చార్మినార్: చార్మినార్ కట్టడం ప్రాంగణంలోని వెనుక వైపు పురావస్తు శాఖ విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మంగళవారం చేపట్టిన తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. చార్మినార్ కింద భూగర్భ మెట్లు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో పత్తర్‌గట్టి కార్పొరేటర్ మూసా సోహేల్ ఖాద్రీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చార్మినార్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ మరమ్మతు పనులను నిలిపివేయాలని పురావస్తు శాఖ అధికారులను కోరారు.
దీనిపై సమాచారం అందడంతో పురావస్తు శాఖ హైదరాబాద్ సూపరింటెండెంట్‌తో పాటు ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తవ్వకాల్లో బయటపడ్డ భూగర్భ మెట్లను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం విద్యుత్ మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చార్మినార్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment