తవ్వకాల్లో బయటపడిన ఎముకలు, పుర్రెలు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది.
(చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్)
1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు.
(చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి)
ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్‌లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment