ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్
మాస్కో : ముగ్గురు స్నేహితుల్ని దారుణంగా హత్యచేసి, వారి శరీర భాగాలను తిన్న ఓ నరమాంస భక్షకుడి(కన్నిబల్)కి జీవిత ఖైదు విధించింది కోర్టు. వివరాలు.. రష్యాలోని అర్ఖంగెల్క్స్‌కు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్(51) 2016 మార్చి నుంచి 2017 మార్చి మధ్య కాలంలో అతడి ముగ్గురు స్నేహితులను ఒక్కొక్కరిగా తాగడానికి తీసుకెళ్లాడు. అనంతరం వారిని చంపి, శరీర భాగాలతో వంట చేసుకుని తిన్నాడు. అవసరం అనుకున్నంత మేరకు మాంసాన్ని ప్లాస్టిక్ కవర్లో భద్రపర్చుకుని, మిగితా భాగాలను పక్కనే ఉన్న నదిలో పడేశాడు. కొద్దిరోజుల తర్వాత మృతులలో ఒకడైన 34 ఏళ్ల వ్యక్తి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. మృతుడి తల్లిదండ్రులు అతడి గురించి ఆరా తీయగా.. పని మీద వేరే ఊరికి మారిపోయాడని అబద్ధం చెప్పాడు. ( తమిళనాడులో ఘోరం: 11 మంది మృతి )
మిస్సింగ్ కేసుతో ఎంక్వైరీకి వచ్చిన పోలీసులకు కూడా ఇదే స్టోరీ చెప్పాడు. మృతుల శరీరభాగాలు పోలీసులకు దొరికినప్పటికి గుర్తు పట్టలేని స్థితిలో ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. అయితే ఎడ్వర్డ్ ఇదివరకే జంట హత్యల కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. దీంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా దర్యాప్తు చేసి, ఆధారాలతో అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన రష్యా అత్యున్నత న్యాయస్థానం ఎడ్వర్డ్‌కు పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదు విధించింది. ( ఫ్రెండ్ భార్యపై కన్ను, పగబట్టి దారుణ హత్య )
Comments
Please login to add a commentAdd a comment