవాదుల ఆరోపణ ప్రకారం, మిగులు జలాలతో కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. కాగా, జూరాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తెచ్చుకునే ఉద్దేశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం కూడా ఇందులో ఉంది. మొన్న పాలమూరులో జరిగిన బీజేపీ సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అంటే సముద్రాన్ని హైదరాబాద్‌కు తెస్తాం అనే ధోరణి ఈ అభిప్రాయాలలో ప్రతిబింబిస్తున్నది. అయినా మన మంత్రివర్యులకు ఇవేమీ కనిపించలేదు. వీటిని బట్టి మనం అర్థం చేసు కోవలసినది - నీటి యుద్ధాలు పొంచి ఉన్నాయి. అంటే మహబుబ్‌నగర్-కర్నూలు జిల్లాలలో వియ్యంకుల మధ్య, మొగుడు-పెండ్లాల మధ్య, అన్నా-చెల్లెళ్ల మధ్య, బావ - బావమరుదుల మధ్య నీటి యుద్ధాలు జరగడం అనివా ర్యంగా కనిపిస్తోంది. నిజానికి విభజనవాదులు మొదట వాదించిన తీరు ఇదే, నీటి యుద్ధాలు జరుగుతాయనే. ఇప్పుడు మాత్రం జరగవంటున్నారు. దీనిలో పరమార్ధ మేమిటో వారే చెప్పాలి. బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల లో జరిగే అనర్థాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే సమాచారం అందుతోంది. బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాల వరద నీటిని పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో మంచి వర్షాల కాలం, తక్కువ వర్షాల కాలం రెండు ఉన్నాయి. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 47 సంవత్సరాల వరద నీటిని తీసుకుంటే, అది మంచి వర్షాల కాలం మాత్రమే. అంటే తక్కువ వర్షాల కాలాన్ని తీసుకో లేదన్న మాట. దీని ద్వారా నీటి లభ్యతను పెంచి పంచడం జరిగింది. అదేగాక 75 శాతం ప్రాబబిలిటి కాకుండా 65 శాతం ప్రాబబిలిటిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కూడా లభ్యత నీటిని పెంచడం జరిగింది. అంటే ఈ నీటి లభ్యత గణాంకాలలో చాలా మార్పులు చోటుచేసు కున్నాయి. కుడి పక్కన ఉన్న పట్టికలో ఆ మార్పుల తీరును చూడవచ్చు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? బ్రిజేష్, అంతకు ముందు నియమించిన బచావత్ కమిటీల మధ్య వ్యత్యాసం ప్రకారం సగటున (మంచి వర్షాలు - తక్కువ వర్షాలు నమోదైన సంవత్సరాల ప్రకారం) మన రాష్ట్రానికి కేటాయించిన నీరు 100 సంవత్సరాలలో 55 సంవత్సరాలు మాత్రమే రావటం జరుగుతుంది. అదే తక్కువ వర్షాల సంవత్సరాల ప్రకారం చూస్తే 40 నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ. అంతేకాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే కొత్త అనుమతుల (ఆలమట్టి ఎత్తు పెంచడం, మహారాష్ట్రలో విద్యుత్ ప్లాంటులకు నీరు, చట్ట వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించడం, వగైరాల) వల్ల ఈ సగటు నీటి లభ్యత 55 శాతం నుంచి 40 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువ వర్షాల కాలంలో ఇది 30 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమ నించాల్సిన విషయం-ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్నవారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత రాజకీయ నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెం తైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవ సాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి