సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామ శివారులో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తవ్వకాల్లో బృహత్ శిలా యుగపు సమాధుల చరిత్రను తిరగరాసే ఆధారాలు లభ్యమవుతున్నాయని వారు చెబుతున్నారు. సోమవారం జరిగిన తవ్వకాల్లో మనిషి పుర్రె (తల భాగం)ను ఒక కుండలో పెట్టి ఖననం చేసిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి.
అదే విధంగా నలుపు, ఎరుపు రంగుల మృణ్మయ పాత్రలు లభిస్తున్నాయి. ఇవన్నీ స్మారక శిల ముందు భాగంలో దక్షిణ దిశలోని క్యాప్సిస్టోన్ తొలగించిన మధ్య భాగంలో లభించాయని పురావస్తు శాఖ సాంకేతిక సహాయకుడు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి తెలిపారు.
తవ్వకాల్లో పురావస్తు ఆధారాలు లభ్యం
Published Mon, Aug 3 2015 9:08 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement