archaeology
-
అల ఏకశిలా నగరిలో..
శతాబ్దాల చరిత్ర, ఏకశిలానగరిగా గుర్తింపు. ఒంటిమిట్ట రాములోరిగా ప్రఖ్యాతి. ఇప్పుడు ఆ పురాతన కోదండరామాలయంలో గర్భగుడి జీర్ణోద్ధరణ పనులు చేయడానికి కేంద్రపురావస్తు శాఖ సన్నద్ధం అవుతోంది. శతాబ్దం కాలం తర్వాత చేపడుతున్న ఈ పనులతో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం కొత్త సొబగులు సంతరించుకోనుంది. వందేళ్ల క్రితం ఆంధ్ర వాల్మీకిగా గుర్తింపు పొందిన వావికొలను సుబ్బారావు నేతృత్వంలో ఓ సారి గర్భగుడిలో జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. టీటీడీ ఆదీనంలోకి ఆ రామాలయం వెళ్లిన తర్వాత అంతరాలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తుశాఖ చేపట్టనుంది. – రాజంపేట విజయనగర సామ్రాజ్య కాలంలో.. విజయనగర సామ్రాజ్య కాలంలో.. క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో తన పరివారంతో పర్యటించారు. ఇక్కడి అడవుల్లో వంటడు, మిట్టడు అనే ఇద్దరు బోయలు రాజుగారికి సేవలందించారు. ఆ సమయంలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఉన్న ఆలయం గురించి రాజుకు వివరించారు. గుట్టమీద చిన్న గుడిలో జాంబవంతుడు ప్రతిష్టించిన ఏక శిలలో సీతారామలక్ష్మణులను పూజిస్తున్నామని, అక్కడ ఓ గుడి కట్టాలని వారు రాజును అభ్యర్థించారు. వంటడు, మిట్టడు చెప్పిన మేరకు కంపరాయలు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించి ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. ఒకే శిలలో సీతారామలక్ష్మణులను జాంబవంతుడు ప్రతిష్టించినట్లే.. అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. అప్పట్లో గర్భాలయం, అంతరాలయం, చిన్నగోపురం ఉండేవి. మొదటిదశ నిర్మాణమిది. కొబ్బరి చిప్ప చేతపట్టుకుని.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాలు ఆక్రమణకు గురికాగా, వందేళ్ల క్రితం రామునికి నైవేద్యం కరువైన పరిస్థితి వచ్చింది. జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి వావికొలను సుబ్బారావు కంకణం కట్టుకున్నారు. కొబ్బరి చిప్పను చేతపట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఊరూరా తిరిగి జోలెపట్టారు. ఆ డబ్బుతో రామాలయాన్ని పునరుద్ధరించారు. 1925లో దాదాపు రూ. 2 లక్షలను సేకరించి, గర్భగుడి, ఆలయ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అప్పట్లో పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.6 నుంచి గర్భాలయం మూసివేత ఇప్పుడు జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో సెపె్టంబర్ 6 నుంచి గర్భాలయం మూలవిరాట్టు దర్శనం ఉండదు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ బాలాలయం నిరి్మస్తోంది. దాదాపు రూ. 75 లక్షలతో గర్భగుడి పనులు చేపట్టనున్నారు. గర్భాలయం మూలవిరాట్టు (ఏకశిల) చుట్టూ చేపట్టే పనులను వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈవిషయాన్ని కేంద్రపురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి తెలియచేశారు. అలాగే గోపురం పైభాగంలో ఉన్న శిలారూపాలను కూడా అందంగా తీర్చిదిద్దనున్నారు. శతాబ్ద కాలం తర్వాత గర్భగుడిలో పనులు జరగడంపై రామభక్తుల్లో ఆనందం నెలకొంది. -
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్‌పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జ్ఞానవాపీ మసీదులో సర్వేకు ఓకే
ప్రయాగ్‌రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆవరణలో ఏఎస్ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. -
జడ్చర్ల కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపా రు. ఆయన ఆదివారం కోనేరును సందర్శించి పలు ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ కోనేరును కల్యాణ చాళుక్యుల కాలంలో క్రీ.శ.11వ శతాబ్దిలో నిర్మించినట్లు మండపంలోని స్తంభాలు, శిథిల శిల్పాలను బట్టి తెలుస్తోందని వివరించారు. జడ్చర్లలో కల్యాణ చాళుక్యల శాసనం, కందూరు చోళుల శాసనం ఉన్నాయన్నారు. జడ్చర్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న క్రీ.శ.1125, ఫిబ్రవరి 19 నాటి కల్యాణ చాళుక్య చక్రవర్తి భూలోక మల్ల మూడో సోమేశ్వరుడి శాసనంలో.. ఆయన కుమారుడైన మూడో తైలపుడు యువరాజుగా కందూరును పాలిస్తుండగా గంగాçపురంలో ఒక జైన చైత్యాలయాన్ని నిర్మించినట్లుందని తెలిపారు. ఆలయం వెలుపల క్రీ.శ.11వ శతాబ్దికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని భద్రపరిచారన్నారు. రెండు వైపుల మెట్లు, మండపాలు కదిలిపోయాయని పేర్కొన్నారు. వీటికి మరమ్మతులు చేసి కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావచ్చని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అరుదైన శిలా ఫలకం.. అంతులేని నిర్లక్ష్యం!
.. సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 2003లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుశకం 1– 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన 3 అడుగుల సున్నపు రాయి ఫలకం వెలుగు చూసింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే క్రమంలో జరిగిన పరిణామాల చిత్రాలను మూడు వరుసల్లో దానిపై చెక్కారు. అరుదైన ఇలాంటి ఫలకాలకు అంతర్జాతీయ విపణిలో విపరీతమైన డిమాండ్ ఉంది. తవ్వకాలు జరిపిన కొత్తలో ఈ శిలా ఫలకాన్ని ప్రభుత్వ ఆదీనంలోని ఓ గదిలో భద్రపర్చగా.. 2003 సెపె్టంబర్లో దొంగలు దాన్ని ఎత్తుకుపోయారు. పోలీసు బృందాలు జల్లెడ పట్టి సమీపంలోని ఓ ఊరిలో దానిని స్వాదీనం చేసుకున్నారు. కానీ శిలా ఫలకం అప్పటికే రెండు ముక్కలు కావడంతో.. తాత్కాలికంగా అతికించారు. అయితే ఈ ఫలకాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటూ కోర్టు ఆదేశించడంతో.. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో సిమెంట్ బేస్ సాయంతో కదలకుండా ఏర్పాటు చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం ఈ శిల్పాన్ని విమానంలో ముంబై మ్యూజియానికి తీసుకెళ్లి, తీసుకొచ్చారు. ఆ సమయంలో పగులు విచ్చుకోవటంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతికించారు. ఈసారి అమెరికాకు తరలించి.. అమెరికాలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో బుద్ధుడి జీవిత పరిణామ క్రమానికి సంబంధించిన భారతీయ శిల్పాలతో అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి మన దేశం నుంచి 94 శిల్పాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి 9 ఉన్నాయి. వీటిలో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న నాగ ముచిలింద శిల్పం పగుళ్లతో ఉండటంతో.. దాన్ని వదిలేసి మిగతా 8 శిల్పాలను ఇటీవల విమానంలో తరలించారు. ఇలా తరలించిన వాటిలో ఫణిగిరి సున్నపురాయి ఫలకం కూడా ఉంది. అరుదైన ఈ శిలా ఫలకాన్ని అంత దూరం ఎలా తరలిస్తారని ఇటీవల కొందరు కేంద్ర పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు రెండు శిల్పాలు ధ్వంసం దాదాపు 20 ఏళ్ల క్రితం స్టేట్ మ్యూజియం నుంచి బాదామి చాళుక్యుల కాలం నాటి ఎర్ర ఇసుకరాతితో చేసిన దుర్గాదేవి ప్రతిమను విదేశాలకు పంపగా.. రవాణాలో విగ్రహం ముక్కు భాగం దెబ్బతిన్నది. బెర్లిన్‌లో జరిగిన తేజస్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లిన ఓ నాగ శిల్పం వెనక భాగంలో దెబ్బతిన్నది. ఇలా అరుదైన శిల్పాలు దెబ్బతిన్న ఘటనలున్నా.. ఇప్పటికే దెబ్బతిని, తిరిగి అతికించిన శిలా ఫలకాన్ని విదేశాలకు తరలించడం అడ్డగోలు చర్య అని ఓ విశ్రాంత ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రామప్పపై ఏఎస్ఐ మంట!
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్ కాస్ట్ మైన్)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్‌లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్‌జీఆర్‌ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లను పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. మూడు కీలక అంశాలతో.. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. శాండ్ బాక్స్ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది. రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్ గ్రేడియంట్స్) ఏర్పడుతాయి. రామప్ప ఆలయం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్ గ్రేడియంట్స్ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. -
ఈ చేప వయసు 18కోట్ల ఏళ్లు!
కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి.. మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్ఐ 2012 నుంచి పరిశోధనలు.. తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా -
చరిత్రను చెరిపేస్తున్నారు.. క్రీ.పూ.2 వేల ఏళ్లనాటి చిత్రకళ కనుమరుగు!
అదో గుట్ట.. దానిపై ఉన్న గుండ్లనే కాన్వాస్‌గా మలచి ఆదిమానవులు దానిపై పురివిప్పి నర్తించిన నెమలిని గీశారు.. ఘీంకరిస్తూ కదలాడిన ఏనుగును సాక్షాత్కరింపజేశారు.. భారీ అడవిదున్నలను నియంత్రించిన తమ సహచరుల వీరత్వాన్ని చూపారు. సుమారు పదివేల ఏళ్ల నాటి ఈ చిత్రాలు పాత రాతియుగం మొదలు క్రీ.పూ.2 వేల ఏళ్ల క్రితం విలసిల్లిన తొలి చారిత్రక యుగం వరకు వివిధ కాలాల్లో ఆదిమానవులు గీసినవి. కానీ ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు మింగేస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో చారిత్రక విధ్వంసం జరుగుతోంది. హైదరాబాద్‌కు 30 కి.మీ. దూరంలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవుల కాలం నాటి చిత్రకళ కనుమరుగవుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో భాగంగా ఆదిమానవులు గీసిన చిత్రాలున్న గుట్ట శిథిలమవుతోంది. ఇప్పటికే రెండు కాన్వాస్‌లు మాయమవగా మరో మూడు విధ్వంసం అంచున నిలిచాయి. వాటిని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. 30 అడుగుల భారీ కాన్వాస్.. గుట్టమీద ఎక్కువ చిత్రాలున్న గుండు ఓ కాన్వాస్లాగా కనిపిస్తోంది. దాదాపు 30 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తుతో ఈ కాన్వాస్ నిండా ఆదిమానవులు ఎరుపురంగుతో గీసిన చిత్రాలే కనిపిస్తున్నాయి. క్రీ.పూ.10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల మధ్యలో విలసిల్లిన పాత రాతియుగం, క్రీ.పూ.4 వేల ఏళ్ల నాటి కొత్త రాతియుగం, ఆ తర్వాతి తొలి చారిత్రక యుగం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రాలు గీసినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా అడవి దున్నల చిత్రాలున్నాయి. ఒక దున్న విడిగా ఉండగా, మరోచోట లావుగా ఉన్న దున్న ముందు మనిషి చేతిలో ఆయుధం పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానికి ఓ పక్కన ఏనుగు చిత్రం కనిపిస్తోంది. దానికి దిగువన భారీ పింఛాన్ని విప్పిన నెమలి చిత్రం ఉంది. ఈ చిత్రం కొంత అస్పష్టంగా ఉంది. దాన్ని జిరాఫీ లేదా నీల్గాయ్ లాంటి జంతువుగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. వాటి చుట్టూ మరిన్ని చిత్రాలున్నాయి. వాటిలో పక్షులు, చెట్లు, చేపలు తదితర ఆకృతులున్నాయని అంటున్నారు. మరోపక్కన మనిషి రెండు చేతులతో రెండు భారీ జంతువుల మెడలు పట్టుకొని గాలిలో ఎత్తి పట్టుకున్నట్లు ఉంది. మరో కోణంలో చూస్తే మనుషులు చేతులను జతగా పట్టుకొని నర్తిస్తున్న అనుభూతి కూడా కలుగుతోంది. 2016లో చిత్రాల గుర్తింపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80 ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలు వెలుగుచూశాయి. 2016లో గుండ్ల పోచంపల్లికి చెందిన సాయికృష్ణ అనే రీసెర్చ్ స్కాలర్ గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నగుట్ట, చిత్రాలగుట్టలో ఆదిమానవులు గీసిన చిత్రాలతో ఉన్న ఐదు ప్రాంతాలను గుర్తించారు. ఆదిమానవులు గీసిన చిత్రాల్లో ఏనుగు బొమ్మ ఉందంటే అప్పుడు, అక్కడ ఏనుగులు తిరగాడాయని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పోతనపల్లిలో తొలి చారిత్రక కాలానికి చెందిన చిత్రాల్లో, సిద్దిపేట సమీపంలోని దాసర్లపల్లిలో చారిత్రక యుగానికి చెందిన చిత్రాల్లో ఏనుగులు ఉన్నాయి. తాజాగా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవులు గీసిన చిత్రాల్లోనూ అవి కనిపించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగులు తిరిగేవనడానికి ఆదిమానవులు గీసిన ఈ చిత్రమే సాక్ష్యం. చట్టం ఏం చెబుతోంది? ప్రభుత్వ స్థలం కానప్పటికీ చరిత్రలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆధారాలు ఉంటే ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించే వీలుంది. పురావస్తు శాఖ పరిరక్షించాలి.. పురాతన స్థలాలు, రక్షిత కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం చారిత్రక ఆధారాలున్న స్థలాన్ని సేకరించి రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. లేదా ప్రైవేటు వ్యక్తుల అధీనంలోనే ఉంచుతూ దాన్ని రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. ఇలాంటి ప్రాంతాలు ప్రమాదంలో పడ్డప్పుడు పురావస్తు శాఖ వెంటనే స్వాధీనం చేసుకొని పరిరక్షించాలి. వాటిని ధ్వంసం చేయకుండా స్థల యజమానులతో మాట్లాడాలి. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ అవి ధ్వంసమైతే ఆధారాలు దొరకవు.. గుండ్లపోచంపల్లిలో వెలుగుచూసిన ఆదిమానవుల చిత్రాలు అరుదైనవే. ఏనుగు, నెమలి బొమ్మలు రెండు, మూడుచోట్లనే కనిపించాయి. వాటి ఆధారంగా ఆదిమానవులకు సంబంధించి మరింత ఆసక్తి కలిగించే సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అవి ధ్వంసమైతే అత్యంత విలువైన సమాచారాన్ని మనం చేజేతులా నాశనం చేసుకున్నట్టే. ప్రభుత్వం పరిరక్షణకు కదలాలి. – బండి మురళీధర్‌రెడ్డి, ఆదిమానవుల రాతిచిత్రాల నిపుణుడు -
13వ శతాబ్దానికి చెందిన అతి చిన్న రాతి వినాయక విగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా ఈ విగ్రహం లభించిందని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ‘కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుంది. నాటి ఊరు కాలగర్భంలో కలిసిపోయాక విగ్రహం కూడా మట్టిలోనే ఉండిపోయింది. గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయి. ఇప్పుడు కాకతీయ కాలానికి చెందిన ఇప్పటివరకు వెలుగు చూసిన వాటిల్లో అతి చిన్న విగ్రహం గుర్తించాం’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఔత్సాహిక పరిశోధకులు రాగి మురళితో కలిసి జరిపిన అన్వేషణలో ఈ విగ్రహం కనిపించిందని, వినాయకచవితి ముందురోజే ఈ విగ్రహం వెలుగు చూడటం విశేషమని తెలిపారు. -
చార్మినార్ వద్ద బయట పడ్డ భూగర్భ మెట్లు
చార్మినార్: చార్మినార్ కట్టడం ప్రాంగణంలోని వెనుక వైపు పురావస్తు శాఖ విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మంగళవారం చేపట్టిన తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. చార్మినార్ కింద భూగర్భ మెట్లు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో పత్తర్‌గట్టి కార్పొరేటర్ మూసా సోహేల్ ఖాద్రీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చార్మినార్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ మరమ్మతు పనులను నిలిపివేయాలని పురావస్తు శాఖ అధికారులను కోరారు. దీనిపై సమాచారం అందడంతో పురావస్తు శాఖ హైదరాబాద్ సూపరింటెండెంట్‌తో పాటు ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తవ్వకాల్లో బయటపడ్డ భూగర్భ మెట్లను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం విద్యుత్ మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చార్మినార్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అబ్బుర పరిచిన ఆదిమానవుని ఆనవాళ్లు..
సాక్షి, నంగునూరు: ఆదిమానవుల ఆనవాళ్లు, అతిపురాతన వస్తువులు.. అబ్బుర పరిచే అవశేషాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో బయటపడ్డాయి. ఆదిమానవుని సమాధి, వారు వాడుకున్న సామాగ్రీ వెలుగు చూశాయి. ఇవి సుమారు 3000 వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వినియోగించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి నుంచి మూడు నెలల పాటు నంగునూరు మండలంలోని నర్మెట, పాలమాకుల, మగ్దుంపూర్ గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అతి పురాతన వస్తువులు, ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ అవశేషాలను హైదరాబాద్‌లోని పురావస్తుశాలకు తరలించి భద్రపరిచారు. (చదవండి: హైదరాబాద్‌లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?) 1.క్యాప్‌స్టోన్‌గా అతిపెద్ద బండరాయి.. ఈ చిత్రంలో కనిపిస్తున్నపెద్ద బండరాయి ఆదిమానవుల సమాధిపై ఉన్న క్యాప్‌స్టోన్. ఇది సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సమాధిపై కప్పిఉన్న బండరాయి (క్యాప్‌స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్లు వెడల్పు, 65 సెంటీమీటర్లు మందంతో 43 టన్నుల బరువు ఉంది. దీన్ని క్రేన్ సహాయంతో లేపేందుకు ప్రయత్నించగా దాని సామర్థ్యం సరిపోలేదు. దీంతో 80 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న క్రేన్ సహాయంతో 2 గంటల పాటు కష్టపడి బండను తొలగించారు. 2. సుద్ద ముక్కలు కావు శంఖాలు (కౌంచ్) సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు ప్రార్థన చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తరువాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా వీటిని వాడేవారని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 3. కుండలు పెట్టుకునే రింగ్‌స్టాండ్ ఆదిమానవులు వంట పాత్రలను పెట్టుకునే స్టాండ్ ఇది. వంటలు చేయగానే కుండలు పడిపోకుండా, క్రిమికీటకాలు కుండల్లోకి పోకుండా ఇలాంటి ఎరుపు రంగు కల్గిన కుదర్లు (రింగ్‌స్టాండ్) వాడేవారు. చూడడానికి ఢమరుకం లాగ కనబడుతున్నా వాస్తవానికి మట్టికుండలు పెట్టుకునే ఉపయోగించే రింగ్‌స్టాండ్ ఇది. 4. నక్షత్ర సమూహాలను గుర్తించే కఫ్‌మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్‌మాక్స్ లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండ లపై చెక్కేవారు. (పురావస్తుశాఖ అధికారులు గుంతల్లో ఉప్పు పోయడంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి). 5. తవ్వకాల్లో బయటపడుతున్న మృణ్మయ పాత్రలు ఎరుపు, నలుపుతోపాటు రెండు రకాల రంగులు కల్గిన మిశ్రమ మృణ్మయ బయటపడ్డాయి. రెండు సమాదుల్లో తవ్వకాలు జరుపగా ప్రాచీన మానవులు వాడిన అనేక పాత్రలు, ఎంతో కీలకమై సమాచారం లభించింది. 6. అద్భుతమైన మట్టికుండ ప్రాచీన మానవుడు వాడిన ఎరుపు రంగు మట్టికుండ నర్మెటలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. వేల సంవత్సరాల కిందట తయారు చేసిన మట్టి కుండకు చుట్టు అలంకారంగా సర్కిళ్లు చెక్కగా ఇప్పటికి చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత పెద్దకుండను తాగునీటి కోసం ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: జొన్నలకు పులి కాపలా!) 7 ఫైర్‌స్టాండ్, మృణ్మయ పాత్రలు ధాన్యం, విలువైన వస్తువులు మట్టికుండల్లో దాచేవారు. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన పదార్థాలను కుండల్లో పెట్టి సమాధి చేసేవారు. అలాగే ఫైర్‌స్టాండ్ (కుంపటి) పై ఆహార పదార్థాలు వేడి చేసుకోవడమే కాకుండా ధూపం వేసుకునేందుకు వీటిని వాడినట్లు తెలుస్తోంది. 8. రాళ్లుకావు ప్రాచీన మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈప్రాంతంలో ఆదిమానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్విస్తిక్ ఆకారంలో ఏర్పాటు చేసేవారు. దాని చట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. 9. గుంతలు కావు గ్రూవ్స్ మగ్దుంపూర్‌లో ఓరైతు వ్యవసాయ బావి వద్ద ప్రాచీన మానవుడు ఏర్పాటు చేసుకున్న 12 గ్రూవ్స్ గుర్తించారు. జంతువులను వేటాడేందుకు ఉపయోగించే రాతి ఆయుధాలను పదును పెట్టేందుకు వీటిని ఉపయోగించేవారు. 10. గిన్నెల తయారీ అద్భుతం ప్రాచీన మానవులు ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఎరుపు, నలుపు రంగు మట్టి గిన్నెలను ఉపయోగించేవారు. ఇవి ఇతర మట్టిపాత్రలకు భిన్నంగా రెండు రంగులు కల్గి ఉండగా ఇప్పటికి చెక్కుచెదరలేదు. మెన్హీర్ సమీపంలో ఉన్న రెండవ సమాధిలో ఇవి బయటపడ్డాయి. 11. చెక్కు చెదరని దంతాలు మెన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో జరుపుతున్న తవ్వకాల్లో తెగలోని పెద్ద మహిళదిగా బావిస్తున్న 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దానికి ఉన్న దంతాలు ఇప్పటికి చెక్కుచెదరలేదు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరపనున్న పరిశోధనల్లో ఈ రెండు భాగాలు కీలకంగా మారనున్నాయి. 12. ఎముక ఆభరణాలు ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు మెన్హీర్ వద్ద పెద్ద సమాధిలో జరిపిన తవ్వకాల్లో బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు) -
Shanigaram Village: చరిత్రకెక్కిన శనిగరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌కు 20 కి.మీ. దూరంలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో శనిగరం గ్రామం ఉంది. ఇక్కడి పురాతన శిథిల శివాలయంలో అరుదైన ఆధారాలు బయటపడ్డాయి. నిర్మాణశైలి ప్రకారం ఈ గుడి కాకతీయుల శైలికి చెందింది. నాలుగు అడుగుల ఎత్తయిన జగతిపై ఆలయ నిర్మాణం జరిగింది. 16 కాకతీయ శైలి స్తంభాలతో కూడిన అర్ధమంటపం ఉంది. అలాగే, అంతరాలం, గర్భగుడులు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు రమేష్‌శర్మ, ఉజ్జేతుల రాజు వెల్లడించారు. కొత్త కాకతీయ శాసనం శనిగరంలో కొత్త కాకతీయ శాసనం ఒకటి లభించింది. ఈ శాసనం ఒక గ్రానైట్ రాతిస్తంభం మీద మూడు వైపుల చెక్కి ఉంది. సూర్యచంద్రులు, శివలింగం, ఆవులు శాసనం పైవైపు చెక్కి ఉన్నాయి. శాసనాన్ని చూసి రాసుకున్న దాని ఆధారంగా ఈ శాసనం రామనాథ దేవాలయానికి ఆ ఊరిప్రజలు.. బ్రాహ్మణుల సమక్షంలో కొంత భూమి దానం చేసినట్లు గుర్తించారు. మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఓరుగల్లులో రాజ్యం చేస్తున్నపుడు మన్మథనామ సంవత్సరం (క్రీ.శ.1295)లో వేసిన శాసనంగా భావిస్తున్నారు. ద్వారస్తంభం మీద కలశాలు చెక్కి ఉన్నాయి. గుడి కప్పుకు ప్రత్యేకమైన కాకతీయశైలి ప్రస్తరం (చూరు) కనిపిస్తుంది. ఈ గుడిలోని స్తంభాలపై చెక్కిన అర్థశిల్పాలు ప్రత్యేకం. ఇవి రామప్పగుడిలోని స్తంభశిల్పాలకన్నా ముందరి కాలానికి చెందినవి. విశేషమైన శిల్పం ఒక స్తంభం మీద కనిపించింది. ఈ స్తంభశిల్పంలో ఒకవైపు విల్లు ధరించిన చెంచులక్ష్మి కాలికి గుచ్చుకున్న ముల్లు తీస్తున్న దృశ్యం, ఇంకోవైపు ఎద్దులతో రైతు కనిపించడం విశేషం. ఇది ఏరువాకకు చెందిన శిల్పమే. ఇక కొన్ని ఆధారాలను పరిశీలిస్తే కాకతీయుల పాలనలో ప్రధాన కేంద్రం ఇదేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. రామప్పను తలపించేలా.. ఈ స్తంభ శిల్పాల్లో ఒక స్తంభంపై ముగ్గురు నృత్యకారులు నాలుగు కాళ్లతో కనిపించే శిల్పం రామప్పగుడి మాదిరిగానే ఉంది. మరో స్తంభంపై ఏనుగులు తొండాలతో పోట్లాడుతున్నట్టు, ఇంకో స్తంభం మీద హంసలు ఉన్నాయి. వైష్ణవమత ప్రతీకైన గండభేరుండం, శైవమతంలో పేర్కొనబడే శరభేశ్వరుల శిల్పాలను ఎదురుపడినట్లుగా చెక్కిన శిల్పం మరో స్తంభంపై చూడొచ్చు. ఒక స్తంభంపై రెండు గుర్రాలమీద స్వారీ చేస్తూ ఆయుధాలతో ఇద్దరు వీరులు కనిపిస్తున్నారు. దేవాలయ స్తంభాలపై యుద్ధ దృశ్యం చాలా అరుదైంది. రామాయణాన్ని తలపించే లేడివేట దృశ్యం.. విల్లమ్ములతో వీరుడు, అమ్ముదిగిన జింకను తీర్చిదిద్దారు. ఏనుగును వధిస్తున్న వీరుడితో పాటు ఆలయ ప్రాంగణంలో హనుమంతుని శిల్పం, ఒక శాసనఫలకం ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం కింద ఉన్న శాసనలిపిలో సింమ్వ సింగ్గన అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అది హనుమాన్ శిల్పాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరై ఉంటుందని భావిస్తున్నారు. ఇలా కాకతీయుల పాలనకు అద్దంపట్టే అనేక శిల్పాలు రామప్ప గుడిని తలపిస్తున్నాయి. కాగా చాళుక్యల శైలి నిర్మాణవాస్తుతో కట్టిన గుడి ఆనవాళ్లు, గుడిస్తంభాలు ఉన్నాయని, వాటిమీద ఇనుమును కరగదీసిన ఆనవాళ్లు, నలుపు ఎరుపు కుండపెంకులు, రాగి నాణేలు లభించాయని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు. -
Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!
తిరువొత్తియూర్(తమిళనాడు): దిండిగల్ జిల్లా పలని షణ్ముఖ నదీతీరంలో సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటి రాతి ఆయుధాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. పురాతత్వ పరిశోధన బృందం జరిపిన తవ్వకాల్లో ఆ ఆయుధం పగిలిన స్థితిలో లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్త నారాయణ మూర్తి మాట్లాడుతూ మానవ చరిత్రను పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, ఆధునిక రాతి యుగం, లోహ యుగంగా విభజించారన్నారు. ప్రస్తుతం లభించిన రాతి ఆయుధం.. కొత్త రాతి యుగానికి చెందినదని, ఈ కాలంలోనే తమిళుల మొదటి సంఘాకారం ప్రారంభమైందన్నారు. కొత్త రాతి యుగం ఆయుధాలను మానవులు జంతువులను వేటాడేందుకు ఉపయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం లభించిన ఈ రాతి ఆయుధం కొన, వెనుక భాగం పూర్తిగా పగిలి ఉన్నట్లు తెలిపారు. దీనిపై ప్రాచీన తమిళ లిపి చెక్కి ఉందని, పైభాగంలో 8 అక్షరాలు కింది భాగంలో 5 అక్షరాలు ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై తెన్నాన్ అని రాసి ఉండడం వల్ల ఈ ఆయుధం తెన్నాడన్కు సంబంధించి అయి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమిళ లిపి ప్రాచీతమైందని చెప్పేందుకు ఈ రాతి ఆయుధం ముఖ్య సాక్ష్యంగా ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: శశికళ రాజకీయ ప్రవేశంపై నిరసన గళాలు) -
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) 1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్‌లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు. -
బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే..
నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో బుద్ధుడి ధాతువు(ఎముక) ప్రధాన ఆకర్షణ. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది ఏపీకి తరలనుంది. అలాగే గుంటూరులో జరిగిన ‘కాలచక్ర’ఉత్సవాలకు వెళ్లిన తెలంగాణ వస్తువులు తిరిగి ఇక్కడికి రానున్నాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు సంపద బట్వాడా మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అధీనంలో ఉన్న పురాతన సంపద పంపకం జరుగుతోంది. రెండు రాష్ట్రాల వైపు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో ఈ పంపకం సాగుతోంది. 1956కు ముందున్న వస్తువులన్నీ తెలంగాణకే చెందుతాయని కమిటీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత సమకూరిన వాటిలో.. ఏ ప్రాంతంలో లభించినవి ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందనున్నాయి. 1956 తర్వాత ఖరీదుకు సమకూర్చుకున్నవి 58:42 దామాషా ప్రకారం (ఏపీకి 58.. తెలంగాణకు 42) పంచనున్నారు. తొలుత స్టోర్లలో ఉన్న వాటిని పంచుతున్నారు. ఆ తర్వాత ప్రదర్శనలో ఉన్నవాటిని బట్వాడా చేయనున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలకు సంబంధించి ఏపీకి ఇప్పటికే 30 వేల నాణేలను కేటాయించారు. వాటిని విడిగా ఏపీ అధికారులు స్థానికంగా భద్రపరుచుకున్నారు. మొత్తం 3.65 లక్షల వస్తువులను పంచుకోవాల్సి ఉంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి పురావస్తు సంపద పంపకాలకు కసరత్తు జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరక కొలిక్కి రాలేదు. ఆరున్నరేళ్ల తర్వాత ఓ నిర్ణయానికి రావడంతో బట్వాడా ప్రక్రియ మొదలైంది. 1956కు ముందు తెలంగాణతో ఏపీకి సంబంధం లేనందున అంతకుముందున్న పురాతన సంపదపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉం టుందన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పురావస్తు పంపక కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, కన్వీనర్ రాములు స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉన్నం దున ఏ ప్రాంతంలో లభించిన వస్తువులపై ఆ ప్రాం తానికే హక్కు ఉంటుందని తేల్చినట్టు తెలంగాణ కమిటీ సభ్యుడు రంగాచార్యులు తెలిపారు. చదవండి: ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు నాణేలే ఎక్కువ.. ప్రపంచంలో బ్రిటిష్ మ్యూజియం తర్వాత అత్యధిక నాణేలు ఉన్నది హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలోనే. ఇక్కడ 3.45 లక్షల నాణేలున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు 53 వేలు చెందుతాయని తాజాగా అధికారులు లెక్కలు తేల్చారు. వీటిల్లోంచి 30 వేలను గత పక్షం రోజుల్లో దశలవారీగా అందజేశారు. నాణేల్లో బంగారువి 17 వేలుంటే, ఏపీకి ఇచ్చేవి 5 వేలుగా గుర్తించారు. ఇక తెలంగాణలో లభించినా.. కొన్ని ఏపీ ప్రాంత సామ్రాజ్యాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో వాటిని ఏపీకి ఇవ్వాలన్న యోచనలో తెలంగాణ అధికారులున్నట్లు సమాచారం. నల్లగొండ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ఏపీ ప్రాంతానికి చెందిన వెంగీ చాళుక్యుల సామ్రాజ్యానికి చెందినవి కావటంతో వాటిని ఏపీ కోరుతోంది. బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే.. నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణల్లో బుద్ధుడి ధాతువు ఒకటి. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది బుద్ధుడి ఎముక. దీంతోపాటు ఆయన చితాభస్మం కూడా ఉంది. ఇది విశాఖపట్నం సమీపంలోని బావికొండలో 1980లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసింది. ఇవి ఉన్న పాత్రలో బుద్ధుడి కాలానికి సంబంధించి చిన్న బంగారు, వెండి వస్తువులున్నాయి. ఆ పాత్రను నాంపల్లి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడది ఏపీకి తరలివెళ్లనుంది. తెలంగాణలో మరెక్కడా బుద్ధుడి ధాతువు లేనందున దీన్ని హైదరాబాద్‌లోనే ఉంచేలా ఏపీని కోరాలని అధికారులు నిర్ణయించారు. అలాగే కృష్ణాజిల్లా మోటుపల్లిలో చోళుల కాలానికి చెందిన నటరాజ, పార్వతి, నాయనార్ల తామ్ర విగ్రహాలున్నాయి. ఇవి కూడా మ్యూజియంలో ప్రధానాకర్షణ. ఇవీ ఏపీకి వెళ్లనున్నాయి. అమరావతి శిల్పాలు తెలంగాణకు.. చెన్నై రాజధానిగా 1953కు ముందు ఏపీ కొనసాగినప్పుడు ఆంధ్రాలోని అమరావతిలో లభించిన అద్భుతశిల్పాలు చెన్నై, తంజావూరు మ్యూజియంలలో ఉంచారు. 1917లో నాటి తెలంగాణ స్టేట్ పురావస్తు అధికారులు పరస్పర మార్పిడిలో భాగంగా తమిళనాడు నుంచి కొన్ని శిల్పాలు తెచ్చారు. ఇందులో అమరావతివి కూడా ఉన్నాయి. అవి 1956కు ముందు వచ్చినందున ఇప్పుడవి తెలంగాణ లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఫణిగిరి, నేలకొండపల్లి సహా వివిధ ప్రాంతాల్లో లభించిన కొన్ని వస్తువులు ఏపీలో ఉన్నాయి. అవి తెలంగాణకు రానున్నాయి. ఇక దలైలామా ఆధ్వ ర్యంలో గుంటూరులో జరిగిన కాలచక్ర ఉత్సవాల సమయంలో కూడా తెలంగాణ నుంచి పెద్ద సం ఖ్యలో శిల్పాలు, ఇతర పురాతన వస్తువులు గుంటూరుకు తరలాయి. అవి తెలంగాణకు వస్తాయి. -
గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు
శ్రీశైలం: శ్రీశైలంలోని ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. ఉప స్థపతి జవహర్ మంగళవారం వీటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆలయ ఈవో కేఎస్.రామారావు వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..5 ఇన్ టూ 9 అంగుళాల సైజులో ఉన్న రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు. శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు. ఇవి 1800–1910 మధ్య తయారైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. వీటి పరిశీలనకు శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ అధ్యయన కేంద్రం సంస్కృతి, పురావస్తు విభాగం ఆచార్యులను పిలిపించామని, పురావస్తు కార్యాలయానికి కూడా సమాచారమిచ్చామని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీలలో 29 తామ్ర శాసనాలు లభించాయి. (చదవండి: సింహం ప్రతిమలు మాయం, విచారణకు కమిటీ) -
ఆ మాట వినగానే గొల్లున నవ్వారు..
లండన్: కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పీజీ చదువుతున్న 21 ఏళ్ల డానియెల్లీ బ్రాడ్‌ఫోర్డ్‌కు ‘మార్శ్ ఆర్కియాలోజీ’ విభాగం నుంచి ఫోన్ రాగానే ఆమె ఆనందంతో ఎగిరి గంతేశారు. ‘ఆర్కియాలజీ ఫీల్డ్ వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులు’ అన్న అంశంపై రీసెర్చ్ చేసి థీసిస్‌ను సమర్పించినందుకుగాను ఆమెకు అవార్డు ఇస్తున్నట్లు చెప్పడానికే ఆ ఫోన్‌కాల్. నవంబర్ 22వ తేదీ సాయంత్రం తమ ఆర్కియాలజీ విభాగం ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా బ్రాడ్ఫోర్డ్ను ఆహ్వానించారు. ఫీల్డ్‌వర్క్‌లో లైంగిక వేధింపులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను కూడా ఆమె తన థీసిస్‌లో సూచించారు. అవార్డు అందుకోబోతున్న సంతోషంలో ఆమె అవార్డుల కార్యక్రమానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు ఆర్కియాలజీ ఫీల్డ్‌వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులపై అధ్యయనం జరిపినందుకు అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించగానే ప్రేక్షకులు ముఖ్యంగా మగాళ్లు గొల్లున నవ్వారు. ఆమె అవార్డు అందుకోవడానికి వేదికపైకి వెళుతున్నప్పుడు కూడా ‘ఆర్కియాలజీ ఫీల్డ్ వర్క్‌లో లైంగిక వేధింపులా’ అంటూ పగలబడి నవ్వారు. అవార్డు కింద ఓ జ్ఞాపికను, సర్టిఫికెట్‌ను అందుకున్న ఆనందం క్షణం కూడా నిలబడకుండా పోవడంతో బ్రాడ్ఫోర్డ్ వెక్కి వెక్కి ఏడుస్తూ పరుగు పరుగున వెళ్లి తన సీటులో కూర్చుంది. ‘ఆర్కియాలజీ ఫీడ్వర్క్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులు జరగకపోవచ్చుకానీ మీ పట్ల జరిగి ఉండవచ్చు’ అంటూ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలను భరించలేక ఆమె అక్కడి నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. బ్రాడ్ఫోర్డ్ సాహసించి రీసర్చ్కు ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నందుకు ప్రశంసించాల్సిందిపోయి, హేళన ఎందుకు చేస్తారంటూ నిర్వాహకులు ప్రేక్షకులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ తర్వాత ట్విటర్లో కూడా ఆమెను ట్రోల్ చేశారు. -
‘సింధూ నాగరికత’ వారసులు తమిళులా!
సాక్షి, న్యూఢిల్లీ : క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల వరకు కొనసాగిన సింధూలోయ నాగరికతకు అసలైన వారసులు ఎవరు ? నాడు సింధూలోయలో నివసించిన ప్రజలు భారత్–ఐరోపా ప్రాంతాల నుంచి పశువుల కాపర్లు వలస రావడంతో ఎక్కడికి పోయారు ? అప్పటికే సంక్లిష్ట పట్టణ సంస్కతి కలిగిన సింధూ లోయ పూర్వికుల జాడలు నేడెక్కడ? అసలు సింధూ నాగరికుల భాష ఏమిటీ ? ఎప్పటి నుంచో భారతను తొలుస్తున్న ప్రశ్నలివి. తామే సింధూ నాగరికతకు వారసులమని, ద్రావిడుల మూల భాషే సింధూ భాషంటూ, అందుకు భాషాపరమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయంటూ ద్రావిడ ఉద్యమంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్న వాదనలో నిజమెంత ? సింధూ లోయ నాగరికతకు అసలైన వారసులు తమిళులేనంటూ తమిళ సాహిత్యం ఎప్పటి నుంచో చెబుతున్న నేపథ్యంలో వాస్తావాస్తవాలను తెలుసుకునేందుకు భారత చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అందులో భాగంగా ముందుగా తమిళుల పూర్వికుల ఎవరో తెలుసుకునేందుకు తమిళనాడులోని అరిక్కమేడు ప్రాంతంలో 1947లో, కావేరిపూంపట్టిణం ప్రాంతంలో 1965లో, అదినాఛల్లార్ ప్రాంతంలో 2005లో భారత పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. సింధూ నాగరికతకు తమిళనాడుకు సంబంధం ఉన్న దాఖలాలేవీ ఈ మూడు తవ్వకాల్లో లభించలేదు. కానీ సెల్, సైన్స్ అనే శాస్త్రవిజ్ఞాన పత్రికలు తాజాగా ప్రచురించిన వ్యాసాల కథనం ప్రకారం 2015లో తమిళనాడులోని మధురై, శివగంగాయ్ జిల్లాల సరిహద్దులోని కీళడి (వాయ్‌గాయ్ నది ఒడ్డున) వద్ద ‘ఆర్కియాలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ జరిపిన తవ్వకాల్లో సరైన ఆధారాలు దొరికాయి. సంగం కాలానికి చెందిన క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం నాటి ‘వస్తువులు, పాత్రలు’ లభించాయి. నాలుగో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండో శతాబ్దం వరకు తమిళ సంస్కతి పరిఢవిల్లిన కాలాన్ని సంగం కాలంగా వ్యవహరిస్తారు. సింధూ సంక్లిష్ట పట్టణ నాగరికతకు, తమిళుల సంక్లిష్ట పట్టణ నాగరికతకు సంబంధం ఉన్నట్లు ఈ పాత్రలు, వస్తువులు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రాజెక్ట్‌కు పర్యవేక్షణాధికారిగా ఉన్న అమర్నాథ్ రామకష్ణ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు. దీంతో అమర్నాథ్ రామకష్ణను మరోచోటుకు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ వెంటనే కీళడి తవ్వకాలను 2017లో నిలిపి వేసింది. దీనిపై డీఎంకే సహా అన్ని ద్రావిడ రాజకీయ పార్టీలు గొడవ చేశాయి. మరోపక్క అమర్నాథ్ రామకష్ణ తన బదిలీ అక్రమమంటూ కోర్టుకు వెళ్లిన లాభం లేకపోయింది. ఇది ఇంతకాలం వాదిస్తున్న స్వతంత్ర వైదిక నాగరికతకు భిన్నంగా ఉందనే ఉద్దేశంతోనే కేంద్రం తవ్వకాలను నిలిపేసినట్లు ద్రావిడ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో తమిళనాడు పురాతత్వ రాష్ట్ర విభాగం 2018లో కీళడి త్రవ్వకాల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది. మరో రెండు విడతల తవ్వకాలు చేపట్టి ప్రస్తుతం పనులను నిలిపివేసింది. ఈ తాజా తవ్వకాలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక వెలువడే అవకాశం ఉంది. తమిళుల వాదనతో 1964లోనే రష్యా, ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు అంగీకరించారు. ప్రపంచంలోనే సింధూ నాగరికత లిపిలపై అమోఘమైన పట్టును సాధించిన హెల్సింకి యూనివర్శిటీకి చెందిన చారిత్రక భాషాశాస్త్రవేత్త ఆస్కో పర్పోలా కూడా తమిళుల వాదనలో నిజం లేకపోలేదన్నారు. తమిళ మూల భాష లిపికి, సింధూ ప్రధాన లిపికి సామీప్యత కనిపిస్తోందని, అయితే ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి ఆధునిక రోజుల్లో పురాతత్వ తవ్వకాల్లో డీఎన్ఏ శోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకని తవ్వకాల లోతుల్లోకి వెళితే తప్పకుండా డీఎన్ఏ ఆనవాళ్లు దొరుకుతాయని భావిస్తున్న తమిళ పురాతత్వ విభాగం ఆ దిశగా 2020, జనవరి నెల నుంచి తవ్వకాలు ప్రారంభించాలని నిర్ణయించింది. -
శవాల గుట్టలు.. 227 మంది చిన్నారుల ప్రాణత్యాగం..!
లిమా : పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో శవాల గుట్టలు బయటపడ్డాయి. రాజధాని లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనగొన్నామని ఆర్కియాలజిస్టు ఫెరెన్ కాస్టిలో చెప్పారు. హువాన్‌చాకోలో కొనసాగుతున్న పురావస్తుశాఖ తవ్వకాలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేవుడికి తమను తాము అర్పించుకుని వారంతా సామూహికంగా ప్రాణాలు విడిచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం బాధాకరమన్నారు. అవశేషాలన్నీ క్రీస్తు 1200-1400 కాలానికి చెందిన చిమూ సంస్కృతికి చెందిన మనుషులవేనని తెలిపారు. తొలుత గతేడాది రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్ వద్ద తవ్వకాల్లో 56 పుర్రెలు బయటపడ్డాయని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న హువాన్‌చాకోలో తవ్వకాలు జరపగా 190 చిన్నారుల శరీర అవశేషాలు, 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన చోటల్లా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన బొక్కల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడటం కలచి వేసిందని చెప్పారు. మొత్తంగా ఇప్పటివరకు 227 మానవ అస్థిపంజరాలు వెలికి తీశామని, తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. శవాలన్నీ సముద్రం వైపునకు ముఖం చేసి ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున ప్రాణత్యాగం చేసిన ఉదంతాలు బయటపడటం చరిత్రలో తొలిసారని అన్నారు. కొలంబియన్ సృంస్కృతికి ముందుదైన చిమూ సంస్కృతి పెరూవియన్ తీరం వెంబడి ఈక్వెడార్ వరకు విస్తరించింది. ఐంక రాజ్యస్థాపనతో 1475లో అంతరిచింది. -
శ్రీవారి ఆభరణాల మాయం నిజమే: చెన్నారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పై జరుగుతున్న పరిణామాలపై తాజాగా పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. వెంకన్న స్వామిని కృష్ణ దేవరాయులు ఏడు సార్లు దర్శించుకున్నారన్నారు. ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012 లో ఓ కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఈవో మాట్లాడుతూ...టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఈవో తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
నాడు సమాధి.. నేడు శివాలయం
న్యూఢిల్లీ : కుతుబ్ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి అది. ఒకప్పుడు ఊరి చివర ఉన్న ఆ సమాధి కాస్తా జనాభా పెరిగే కొద్ది ప్రస్తుతం ఊరు మధ్యలోకి వచ్చింది. రాజుల కాలం నాటి ఈ సమాధిని తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించాలని పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నించారు, అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. కానీ ఆశ్చర్యంగా కొన్ని నెలల్లోనే ఆ సమాధిని కాస్తా ఆలయంగా మార్చి పూజ, పునస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఎనక్లేవ్ ప్రాంతంలో ఉన్న హుమాయున్ గ్రామంలో చోటుచేసుకుంది. కుతుబ్ షా కాలం నాటి గుర్తు తెలియని వ్యక్తి సమాధి కాస్తా ఇప్పుడు ‘శివ్ భోలా’ ఆలయం అయ్యింది. దీని గురించి స్థానిక పత్రికల్లో వార్తలు రావడంతో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కళలు, సాంస్కృతిక, భాషా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆదేశించారు. దీనిపై సిసోడియా స్పందిస్తూ.. ‘ఈ సంఘటన గురించి నాకు ఎటువంటి సమాచారం తెలియదు. ఒక చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయడం, దానికి హాని కల్గించడం రెండు నేరమే. ఇందుకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంది. పురావస్తు శాఖ అధ్వర్యంలో ఉన్న చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ శాఖదే. చారిత్రక కట్టడాలకు ఎవరైనా హాని కల్గిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా పురావస్తు శాఖ అధికారులకు ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఉండేందుకు పూర్తి వివరాలు ఇవ్వాలని పురావస్తు శాఖ వారిని ఆదేశించిడం జరిగింది. దీనికి బాధ్యులేవరైనా కఠిన శిక్ష తప్పద’ని స్పష్టం చేశారు. -
2వ శతాబ్దపు బుద్ద విగ్రహాలు లభ్యం
-
2వ శతాబ్దపు బుద్ద విగ్రహాలు లభ్యం
ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామ శివారులో బుద్ధుని విగ్రహాలతో పాటు 2వ శతాబ్దానికి సంబంధించిన పలు అవశేషాలు సోమవారం లభ్యమయ్యాయి. పోలేరమ్మ గుడు సమీపంలో మట్టి కోసం తవ్వకాలు చేస్తుండగా పెద్ద కుండ బయటపడింది. అందులో అడుగు పొడవున్న బుద్ధుని రాగి విగ్రహాలు రెండు, స్తంభాలు రెండు, దీపారాధన కండె, హారతి పళ్లెం ఇతర వస్తువులు ఉన్నాయి. మట్టి కింద పది అడుగుల లోపల రాతి కట్టడాల ఆనవాళ్లు కనిపించాయి. ఇవి 2వ శతాబ్దానికి సంబంధించినవని పురావస్తు అధికారులు తెలిపారు. ఇక్కడ బౌద్ధ నాగరికత పరిఢవిల్లి ఉంటుందని ఆర్కియాలజి డిప్యూటీ డెరైక్టర్ కేశవ్ చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఆయన విగ్రహాలు బయటపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రదేశంలో భూమిలోపల ఊరి అవశేషాలు ఉండవచ్చని, తవ్వకాలు నిర్వహిస్తామని చెప్పారు. -
వేయి స్తంభాల కోసం.. వేయి కళ్లతో..
సాక్షి, హన్మకొండ: కాకతీయుల శిల్పకళకు అద్దంపట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం కారణంగా పునరుద్ధరణ పనులు మధ్యలో ఆగిపోయాయి. నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా పేరొందింది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా జీవకళ ఉట్టిపడే భారీ నంది విగ్రహం.. దాని వెనుక అద్భుతమైన కల్యాణ మంటపం ఉండేది. పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచింది. 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. తుగ్లక్ సేనలు జరిపిన దక్షిణ భారత దండయాత్రలో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్ని ర్మించాలని నిర్ణయించింది. నాటి కాకతీయుల నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించి ఇందుకోసం రూ.7 కోట్లు మంజూరు చేసింది. పదేళ్లు గడిచినా.. కల్యాణ మంటపం పున:నిర్మాణ పను లు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మంటపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత రెండున్నరేళ్ల పాటు పనులు సాగలేదు. ఎట్టకేలకు 25-02-2010న మళ్లీ పనులు మొదల య్యాయి. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తిరిగి వినియోగించడానికి వీల్లేకుండా ఉన్న శిల లకు బదులుగా కొత్తగా 132 పిల్లర్లు, 160 బీమ్ శిలలు, శిల్పాలను చెక్కారు. కాకతీయులు ఉపయోగించిన ‘శాండ్బాక్స్’ టెక్నాలజీ ఆధారంగా పనులు మొదలె ట్టారు. మీటరు మందంతో డంగు సున్నం, గ్రాన్యువల్ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. దీనిపై ఏడు వరుసలు రాతి నిర్మాణంతో మొదలయ్యే ప్రదక్షిణ పథం నిర్మించారు. అనంతరం నాలుగు వరసలు ఉండే కక్షాసనం నిర్మించారు. ఆపై రాతిగోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న శిలలను పట్టి ఉంచేలా ముఖ్యమైన శిలలకు స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను అమర్చారు. గతంలో కాకతీయులు కరిగించిన ఇనుమును పోసిన పోతల్లోనే ఈ స్టెయిన్లెస్ స్టీలు పట్టీలు అమర్చారు. కిందామీదా పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ, మరోసారి నిధుల కొరత ఏర్పడటంతో గడిచిన మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మేడారం జాతర సమయంలో దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు భక్తులు చేరుకుంటారు. అప్పటి వరకైనా కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు పూర్తరుుతే... వేయిస్తంభాల గుడికి పునర్ వైభవం వస్తుంది.