‘గాజువాకలో పోటీ ఓ యాక్టర్‌కు... లోకల్ హీరోకు జరుగుతోంది. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. 9 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం.. ప్రతి ధర్నా చేశాడు.. ప్రతి నిరహార దీక్ష చేశాడు. ప్రతిసారి మీకు అండగా ఉన్నాడు. మీ కోసం కేసులు పెట్టించుకున్నాడు. ఈ మనిషిని లోకల్ హీరో అంటాం. కానీ మరోవైపు యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన నామినేషన్ సందర్భంగా పచ్చజెండాలు కనిపిస్తాయి. ఆయన నాలుగేళ్లు టీడీపీ చంద్రబాబునాయుడితో కలసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. జగన్ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. 22 కేసులు పెట్టారు. కానీ ఇదే యాక్టర్ పవన్ కల్యాణ్.. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏడాది నుంచి బిల్డప్ ఇస్తూ ఉంటుంటే.. ఒక్క కేసు నమోదు కాలేదు. వాళ్లంతా కలిసి కట్టుగా ఎలా కుట్రలు పన్నుతున్నారో అర్థం చేసుకోమని కోరుతున్నా.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ విజ్ఞప్తి చేశారు.
మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే లోకల్ హీరో
Published Sun, Apr 7 2019 7:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement