జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు.
జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు.
ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment