నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్‌ క్యూర్‌ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!! | Idaho Man Believed Eating Flesh Will Cure His Brain Later Charged | Sakshi
Sakshi News home page

నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్‌ క్యూర్‌ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!

Published Tue, Dec 21 2021 4:24 PM | Last Updated on Tue, Dec 21 2021 5:19 PM

Idaho Man Believed Eating Flesh Will Cure His Brain Later Charged - Sakshi

కొన్ని నేరాలు చూస్తే మనుషులేనే ఇంత ఘోరానికి పాల్పడుతున్నది? అని ఆశ్యర్యంగా అనిపించక మానదు. కోపంతోనే లేక పగ, ద్వేషంతో క్షణికమైన ఆవేశంలో చేసిని నేరాలు గురించి విని ఉంటాం. కొన్ని నేరాలు వినడానికి హాస్యస్పదంగానూ, నమ్మశక్యంగానీ విధంగా ఉంటాయి. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక వ్యక్తి ఒక వింత నమ్మకంతో 70 ఏళ్ల వృద్ధుడిని చంపేశాడు.

(చదవండి: ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!)

అమెరికాలోని ఇడాహోకు చెందిన 39 ఏళ్ల జేమ్స్ డేవిడ్ రస్సెల్ నరమాంస భక్షణ వల్ల తన మెదడు నయం అవుతుందని నమ్మకంతో డేవిడ్‌ ప్లాగెట్‌ అనే 70 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. అంతేకాదు ఇడాహోలో నరమాంస భక్షణకు సంబంధించిన తొలి కేసుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు బోన్నర్ కౌంటీ డిటెక్టివ్ ఫిలిప్ స్టెల్లా మాట్లాడుతూ..మొదటగా పోలీసులు రస్సెల్‌ ఇంటికి వెళ్లినప్పడు అతను మాతో వాగ్వాదానికి దిగాడు.

అంతేకాదు రస్సెల్ ఇంటి వెలుపల ఉన్న వాహనంలో ఫ్లాగెట్ అవశేషాలను కనుగొన్నాం. ఇది నా వ్యక్తిగతం నా కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు జోక్యం చేసుకోవడం ఇష్టం లేదంటూ రస్సెల్‌ మాపై అరిచాడు. ఈమేరకు మేము ఇల్లంతా వెతకగా రక్తంతో తడిసిన మైక్రోవేవ్, గాజు గిన్నె, డఫెల్ బ్యాగ్, కత్తిని  గుర్తించాం. అంతేకాదు రస్సెల్‌ మానసిక స్థితి ఎలా ఉందంటే శరీర భాగాలను కోయడం ద్వారా తనను తాను స్వస్థత పరుచుకున్నట్లు భావించాడు.

అంతేకాదు ఫ్లాగెట్‌కి రస్సెల్‌కి మధ్య చిన్న చిన్నవిభేదాలు కూడా ఉన్నాయి. రస్సల్‌ నుంచి తమకు లేదా బయటవాళ్లకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా రస్సెల్‌ కుటుంబ సభ్యులకు తెలుసు" అని అన్నారు. ఈ మేరకు రస్సెల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆ 70 ఏళ్ల వృద్ధిడికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. పైగా రస్సెల్‌ బాధితుడు భాగాలు కూడా తిన్నాడని అన్నారు. అంతేకాదు ఇది అత్యంత క్రూరమైన నేరం మాత్రమే కాదు సైకలాజికల్‌ సమస్యతో చేసిన అ‍్యతంత పాశవికమైన నేరంగా అధికారులు పరిగణించారు. ఈ కేసు నిమిత్తం ఈ నెల 28న రస్సెల్‌ని పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు.

(చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్‌ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement