Cannibalism
-
అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!
మధ్యయుగం, ప్రాచీన శిలాయుగలలో మానవుడు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు అనేదాని గురించి నేటికి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆ కాలంలో వారిలో ఎవరైన చనిపోతే ఎలా వీడ్కోలు చెప్పేవారు, ఆ మృతదేహాలను ఏం చేశారనే విషయాన్ని చేధించారు శాస్త్రవేత్తలు. నాటి మానవులు చనిపోయిన వాళ్లకి జరిపే అంత్యక్రియ విధానం గురించి చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐరోపా అంతటా ప్రాచీన శిలాయుగంలో మానవ అవశేషాలపై శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో నరమాంస భక్షణ గురించి వెల్లడైంది. దాదాపు 15 వేల ఏళ్ల క్రితం ఐరోపాలో ఉన్న ప్రజలను మాగ్డలీనియన్‌లుగా పిలిచేవారు. వారు నరమాంస భక్షణ చేసేవారని తేలింది. అయితే ఎవ్వరైన చనిపోతే ప్రజలు వారికి వీడ్కోలు లేదా అంత్యక్రియలు నిర్వహించడానికి ఇలా చేసేవారని తెలిపారు. ఖననం చేయడానికి బదులుగా ప్రజలే ఆ మృతదేహాన్ని తినేసేవారని చెప్పుకొచ్చారు. అది అక్కడ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగా ఉండేదని అన్నారు. అందుకు సంబంధించన ఎముకలు, పుర్రెలు వంటి ఆధారాలతో సహా వెల్లడించారు. మాగ్డలీనియన్ ప్రజల సంస్కృతి, కళ, వారి సాంకేతికత నిలువెత్తు నిదర్శనం అని, వారు ఉపయోగించిన రాయి, ఎముకలపై చెక్కిన కళఖండాలే అందుకు సాక్ష్యం అని అన్నారు. ఐరోపాలో పురాతన శిలయుగంలో రెండు విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం మాగ్డలేనియన్లు మాత్రమే కాక వేరే జాతి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మాగ్డలేనియన్లు ఐరోపాకి వాయువ్యంలో సంచరించగా, ఆగ్నేయంలో ఎపిగ్రావెటియన్ల అనే మరో జాతి ప్రజలు ఉండేవారని. వీరు కూడా తమలో ఎవరైన చనిపోతే నరమాంస భక్షణ చేసేవారని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ ఇరు జాతులు అంత్యక్రియల నిర్వహించడానికి బదులు మృతదేహాలను భక్షించేవారని, అదొక ఆచారంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఐరోపాలోని గోఫ్స్ గుహలో ఉన్న కపాల పాత్రలు, ఎముకలతో చేసిన గిన్నేలు, గ్లాసులు సాక్ష్యం అని చెప్పారు. తొలుత ఎపిగ్రావెటియన్లు చనిపోయిన వారిని పాతిపెట్టేవారని, ఆ తర్వాత మాగ్డలేనియన్లు ఉన్న ప్రాంతానికి వలస వచ్చిన తర్వాత వారి ఆచార పరంపరను ఈ జాతి వారు కొనసాగించనట్లు గుర్తించారు. నాటి మానవులు ఇంత భయానక రీతిలో అంత్యక్రియలను నిర్వహించడానికి గల కారణాలపై పరిశోధన సాగిస్తున్నట్లు పేర్కొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. (చదవండి: వాట్! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్ అదిరిపోలా..!) -
నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!
కొన్ని నేరాలు చూస్తే మనుషులేనే ఇంత ఘోరానికి పాల్పడుతున్నది? అని ఆశ్యర్యంగా అనిపించక మానదు. కోపంతోనే లేక పగ, ద్వేషంతో క్షణికమైన ఆవేశంలో చేసిని నేరాలు గురించి విని ఉంటాం. కొన్ని నేరాలు వినడానికి హాస్యస్పదంగానూ, నమ్మశక్యంగానీ విధంగా ఉంటాయి. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక వ్యక్తి ఒక వింత నమ్మకంతో 70 ఏళ్ల వృద్ధుడిని చంపేశాడు. (చదవండి: ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!) అమెరికాలోని ఇడాహోకు చెందిన 39 ఏళ్ల జేమ్స్ డేవిడ్ రస్సెల్ నరమాంస భక్షణ వల్ల తన మెదడు నయం అవుతుందని నమ్మకంతో డేవిడ్ ప్లాగెట్ అనే 70 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. అంతేకాదు ఇడాహోలో నరమాంస భక్షణకు సంబంధించిన తొలి కేసుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు బోన్నర్ కౌంటీ డిటెక్టివ్ ఫిలిప్ స్టెల్లా మాట్లాడుతూ..మొదటగా పోలీసులు రస్సెల్ ఇంటికి వెళ్లినప్పడు అతను మాతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు రస్సెల్ ఇంటి వెలుపల ఉన్న వాహనంలో ఫ్లాగెట్ అవశేషాలను కనుగొన్నాం. ఇది నా వ్యక్తిగతం నా కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు జోక్యం చేసుకోవడం ఇష్టం లేదంటూ రస్సెల్ మాపై అరిచాడు. ఈమేరకు మేము ఇల్లంతా వెతకగా రక్తంతో తడిసిన మైక్రోవేవ్, గాజు గిన్నె, డఫెల్ బ్యాగ్, కత్తిని గుర్తించాం. అంతేకాదు రస్సెల్ మానసిక స్థితి ఎలా ఉందంటే శరీర భాగాలను కోయడం ద్వారా తనను తాను స్వస్థత పరుచుకున్నట్లు భావించాడు. అంతేకాదు ఫ్లాగెట్‌కి రస్సెల్‌కి మధ్య చిన్న చిన్నవిభేదాలు కూడా ఉన్నాయి. రస్సల్ నుంచి తమకు లేదా బయటవాళ్లకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా రస్సెల్ కుటుంబ సభ్యులకు తెలుసు" అని అన్నారు. ఈ మేరకు రస్సెల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ 70 ఏళ్ల వృద్ధిడికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. పైగా రస్సెల్ బాధితుడు భాగాలు కూడా తిన్నాడని అన్నారు. అంతేకాదు ఇది అత్యంత క్రూరమైన నేరం మాత్రమే కాదు సైకలాజికల్ సమస్యతో చేసిన అ్యతంత పాశవికమైన నేరంగా అధికారులు పరిగణించారు. ఈ కేసు నిమిత్తం ఈ నెల 28న రస్సెల్‌ని పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!) -
cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము
భువనేశ్వర్ : కన్నిబలిజం.. ఈ మాట అంత పాపులర్ కాకపోయినా.. అప్పుడప్పుడూ తెరపైకి వస్తూ ఉంటుంది. కన్నిబలిజాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ‘స్వజాతి భక్షణ’ అని అర్థం. మరింత వివరంగా చెప్పాలంటే ఓ మనిషి, మరో మనిషిని తినటం.. ఓ సింహం మరో సింహాన్ని తినటం అన్న మాట. తాజాగా, కన్నిబలిజానికి సంబంధించిన ఓ వార్త ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒరిస్సా, కదురా జిల్లాలోని బాలకటి గ్రామంలో నాలుగు అడుగుల నాగుపాము.. మూడు అడుగుల నాగుపామను చుట్టి మింగేసింది. ఇది గమనించిన స్థానికులు సుదేందు మాలిక్ అనే వన్యప్రాణి సంరక్షకుడికి ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అతడు.. పామను పట్టుకుని అడవిలో వదిలేశాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ 3 అడుగుల నాగుపామును మింగేసినందుకు.. 4 అడుగుల నాగుపాము మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’’.. ‘‘నాదో అనుమానం.. వన్యప్రాణి సంరక్షకుడికి ఎవరు ఫోన్ చేశారు.. 3 అడుగుల పామా? నాలుగు అడుగుల పామా?’’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : ఆన్లైన్ క్లాస్‌లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ -
కన్నిబల్: ఫ్రెండ్స్‌ని చంపి తిన్నాడు..
మాస్కో : ముగ్గురు స్నేహితుల్ని దారుణంగా హత్యచేసి, వారి శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి(కన్నిబల్)కి జీవిత ఖైదు విధించింది కోర్టు. వివరాలు.. రష్యాలోని అర్ఖంగెల్క్స్కు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్నెవ్(51) 2016 మార్చి నుంచి 2017 మార్చి మధ్య కాలంలో అతడి ముగ్గురు స్నేహితులను ఒక్కొక్కరిగా తాగడానికి తీసుకెళ్లాడు. అనంతరం వారిని చంపి, శరీర భాగాలతో వంట చేసుకుని తిన్నాడు. అవసరం అనుకున్నంత మేరకు మాంసాన్ని ప్లాస్టిక్ కవర్లో భద్రపర్చుకుని, మిగితా భాగాలను పక్కనే ఉన్న నదిలో పడేశాడు. కొద్దిరోజుల తర్వాత మృతులలో ఒకడైన 34 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. మృతుడి తల్లిదండ్రులు అతడి గురించి ఆరా తీయగా.. పని మీద వేరే ఊరికి మారిపోయాడని అబద్ధం చెప్పాడు. ( తమిళనాడులో ఘోరం: 11 మంది మృతి ) మిస్సింగ్ కేసుతో ఎంక్వైరీకి వచ్చిన పోలీసులకు కూడా ఇదే స్టోరీ చెప్పాడు. మృతుల శరీరభాగాలు పోలీసులకు దొరికినప్పటికి గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. అయితే ఎడ్వర్డ్ ఇదివరకే జంట హత్యల కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. దీంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా దర్యాప్తు చేసి, ఆధారాలతో అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన రష్యా అత్యున్నత న్యాయస్థానం ఎడ్వర్డ్‌కు పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదు విధించింది. ( ఫ్రెండ్ భార్యపై కన్ను, పగబట్టి దారుణ హత్య ) -
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
మెక్సికన్ సిటి: మనిషి.. మనిషిని తినడం అనేది చాలా అసాధారణ విషయం. ఇలాంటి వాటి గురించి చాలా అరుదుగా వింటాం. అయితే మనిషి జంతువుల్ని వదిలేసి.. మానవుడిని తిన్న ఘటన గురించి ఇంత వరకు ఎప్పుడు వినలేదు. తాజాగా ఇలాంటి భయానక విషాయన్ని మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రపాలజీ అండ్ హిస్టరీ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. 1500 ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఓ స్పానిష్ విజేత.. తన సైన్యంతో కలిసి.. బంధించిన సమూహానికి చెందిన పలువురు మహిళలు, పిల్లల్ని దారుణంగా చంపి.. వారిని తిన్నాడని నివేదిక వెల్లడించింది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరు మనుషుల్ని తిని.. పందుల్ని వదిలేశారు. టెకోయాక్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఈ భయానక సంఘటన గురించి తెలిసింది. ‘వారు.. వారిని తిన్న స్థలం ఇదే’ అని అజ్టెక్ నాహుఔట్ భాషలో ఉందని నివేదిక తెలిపింది. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) 1520 లో టెకోయిక్ నివాసితులు స్వదేశీ సమూహాల నుంచి సుమారు 350 మంది ప్రజలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనను ‘జుల్టెపెక్’ అని కూడా పిలుస్తారు. ఇలా బంధించిన వారిలో 15 మంది పురుషులు, 50 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 45 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ఆఫ్రికన్, స్వదేశీ సంతతికి చెందిన క్యూబన్లు అని నివేదిక వెల్లడించింది. ఇక వీరిని బంధించిన విషయం గురించి విజేత హెర్నాన్ కోర్టెస్‌కు సమాచారం ఇవ్వగా.. అతడు వారిని చంపి.. పట్టణాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు. దాంతో అతడి సైన్యం నెలల వ్యవధిలో వీరందరిని చంపి.. 1521 ప్రారంభంలో పట్టణాన్ని నాశనం చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఇక్కడ తవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎన్రిక్ మార్టినెజ్ వర్గాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుంది. ఇక ఈ ఘటనలో ప్రాణ త్యాగం చేసిన వారి ఎముకలను, ఇతర సాక్ష్యాలను నిస్సార బావుల్లోకి విసిరినట్లు త్రవ్వకాలు వెల్లడించాయి. ఇక ఇక్కడ ప్రజలు దాడిని ఆపడానికి ప్రయత్నించారు.. కానీ విఫలమయినట్లు తెలుస్తోంది’’ అన్నారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) ఆయన మాట్లాడుతూ.. "పట్టణంలో బస చేసిన కొంతమంది యోధులు పారిపోగలిగారు. కాని మహిళలు, పిల్లలు ఇక్కడే ఉన్నారు. దాంతో వారే ప్రధాన బాధితులు అయ్యారు. ఇక తవ్వకాల్లో చిన్న పిల్లల ఎముకలు యుక్త వయసు ఆడవారితో పాటు పడి ఉన్నట్లు గుర్తించాము. ఇక ఖననం చేసిన స్థలాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రజలు పారిపోతున్నారని, వారిని దొరకపుచ్చుకుని ఊచకోత కోసినట్లు.. తొందరపాటులో ఖననం చేశారని తెలుస్తుంది" అన్నారు. అంతేకాక ‘‘అనేక దేవాలయాలు కాలిపోయాయి.. విగ్రహాలు తలలు ఖండించారు. పట్టుబడిన కొంతమంది మహిళల తలలు, పుర్రె రాక్‌లో వేలాడదీశారు. మరోక మహిళ గర్భవతి అని తెలిసింది. ఇలా బంధించిన ప్రజలను ఖైదీలుగా ఉంచి.. ఆరు నెలలకు పైగా ఆహారం ఇచ్చారు. ఆ తర్వాత గుర్రాలు, పురుషులు, స్త్రీలను చంపి.. తిన్నారు. అయితే స్పానిష్ ప్రజలు తమతో పాటు ఆహారం కోసం పందులను తీసుకువచ్చారు. కానీ వాటిని తినలేదని తవ్వకాల ద్వారా తెలిసింది’’ అన్నారు. -
నరమాంస భక్షకుడి వికృత చర్య
నరమాంస భక్షకుల పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ వెనిజులాలోని ఓ నరమాంస భక్షకుడి చర్యలు గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇతగాడు ఒక వ్యక్తిని చంపి, శరీర భాగాలు భక్షించడమే కాదు.. అతని రక్తం, బూడిదతో బొమ్మలను కూడా చిత్రించిన వైనం కలకలం రేపింది. వెనిజులాలోని బార్లోవెంటో ప్రాంతంలో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. బార్లోవొంటో ప్రాంతానికి చెందిన లూయిస్ అల్ఫ్రెడో గొంజాలెజ్ హెర్నాండెజ్ ఈ భయానక నేరానికి పాల్పడ్డాడు. పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. సైంటిఫిక్, పీనల్, క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ బాడీ (సిఐసిపిసి) నిందితుడి ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. సీఐసీపీసీ డైరెక్టర్ డగ్లస్ రికో ప్రకారం ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బాధితుడే నిందితుడిని ఈ భయంకరమైన చర్య చేపట్టేందుకు (తనని చంపి, శరీర భాగాలు తిని, రక్తం, బూడిదతో పెయింటింగ్స్ వేసేందుకు) నియమించుకున్నాడట. దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలంలో కొన్ని పెయింటింగ్స్‌ను, ఇతర శరీర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు చెందిన కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లను కూడా కనుగొన్నారు. దీంతో కనిపించకుండా పోయిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ఈ చిత్రాలు మానవ అవశేషాల నుండి తయారు చేయబడినవో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ అనాలిసిస్ నిర్వహించనున్నారు. -
మాంసం కోసం.. అమ్మాయిని చంపి..
సాక్షి, మాస్కో: మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యాలోని ఓ పట్టణ వాసులు వణికిపోతున్నారు. నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్థలానికి చేరుకుని వివస్త్రగా పడి ఉన్న అమ్మాయిని చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె శరీర భాగాలను కత్తితో కోసి, మాంసాన్ని సేకరించినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిలో సర్జన్ వినియోగించే గ్లౌజులు దొరకడంతో.. ఓ నేర్పరి అయిన వైద్యుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మాంసం కోసం అమ్మాయిని చంపారనే వార్త రష్యా న్యూస్ చానెళ్లలో ప్రసారం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒంటరిగా బయటకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు జంకుతున్నారు. మనిషి రక్త మాంసాలకు అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.