detective
-
Abids CI: అడ్డు తొలగించుకునేందుకే అసత్య ప్రచారం
శాలిగౌరారం(నల్గొండ) : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తనను ఇంటిలో నుంచి బయటకు వెళ్లగొట్టి, మరో మహిళతో సహజీవనం చేస్తూ.. తన అడ్డు తొలగించుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్న తనభర్త అయిన హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) కుంభం నర్సింహపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఐ భార్య కుంభం సంధ్య కోరారు. మండలంలోని బండమీదిగూడెంలో తన తల్లిగారింటి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తనగోడును వెల్లబోసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహతో తనకు 2012 ఏప్రిల్ 18న వివాహం జరిగిందన్నారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.18.50 లక్షలు ఇవ్వడంతోపాటూ పది తులాల బంగారు ఆభరణాలను పెట్టారన్నారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టడంతో గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు పెట్టి అదనంగా మరో రూ. 2 లక్షలు అప్పజెప్పారన్నారు. అంతటితో ఆగకుండా తన తల్లిదండ్రుల వ్యవసాయ భూమిలో భాగం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం తమకు కుమార్తె(10), కుమారుడు(05) ఉన్నారన్నారు. తన భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలతో తన తల్లిగారింటి వద్ద ఉండడంతో తనపై పిల్లల కిడ్నాప్ కేసు పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న తనభర్త సీఐ కుంభం నర్సింహపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఐ నర్సింహను ఫోన్లో వివరణ కోరగా.. తన భార్యతో గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. విడాకుల కోసం తాను కోర్టును ఆశ్రయించానని, కేసు కోర్టులో ఉండడంతో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానన్నారు. -
వివాహాల గూఢచారి...భావనా పాలివాల్
గతంలో పెళ్లిళ్ల పేరయ్య ఏం చెప్తే అది. లేదా తెలిసిన వారి ఎంక్వయిరీతో సరి. ఇప్పుడు మాత్రం ఎవరినీ ఎవరూ నమ్మడం లేదు. ఏకంగా గూఢచారుల రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఈ కాలం పెళ్ళిళ్లలో అబ్బాయి, అమ్మాయిల కాండక్ట్‌ను కనిపెట్టి చెబుతున్న ‘మ్యారేజ్ డిటెక్టివ్’లు పెరిగారు. ఢిల్లీకి చెందిన భావనా పాలివాల్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? పెళ్లిళ్ల పరిశోధన ఎందుకు అవసరమని చెబుతోంది?పెళ్లి అనగానే ఖర్చులు రాసుకోవడం మొదలెడతారు ఇటు పక్షం వాళ్లు, అటు పక్షం వాళ్లు. కల్యాణ మంటపం, బట్టలు, నగలు, భోజనాలు... ఇప్పుడు మరో ఖర్చు కూడా చేరుతోంది. డిటెక్టివ్ ఖర్చు. ప్రేమ పెళ్ళిళ్లయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లయినా ‘సరిగ్గా ఆచూకీ తీసి’ పెళ్లి చేయాలనే నిర్ణయం ఎక్కువ కుటుంబాలలో కనిపిస్తోంది. మెట్రో నగరాలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో. అందుకే 48 ఏళ్ల భావనా పాలివాల్ నిత్యం బిజీగా ఉంటోంది. ఈమెకు ఢిల్లీలో ‘తేజాస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ ఉంది. ఈమెకు రోజుకు 4 కేసులు వస్తాయి– డిటెక్టివ్ పని చేసి పెట్టమని. కావాల్సిన వివరాలను బట్టి 50 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీసు తీసుకుంటుందామె.నమ్మకం కోసం:‘ఊర్లలో పెళ్లిళ్ల పేరయ్యల, ఉమ్మడిగా తెలిసిన బంధువులో మిత్రులో చెప్పే మాటల వల్ల పెళ్ళిళ్లు ఖరారు అయ్యేవి. నగరంలో వివిధ మెట్రిమోనియల్ ఏజెన్సీల ద్వారా సంబంధాలు కలుపుకుంటున్నారు. లేదంటే సోషల్ మీడియా పరిచయాలు పెళ్ళిళ్ల వరకూ వెళుతున్నాయి. అయితే ఎవరు ఎలాంటివారో తెలిసేది ఎలా అందుకే మమ్మల్ని సంప్రదిస్తున్నారు’ అంటుంది భావనా పాలివాల్. ఢిల్లీలో ఈమెలాంటి వారు– మెట్రిమోనియల్ డిటెక్టివ్స్ లేదా వెడ్డింగ్ డిటెక్టివ్స్ ఐదారుగురు ఉన్నారు. ‘జీతం ఎంత, వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నాయా, అబద్ధాలు ఏమైనా చెబుతున్నారా’ అనేది వీళ్లు కనిపెట్టి చె΄్పాలి.పెళ్లికి ముందు జాగ్రత్త‘పెళ్లికి ముందు సరిగ్గా కనుక్కుంటే పెళ్లి తర్వాత సరిగ్గా కనుక్కోలేదే అనే బాధ ఉండదు. ఈ మధ్య వచ్చిన అమెరికా సంబంధంలో వరుడు సంవత్సరానికి 70వేల డాలర్లు సంపాదిస్తున్నానని చె΄్పాడు. మా ఎంక్వయిరీలో పావు వంతు కూడ లేదని తేలింది. సంబంధం కేన్సిల్ చేశాం. మరో కేసులో కూతురు ప్రేమించిన కుర్రవాడి మీద నిఘా పెట్టి రిపోర్ట్ ఇవ్వమని కూతురి తల్లి ఫీజు చెల్లించింది. దానికి కారణం ఆమె పెళ్లి విఫలమైంది. కూతురిది కూడా కాకూడదనే. ప్రేమ పెళ్లికి సమ్మతమే అయినా కుర్రాణ్ణి అన్ని విధాలుగా తెలుసుకునే ‘ఎస్’ అనాలని ఆ తల్లి ప్రయత్నం. మేం దానికి సహకరించాం’ అందామె. మరికొందరైతే కుర్రాడు హోమో సెక్సువల్ అవునా కాదా తేల్చి చెప్పమని అడుగుతారట. ‘అబ్బాయి హోమో సెక్సువల్ అయ్యి పెళ్లి వద్దు మొర్రో అంటున్నా సంఘం కోసం తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇలాంటి ఎంక్వయిరీలూ వస్తున్నాయి’ అని తెలిపింది భావన. గతంలో జర్నలిస్టుగా పని చేసిన భావన ఆ వృత్తిలో సంతృప్తి దొరక్క ఇలా డిటెక్టివ్‌గా మారానని అంటోంది.ఆధునిక పరికరాలుప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీలకు చట్టపరమైన అనుమతి ఉంది. కాబట్టి వారు పని చేయవచ్చు. అయితే అనైతిక పద్ధతుల్లో పరిశోధన చేయకూడదు. అదీగాకప్రాణాపాయ ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డిటెక్టివ్లు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు. కెమెరాలు, జిపిఎస్ ట్రాకర్లు, సూక్ష్మమైన మైక్‌లు... ఇవన్నీ నిజమేమిటో అబద్ధమేమిటో చెబుతాయి. ‘వధువరుల వయసు, చదువు, ఆస్తిపాస్తులు, గతంలో విఫల ప్రేమలు, ఎంగేజ్మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన సంబంధాలు, రెండో పెళ్లి... ఈ వివరాల్లో వీలున్నంత వరకూ తెలియచేసి పెళ్లికి వెళ్లాలి. లేకపోతే వాటిలోని అబద్ధాలు పెళ్లయ్యాక మెడకు చుట్టుకుంటాయి’ అంటుంది భావన.పెళ్లికి సిద్ధమయ్యి...అన్నింటికి మించి ఈ స్థితికి వధువరుల ఆమోదయోగ్యమైన సంసిద్ధత లేకపోవడమే గొడవలకు ముఖ్యకారణం అంటారు మానసిక నిపుణులు. ‘పెళ్లి వ్యవస్థను విశ్వసించి దానిలో అవసరమైన కమింట్మెంట్, సహనం, అడ్జస్ట్మెంట్, నిజాయితీ... వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో పరిణితి వచ్చాకే పెళ్లికి ఎస్ అనాలి వధూవరులు. లేకుంటే పెళ్లయిన వెంటనే గొడవలు మొదలవుతాయి. డిటెక్టివ్లు వాస్తవాలు తెలియచేస్తారు. కాని పెళ్లి నిలబడేది ప్రేమ, నమ్మకాల వల్లే. వాటిని తమలో బేరీజు వేసుకుని పెళ్లికి సంసిద్ధం కావాలి’ అని తెలియచేస్తున్నారు వారు. లేకపోతే భావన వంటి వారికి పని పెరుగుతూనే ఉంటుంది. -
కల నిజమైంది
హీరో విశాల్ దర్శకుడిగా మారారు. 2017లో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘తుప్పరివాలన్ ’ (తెలుగులో ‘డిటెక్టివ్’). మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్ 2’ను ప్లాన్ చేశారు విశాల్. అయితే కొంతకాలం క్రితం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. దీంతో ‘డిటెక్టివ్ 2’ కోసం విశాల్ దర్శకుడిగా మారారు. ‘‘డైరెక్టర్ కావాలన్న నా కల నిజమైంది. నా దర్శకత్వంలో రానున్న తొలి సినిమా ‘తుప్పరివాలన్ 2’. ఈ సినిమా కోసం లండన్ వెళ్తున్నాను. అజర్బైజాన్ , మల్తా లొకేషన్స్ లో చిత్రీకరణ జరగుతుంది. నా కలను నాకు మరింత చేరువ చేసిన మిస్కిన్ గారికి ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు విశాల్. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఏప్రిల్ 26న విడుదల కానుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. -
Shruti Haasan: డిటెక్టివ్ అను
ఇంగ్లిష్ మూవీ ‘చెన్నై స్టోరీ’ కోసం డిటెక్టివ్‌గా అనుగా మారనున్నారు శ్రుతీహాసన్. ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా దర్శకుడు, ‘బాఫ్తా’ అవార్డు విజేత ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే తమిళ మహిళ కథే ఈ చిత్రం. కనిపించకుండా ΄ోయిన తన తండ్రిని కనుగొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి (బ్రిటిష్ నటుడు వివేక్ కల్రా) వేల్స్ నుంచి చెన్నైలో అడుగుపెట్టి, డిటెక్టివ్ అను సహాయం కోరడం, ఆ తర్వాత అను ఏం చేసింది? అనేది కథాంశం. ప్రధానంగా ఇంగ్లిష్, కొంచెం తమిళ్, వేల్స్ భాషలతో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సాగుతుంది. కాగా, ఇండో–యూకే ్ర΄÷డక్షన్ నిర్మించనున్న ఈ చిత్రానికి యూకేకి చెందిన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ చేయనుంది. ‘‘చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రుతీహాసన్. కాగా ఈ సినిమాని సమంత చేయాల్సింది. కానీ కొన్నాళ్లు ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వడంవల్ల ఈ చాన్స్ శ్రుతీహాసన్‌కి దక్కింది. -
డిటెక్టివ్ తీక్షణ
‘రణరణమున రథము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి..’’ అంటూ సాగుతుంది ‘డిటెక్టివ్ తీక్షణ’ చిత్రంలోని ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ పాట. చిత్ర సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ రాసిన ఈ పాటను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య పాడారు. ప్రియాంకా ఉపేంద్ర టైటిల్ రోల్లో ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం .బి కోయురు నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఒరియా భాషల్లో రిలీజ్ కానుంది. -
ఆ దెబ్బ ఇప్పటికీ మరిచిపోలేను.. డైరెక్టర్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో విశాల్, సూర్య.. ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశాల్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరో ఆయనకు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. (ఇది చదవండి: ఓటీటీలో సినిమాల సందడి.. భోళాశంకర్, రామబాణం కూడా!) విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘తుప్పరివాలన్’. 2017లో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని డిటెక్టివ్ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్‌పై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన మూలంగా తాను ఎంతో ఇబ్బందిపడినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆయనతో మరోసారి పనిచేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. మిస్కిన్ పెట్టిన బాధకు నేను కాకుండా.. వేరే వాళ్లు అయితే ఇప్పటికే చనిపోయేవారంటూ విశాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాల్ మాట్లాడుతూ..' మిస్కిన్‌తో మరోసారి సినిమా చేయడం జరగని పని. తుప్పరివాలన్ -2 విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డా. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే కచ్చితంగా గుండెపోటుతో చనిపోయేవారు. నేను కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకున్నా. ఒకవేళ మిస్కిన్‌తో ‘తుప్పరివాలన్ 2’ షూట్ చేసినా అది పూర్తి కాదని తెలుసు. అందుకే ఆ మూవీని ఆపేశా. వచ్చే ఏడాదిలో స్వయంగా నేనే తెరకెక్కించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ నాకు బిడ్డ లాంటిది.' అంటూ ఫైరయ్యారు. (ఇది చదవండి: 14 ఏళ్లకే పెళ్లి.. ఆపై వేధింపులు.. అర్ధాంతరంగా ముగిసిన నటి జీవితం!) 2017లో తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజైన ఈ చిత్రం కోలీవుడ్, టాలీవుడ్లో హిట్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించాలనుకున్నారు. కానీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ స్వయంగానే ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. -
అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు?
అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్‌కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్ చేసి తన భార్య బోట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!) జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్–వే టికెట్ మాత్రమే బుక్ చేశాడు. -
Brain Gym: మీరే డిటెక్టివ్ అయితే.. ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి!
ఒక క్రిమినల్ ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేశాడు. వారి ముందు మూడు వాటర్ గ్లాస్లు పెట్టాడు. ఒక్కొక్కరికి రెండు పిల్స్ ఇచ్చాడు. ‘మీకు ఇచ్చిన పిల్స్‌లో ఒకటి విషం ఉన్నది. రెండోది విషం లేనిది. అందులో ఒకటి నోట్లో వేసుకొని గ్లాస్లో నీళ్లు తాగండి. మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి’ అని హుకుం జారీ చేశాడు. మొదటి వ్యక్తి రెండిట్లో ఒకటి వేసుకొని, గ్లాస్లో నీళ్లు తాగాడు. చనిపోయాడు. రెండో వ్యక్తి రెండిట్లో ఒకటి నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. చనిపోయాడు. మూడో వ్యక్తి బా...గా ఆలోచించి ఒకటి సెలెక్ట్ చేసుకొని, నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. అతడు కూడా చనిపోయాడు. రెండు పిల్స్‌లో ఒకటి మాత్రమే విషపూరితమైనప్పుడు ఒక్కరికైనా బతికే అదృష్టం ఎందుకు లేకుండా పోయింది? అసలు విషయం: నిజానికి అందులో ఒకటి కూడా పాయిజన్ పిల్ లేదు. వారికి ఇచ్చిన వాటర్గ్లాస్లలోనే పాయిజన్ ఉంది! చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
దొంగలు దోచుకున్నారని ఫిర్యాదు.. దొంగతనం జరగలేదన్న ఎస్సై.. ఎలా?
భార్గవ అనే వ్యక్తి పోలిస్‌స్టేషన్‌కు వచ్చి తన ఇంట్లో దాచిన బంగారు నగలను దొంగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు కోసం పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. కిటికీ పగలగొట్టబడి ఉంది. ఇంటి ఆవరణ మొత్తం పరిశీలించిన తరువాత... ‘ఇంట్లో దొంగతనం జరగలేదు. భార్గవ అబద్ధం చెప్పాడు’ అని ప్రకటించాడు ఇన్స్పెక్టర్. ఏ ఆధారంతో అలా చెప్పాడో ఊహించగలరా? మీరు సరిగ్గా ఊహించారో, లేదో తెలుసుకోవాలంటే.. ఫొటో కింద జవాబు చూసేయండి. జవాబు: దొంగలు బయటి నుంచి కిటికీ అద్దం పగలగొట్టితే, అద్దం ముక్కలు ఇంట్లో పడాలి. కాని ఆ ముక్కలు బయటపడి ఉన్నాయి. అంటే భార్గవే... ఇంట్లో నుంచి అద్దాలు పగలగొట్టాడు! -
డిటెక్టివ్ సత్యభామగా హీరోయిన్ సోనియా అగర్వాల్
Sonia Aggarwal Detective Sathyabhama All Set To Release: సోనియా అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమాని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్, పాటలను విడుదల చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో నవనీత్ చారి మాట్లాడుతూ ‘‘ఎవరూ ఊహించని మలుపులు, ఆశ్చర్యకర విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘దాదాపు 500 థియేటర్స్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు శ్రీశైలం పోలెమాని. -
నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!
కొన్ని నేరాలు చూస్తే మనుషులేనే ఇంత ఘోరానికి పాల్పడుతున్నది? అని ఆశ్యర్యంగా అనిపించక మానదు. కోపంతోనే లేక పగ, ద్వేషంతో క్షణికమైన ఆవేశంలో చేసిని నేరాలు గురించి విని ఉంటాం. కొన్ని నేరాలు వినడానికి హాస్యస్పదంగానూ, నమ్మశక్యంగానీ విధంగా ఉంటాయి. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక వ్యక్తి ఒక వింత నమ్మకంతో 70 ఏళ్ల వృద్ధుడిని చంపేశాడు. (చదవండి: ఉత్తర కొరియాలో 11 రోజుల పాటు నవ్వకూడదట!!) అమెరికాలోని ఇడాహోకు చెందిన 39 ఏళ్ల జేమ్స్ డేవిడ్ రస్సెల్ నరమాంస భక్షణ వల్ల తన మెదడు నయం అవుతుందని నమ్మకంతో డేవిడ్ ప్లాగెట్ అనే 70 ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. అంతేకాదు ఇడాహోలో నరమాంస భక్షణకు సంబంధించిన తొలి కేసుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు బోన్నర్ కౌంటీ డిటెక్టివ్ ఫిలిప్ స్టెల్లా మాట్లాడుతూ..మొదటగా పోలీసులు రస్సెల్ ఇంటికి వెళ్లినప్పడు అతను మాతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు రస్సెల్ ఇంటి వెలుపల ఉన్న వాహనంలో ఫ్లాగెట్ అవశేషాలను కనుగొన్నాం. ఇది నా వ్యక్తిగతం నా కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు జోక్యం చేసుకోవడం ఇష్టం లేదంటూ రస్సెల్ మాపై అరిచాడు. ఈమేరకు మేము ఇల్లంతా వెతకగా రక్తంతో తడిసిన మైక్రోవేవ్, గాజు గిన్నె, డఫెల్ బ్యాగ్, కత్తిని గుర్తించాం. అంతేకాదు రస్సెల్ మానసిక స్థితి ఎలా ఉందంటే శరీర భాగాలను కోయడం ద్వారా తనను తాను స్వస్థత పరుచుకున్నట్లు భావించాడు. అంతేకాదు ఫ్లాగెట్‌కి రస్సెల్‌కి మధ్య చిన్న చిన్నవిభేదాలు కూడా ఉన్నాయి. రస్సల్ నుంచి తమకు లేదా బయటవాళ్లకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం కూడా రస్సెల్ కుటుంబ సభ్యులకు తెలుసు" అని అన్నారు. ఈ మేరకు రస్సెల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ 70 ఏళ్ల వృద్ధిడికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెప్పారు. పైగా రస్సెల్ బాధితుడు భాగాలు కూడా తిన్నాడని అన్నారు. అంతేకాదు ఇది అత్యంత క్రూరమైన నేరం మాత్రమే కాదు సైకలాజికల్ సమస్యతో చేసిన అ్యతంత పాశవికమైన నేరంగా అధికారులు పరిగణించారు. ఈ కేసు నిమిత్తం ఈ నెల 28న రస్సెల్‌ని పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలి!...అని పిటిషన్ దాఖలు చేసినందుకు రూ లక్ష జరిమానా!!) -
ఆస్ట్రేలియాలో కిడ్నాప్‌కు గురైన 4 ఏళ్ల చిన్నారి.. 18 రోజుల పాటు గాలింపు
-
18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు
సిడ్ని: ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్‌ని చూసి ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు, డిటెక్టివ్లు, చుట్టుపక్కల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. చిన్నారిని చూసి వారికి కన్నీళ్లు ఆగలేదు. కాకపోతే అవి ఆనందబాష్పాలు. ఎందుకంటే 18 రోజుల కిత్ర కిడ్నాప్‌కు గురైన క్లియో స్మిత్(4).. క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఇన్ని రోజులు క్లియో కోసం కన్నీరుమున్నిరుగా విలపించిన వారంతా ఇప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారు. క్లియో కిడ్నాప్ వ్యవహారానికి వస్తే.. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో.. సుమారు 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్కు వెళ్లింది. రాత్రి తన టెంట్లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్ చేశాడు. ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా.. ) క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు. కేసు సీరియస్‌గా మారడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకున్నారు. క్లియో పిక్నిక్ వెళ్లిన ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు. చివరకు డిటెక్టివ్‌ల సాయం తీసుకున్నారు. అయితే క్లియో ప్రాణాలతో ఉంటుందని ఎవరికి నమ్మకం లేదు. దుర్వార్తే వినాల్సి వస్తుందని భావించారు. (చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ?) ఈ క్రమంలో సుమారు 18 రోజుల తర్వాత క్లియోని కిడ్నాప్ చేసిన వ్యక్తి గురించి.. అతడి స్థావరం గురించి పోలీసులుకు సమాచారం తెలిసింది. ఎంతో చాకచక్యంగా నిందితుడు ఉండే ప్రాంతాన్ని చుట్టుమట్టారు పోలీసులు. అతడి నివాసంలోకి వెళ్లారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో. ఒక్కనిమిషం పాటు అధికారులకు నోటమాట రాలేదు. చిన్నారిని తట్టి.. ‘‘నీ పేరేంటని ప్రశ్నించగా.. నా పేరు క్లియో’’ అని చెప్పింది. వెంటనే హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. 18 రోజుల పాటు కిడ్నాపర్ చెరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్దవారే ఎంతో భయపడతారు. (చదవండి: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్) కానీ చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసి వారు ఒక్కసారిగా ఏడ్చేశారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక క్లియో క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. చదవండి: 22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ The moment Cleo was rescued 👏 pic.twitter.com/arusYi9kCa — WA Police Force (@WA_Police) November 3, 2021 -
Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?
Fact Check: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్ గోయేంకా తప్పులో కాలేశారు. సరైన సమచారం లేకుండా వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇంతలో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం నిజాలు వెల్లడించింది. షెర్లాక్ హోమ్స్ కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఓ పాడుబడ్డ భవనం. ఆ బిల్డింగ్ ద్వారాలకు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ , సీఐడీ వెస్ట్‌బెంగాల్ అన్న బోర్డు. దాని కింద నుంచి నడుముకు టవల్ చుట్టుకుని చేతిలో బకెట్‌తో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి. పైన బోర్డుకు కింద కనిపిస్తున్న మనిషికి మధ్య పొంతనే లేదు. ఈ ఫోటోను ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హార్ష్గోయెంక ట్వీట్ చేశారు. ‘షెర్లాక్‌హోమ్స్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ హిజ్ బేకర్ స్ట్రీట్ ఆఫీస్ ఇన్ కోల్‌కతా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. Sherlock Holmes stepping out of his Baker Street office in Kolkata! 😀😀😀 pic.twitter.com/wVSNFYICYA — Harsh Goenka (@hvgoenka) September 21, 2021 మారువేశంలో హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. డిటెక్టివ్ మారు వేశంలో ఉన్నాడంటూ చాలా మంది వ్యంగంగా స్పందించగా మరికొందరు డిటెక్టివ్లు ఆఫీసుల కూర్చుని ఉండిపోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని ఇలా చేశారంటూ చమత్కరించారు. కానీ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు చేశారు. వాస్తవం ఇది బ్రిటిష్ కాలంలోనే 1886లోనే కోల్‌కతాలో ఓ బ్రిటీష్ అధికారి హత్యకు గురైతే తొలిసారిగా డిటెక్టివ్ కార్యాలయం నెలకొల్పారు. వందల ఏళ్ల నుంచి ఈ నగరంలో డిటెక్టివ్ డిపార్ట్మెంట్ పని చేస్తోంది. నగరంలోని పీల్ఖానాలో డిటెక్టివ్ భవనం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో 2016లో ఆ భవనం ఖాళీ చేశారు. భవనీ నగర్‌లోని సీఐడీ కార్యాలయంలోకి డిటెక్టివ్ ఆఫీస్‌ని మార్చారు. అయితే పాత ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరీ షెర్లాక్‌హోమ్స్ ఇంగ్లండ్ రచయిత విలియం షేక్స్పియిర్ గొప్ప రచనలు ఎన్నో చేశారు. అందులో డిటెక్టివ్ ప్రధాన పాత్రగా షెర్లాక్ హోమ్స్ అనే నాటకం రచించారు. దీంతో సీక్రెట్ ఏజెంట్ అంటే జేమ్స్‌బాండ్ పాత్ర గుర్తొచ్చినట్టు ప్రపంచ వ్యాప్తంగా డిటెక్టివ్ అంటే షెర్లాక్‌హోమ్స్ గుర్తుకురావడం పరిపాటిగా మారింది. చదవండి : కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా ! -
డిటెక్టివ్ రాబోతున్నాడు
మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుప్పరివాలన్’. తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదలయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ మొత్తాన్ని విదేశాల్లోనే పూర్తి చేయాలని ప్లాన్. సినిమా షూటింగ్ మధ్యలో మనస్పర్థలతో దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో మిగతా సినిమాకు దర్శకత్వ బాధ్యతలను విశాల్ తీసుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం కూడా చేస్తున్నారు విశాల్. ఇటీవల విశాల్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్ స్నేహితుడిగా ప్రసన్న కనిస్తారు. -
త్రిపాత్రాభినయం చేయబోతున్నా
హీరో విశాల్– దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పారివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) అనే చిత్రం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. మిస్కి దర్శకత్వంలోనే విశాల్ హీరోగా నటిస్తూ, ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు మిస్కిన్. దాంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు విశాల్. ‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుట్నుంచో ఉంది. కానీ ఇలా వస్తుందని ఊహించలేదు. ఇది మారువేషంలో వచ్చిన అదృష్టంలా భావిస్తున్నాను. సినిమా మేకింగ్‌లో అన్ని బాధ్యతలు దర్శకుడి మీదే ఉంటాయి. డైరెక్షన్ చేయడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు త్రిపాత్రాభినయం (నటన–నిర్మాణం– దర్శకత్వం) చేయబోతున్నాను’’ అన్నారు విశాల్. -
షిర్లాక్‌హోమ్స్
ఢిల్లీ.. ఒక రోజు సాయంకాలం. ఇండియా గేట్ దగ్గరి గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఏదో సీరియస్‌గా డిస్కస్ చేసుకుంటోంది ఓ యువ జంట. కాసేటికి సన్నగా పొడుగ్గా... నూనుగు మీసాలు, తల మీద క్యాప్, ఒక చేతి వేళ్ల మధ్య వేడి వేడి వేరుశనక్కాయల పొట్లాలు, ఇంకో చేతిలో చాయ్ ఫ్లాస్క్‌తో ‘చాయ్.. మూంగ్‌ఫలీ.. ఆ చాయ్.. ఎ మూంగ్ఫల్లే..’ అంటూ ఆ జంట ముందుకు వచ్చింది ఆ ఆకారం. పట్టించుకోనంత తీవ్రమైన చర్చలో ఉన్నారు ఆ ఇద్దరూ. కాసేపు ఆ బెంచి వెనకాలే తచ్చాడి మళ్లీ ‘ఆ చాయ్ భాయ్.. చాయ్.. దీదీ.. మూంగ్‌ఫలీ..’ అంటూ వాళ్ల ముందు మళ్లీ ప్రత్యక్షమైంది ఆ చాయ్‌వాలా ఆకారం. ‘అరే.. వద్దు భాయ్.. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనీ..’ అంటూ చిరాకు పడ్డాడు జంటలోని అతను. ‘క్యా పరేషానీ హై భాయ్ ఆప్కో.. ’ అడిగింది ఆ ఆకారం కాస్త వంగి అతని ముఖంలోకి ముఖం పెడుతూ. ‘ఛల్ హఠ్..’ అని కోపగించుకుంటూ విసురుగా బెంచీ మీద నుంచి లేచి... ఆ అమ్మాయి చెయ్యి అందుకొని అక్కడి నుంచి విసావిసా వెళ్లిపోయాడు అతను ఆ అమ్మాయితో. వాళ్లు వెళ్తున్నవైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని బెంచి మీద ఫ్లాస్క్‌ను పెట్టి, పైజామా జేబులోంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి... ‘ఆప్ సహీ హై మామ్’అని చెప్పి పెట్టేసింది ఆ ఆకారం. ఆ చాయ్‌వాలా.. సారీ.. చాయ్వాలీ.. ఓ ప్రైవేట్ డిటెక్టివ్. పేరు ఆకృతి ఖత్రి. వయసు ముప్పైఐదు లోపే. అందుకే దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళా డిటెక్టివ్ అనే పేరు తెచ్చుకుంది. అయిదేళ్ల కిందట ఢిల్లీలో ‘వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ’ని ప్రారంభించింది. అపరాధ పరిశోధనలో అగ్రగణ్యుడు షెర్లాక్‌హోమ్స్ బాటను ఎంచుకున్న ఈ ఇండియన్ షిర్లాక్‌హోమ్స్ దేశరాజధానిలోనే పుట్టిపెరిగింది. బీఎస్సీ (సైన్స్) గ్యాడ్యూయేట్, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పోస్ట్‌గ్రాడ్యూయేట్ అయిన ఆకృతి ఈ ఫీల్డ్‌లోకి రావడం చాలా ఆసక్తికరం. ఎలాగంటే... ఏంబీఏలో ఉన్నప్పుడు పేపర్లో డిటెక్టివ్ ఉద్యోగ ప్రకటన చూసి సరదాగా దరఖాస్తు చేసింది ఆకృతి. సీరియస్‌గానే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ అయిపోయాక తర్వాత కాల్ చేస్తామని చెప్పి పంపించేశారు ఆమెను. ఎప్పుడో చూసిన ఒకట్రెండు డిటెక్టివ్ సినిమాలు తప్ప... అసలా వృత్తి ఎలా ఉంటుందో తెలియదు. అలాంటిది ఇంటర్వ్యూ బాగానే అటెండ్ చేశానని మనసులో తనకు తానే కితాబు ఇచ్చుకున్నంతసేపు పట్టలేదు వాళ్ల జవాబుతో నిరాశపడ్డానికి. ఇక అప్పటినుంచి వరసబెట్టి వార్తా పత్రికల్లో వాంటెడ్ కాలమ్ చూడ్డం మొదలుపెట్టింది. ఇంకొన్ని డిటెక్టివ్ ఏజన్సీలకూ అప్లయ్ చేసుకుంది. రెండో ఇంటర్వూ్యలో ‘రేపు వచ్చి కలవండి’అని చెప్పి పంపేశారు. కాళ్లీడ్చుకుంటూ ఇంటికొచ్చిందో లేదో మొదటి ఇంటర్వ్యూ తాలూకు ఏజెన్సీ నుంచి ఫోన్ కాల్... ఉన్నపళంగా ఆఫీస్కొచ్చి కలవమని. అంతే పెంచిన టూ వీలర్ యాక్సలేటర్‌ను ఢిల్లీ ఆ మూలన ఉన్న ఆ ఆఫీస్ దగ్గరే ఆపేసింది. అంత ఉత్సాహం ఆమెలో. ‘తను పెళ్లిచేసుకోబోయే వరుడి ప్రవర్తన గురించి ఆరా తీయమని ఓ అమ్మాయి ఒక అసైన్మెంట్ ఇచ్చింది. నువ్వు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తావో చెక్ లిస్ట్ రాసివ్వు’ అడిగాడు బాస్ ఆమె రావడంతోనే. అయిదు నిమిషాల్లో రాసిచ్చింది. మొహంలో మెరిసిన చిరునవ్వును ఆమెకు కనిపించనివ్వకుండా ‘ఓకే... ఈ రోజు నుంచి నీ ఇంటర్న్‌షిప్ మొదలు’ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు బాస్. పిడికిలి బిగించి ‘యెస్’ అంది ఆమె సంతోషం. మొదట్లో ఖాళీగానే... అయితే నెల రోజులు ఖాళీగానే కూర్చోబెట్టారు. విసుగుపుట్టిన ఆమె ఒకరోజు కోపంగా బాస్ క్యాబిన్లోకి వెళ్లి.. ‘ఏ పనీ లేకుండా ఇలా రికామీగా కూర్చోనే ఉద్యోగం నేను చేయలేను. ఇంత ఖాళీగా మా ఇంట్లో కూర్చున్నా దోమలనైనా చంపుకునేదాన్ని’ అంది. ‘నువ్వు ఖాళీగా ఏం లేవు. పరీక్షలో ఉన్నావ్. నీ సహనాన్ని టెస్ట్ చేస్తున్నాం’ చెప్పాడు బాస్ కూల్‌గా. ఆకృతి ఇంకోమాట మాట్లాడకుండానే వెంటనే అసైన్మెంట్ ఇచ్చాడు బాస్. జుట్టును క్యాప్‌లో దాచి.. మాసిపోయిన పైజామా.. వెలిసిపోయిన టీషర్ట్ వేసుకొని.. నూనుగు మీసాలు అతికించుకొని ఇండియా గేట్ దగ్గర చాయ్‌వాలా వేషం వేసి ఓ జంట డీప్ డిస్కషన్‌ను డిస్టర్బ్ చేసిందే... అదే తన తొలి అసైన్మెంట్. అప్పగించిన రెండు రోజుల్లోనే వరుడు మోసగాడు అని తేల్చి వివరాల కవరును అమ్మాయి చేతిలో పెట్టేసింది. వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ మొదటి కేస్‌లోనే విజయం సాధించిన ఆకృతి... ఒకవైపు ఏంబీఏ చేస్తూనే ఇంకో వైపు ఈ ఉద్యోగంలో బిజీ అయిపోయింది. చదువు అయిపోయేనాటికి ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్‌లో ఓ మోస్తరు పేరూ సంపాదించుకుంది. కేవలం పెళ్లి సంబంధాలు, వివాహ బంధాల అంశాల్లోనే కాక కార్పొరెట్ ఇష్యూస్ అయిన బ్రాండ్ కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ నుంచి హానీ ట్రాప్, లేబర్ కోర్ట్కేసులు, మోసం, భూ తగాదాలు వంటి విషయాల్లో కూడా పరిశోధన చేసి విజయవంతం అయింది. ఈ క్రమంలోనే తన బాస్‌తో కొంచెం మాటపట్టింపు వచ్చి ఆ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చేసింది. 2014లో వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ పేరుతో సొంతంగా ఏజెన్సీని స్థాపించింది. మొదట్లో తన టాస్క్‌ను ఢిల్లీ వరకే పరిమితం చేసుకున్నా తర్వాతర్వాత ముంబై, పుణె, చండీగఢ్, జైపూర్‌లతోపాటు హైదరాబాద్‌లోనూ తన పరిశోధనా సేవలను అందిస్తోంది... కొందరు ఫ్రీలాన్సర్స్‌ను నియమించి. తన ఏజెన్సీలో 75 మంది వరకు ఉద్యోగులున్నారు. వీళ్లలో మహిళలే ఎక్కువ. ఇదీ ఓ పనేనా? ‘మన దగ్గర లేడీ డిటెక్టివ్లు ఎక్కువగా లేరు. మామూలుగానే స్కూళ్లకు, కాలేజ్‌లకు, ఆఫీస్‌లకు వెళ్లిన ఆమ్మాయిలు సురక్షితంగా ఇళ్లకు తిరిగొచ్చే పరిస్థితి లేదు. అలాంటిది చాలా రిస్క్, ఎంతో ప్రమాదంతో కూడిన ఇలాంటి ఫీల్డ్‌లోకి అమ్మాయిలను పంపేందుకు ఏ తల్లిదండ్రులు ఇష్టపడ్తారు? అయినా నాలాంటి వాళ్లు ఉత్సాహపడ్తూనే ఉంటారు జీవితంలో ఏదో సాహసం చేయాలని (నవ్వుతూ). అలాంటి వాళ్లకు ఒకటే సలహా... ముందు మీ చదువు పూర్తి చేసుకోండి. తర్వాతే ఈ ఫీల్డ్‌లోకి రండి. దీనికి కావల్సిన అర్హత... సూక్షా్మన్ని గ్రహించడం, ఆత్మవిశ్వాసం. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడం. ఇదీ ఒక పనేనా అని వెక్కిరించేవాళ్లూ ఉంటారు. నవ్వుతూ మన పని మనం చేసుకుపోవడమే’ అంటుంది ఆకృతి ఖత్రి. -
ఏసీబీ వలలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్
హయత్‌నగర్: అవినీతి అధికారులపై ఏసీబీ వరుసగా దాడులు చేస్తున్నా వారు తమ వైఖరి మార్చుకోవడం లేదు. తాజాగా హయత్‌నగర్ పోలీస్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్(డీఐ)గా పనిచేస్తున్న జితేందర్‌రెడ్డి బంగారం దొంగతనం కేసులో నిందితులపై కేసు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేసేందుకు నిందితుల నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీలో ఓ మహిళ వ్యభిచార కేంద్రం నిర్వహించేది. ఆమెకు నగరానికి చెందిన నాగరాజు, హాలియాకు చెందిన నరేష్‌తో పరిచయం ఏర్పడింది. వారం క్రితం తన ఇంట్లో ఉన్న 3.5 తులాల బంగారు నగలు చోరీకి గురికావడంతో నరేష్, నాగరాజులపై అనుమానం వ్యక్తం చేస్తూ వారం రోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనుమానితులను స్టేషన్‌కు పిలిపించిన డీఐ జితేందర్‌రెడ్డి కేసు లేకుండా మహిళతో సెటిల్మెంట్ చేసేందుకు రూ.1.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం నరేష్ తన వాటాగా రూ. 55 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం నాగరాజుపై ఒత్తిడి తేవడంతో అతను ఈ విషయాన్ని తన బావ సాగర్ దృష్టికి తీసుకెళ్లాడు. సాగర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నాగరాజుకు రూ. 30 వేలు ఇచ్చి పంపారు. అతను డబ్బులను కవర్లో పెట్టి డీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించగా అతను వాటిని టేబుల్‌పై పెట్టాలని సూచించాడు. అనంతరం నగదును మరో కవర్లోకి మార్చి తీసుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు... తన చేతులతో డబ్బులను పట్టుకున్న జితేందర్‌రెడ్డి అనుమానంతో వేలిముద్రలు పడకుండా చేతులను కడుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. చేతులు కడుక్కుని తన హ్యాండ్ కర్చీప్‌తో తుడుచుకోడంతో వేలి ముద్రలు సేకరించలేకపోయామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, రఘునందన్, మాజిద్ అలీఖాన్ పాల్గొన్నారు. -
హంతకుడు ఎవరు?
ప్రముఖ రచయిత రాజశేఖరం హత్య వార్త ఆనాటి దినపత్రికలో చదివాడు ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్. దినపత్రిక టీ పాయ్మీద గిరాటు వేసి ఉన్నపళంగా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. హత్యా ప్రాంతం ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ చరణ్ తను కలిసి ఇదివరకు రెండు మూడు క్లిష్టమైన కేసులు పరిష్కరించారు. శ్రీకర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి వాకబు చేస్తూ.. ‘‘ఎవరైనా అనుమానస్తులున్నారా.. కూపీ లాగావా’’ అంటూ తనూ అదే చిరునవ్వు ప్రదర్శించాడు. ‘‘రాజశేఖర్ ముఖంపై దిండు బలంగా అదిమి ఊపిరాడకుండా చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది’’ అన్నాడు చరణ్.శ్రీకర్‌కు తాను సేకరించిన కొన్ని ఆధారాలు చూపించాడు.‘‘కాని ఇవి మార్ఫింగ్ ఫోటోలేమోనని నా అనుమానం. పైగా అవి పూర్తిగా నేరాన్ని రుజువు చేసేలా లేవు. అందుకే ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. పైగా ఫోటో తీశారూ అంటే మరో మనిషి ఆ గదిలో ఉన్నట్లేగా.. ఎవరో అతను తెలిస్తే గాని కేసు ముందుకు సాగదు’’ అని వివరిస్తూ..తన కెదురుగా నిలబడ్డ అనుమానితుడిని చూపించాడు. ‘‘ఇతను రాజశేఖరం వద్ద టైపిస్టుగా పనిచేసే కుమార్.. ఇంటరాగేషన్ చేస్తున్నాను’’అన్నాడు చరణ్.‘‘రాజశేఖరం గారిని ఎందుకు చంపావ్.. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేగా..’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్! నేను హత్య చేయలేదు సర్.. నేను రాజశేఖర్ గారి ముఖం మీద ఉన్న దిండును తీసి చూశానంతే’’ గజ, గజ వణకుతూ అన్నాడు కుమార్. ‘‘సార్.. నేనూ ఒక రచయితనే. ‘జయసుధ’ అనే కలం పేరుతో కథలు రాస్తున్నది నేనే అని చాలా మందికి తెలియదు. ప్రముఖ రచయిత రాజశేఖరం ఒక వేదికపై పరిచయమయ్యారు. వారన్నా.. వారి రచనలన్నా నాకు చాలా ఇష్టం. నా రచనా శైలి బాగుంటుందని తనకు సాయం చెయ్యమని కోరారు. వారు కథకు ప్లాట్ ఇస్తే నేను కథగా..స్క్రిప్ట్‌గా.. నవలగా డెవలప్ చేసే వాణ్ణి. ఇద్దరం చర్చించుకొని తుది నిర్ణయం తీసుకున్నాక రాజశేఖరం పర్సనల్ కంప్యూటర్లో టైప్ చేసి పదిలపరచే వాణ్ణి. వారి సహచర్యం వల్ల మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ నా రచనలను కూడా కొనసాగిస్తున్నాను. వారికి వచ్చే పారితోషికంలో కొంత నాకు ముట్ట చెప్పే వారు. అది నేనూహించినదాని కంటే ఎక్కువ మొత్తం. అలా వారి ఉప్పు తినే నేను వారికి ముప్పు తలపెడ్తానా.. సర్’’ అని వాపోయాడు కుమార్.‘‘కేవలం కథలవరకేనా.. లేక వారి కుటుంబ కథల్లో కూడా తలదూర్చే వాడివా’’ కాస్త వ్యంగ్యంగానే అడిగాడు శ్రీకర్. ‘‘నా కంత సాన్నిహిత్యం లేదు సార్.. నాకు తెలిసినంత వరకు వారికి పెద్ద కుటుంబం అంటూ ఏదీ లేదు. చుట్టాలు, పక్కాలు వచ్చిన జాడ కనబడేది కాదు. వారి సతీమణి పది సంవత్సరాల క్రితమే కాలం చేశారట. వారికి ఏకైక సంతానం విశాల్. తల్లి లేని పిల్లవాడు కదా అని కాస్త గారాబమెక్కువనుకుంటాను’’‘‘ఎందుకలా అనుకుంటున్నావ్’’ ‘‘విశాల్ చదివేది ఇంటర్ రెండవ సంవత్సరమే గాని డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తుంటాడని రాజశేఖరంగారు అప్పుడప్పుడు చెప్పే వారు’’ ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు’’‘‘వంట మనిషి రాములమ్మ. ఆమె భర్త రంగయ్య తోట పని చూసుకుంటూ ఉంటాడు’’ శ్రీకర్ మనసుకు ఎందుకో కుమార్ నిర్దోషని తోచింది. ఆ మరునాడు ఉదయమే తన ఫోన్లో మెసేజ్ చూసుకొని శ్రీకర్ ఆఫీసుకు వెళ్ళాడు కుమార్. ‘‘నీకు వివాహమయ్యిందా..’’ అడిగాడు శ్రీకర్.‘‘వివాహమయ్యింది సర్.. ఒక పాప గూడా.. ఉంది’’ ‘‘పాప వయసెంత.. బడికి వెళ్తుందా..’’‘‘లేదు సర్.. ఆరేళ్ళ ప్రాయం..’’ అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన శ్రీకర్ ‘‘చూడు కుమార్.. నావద్ద ఏదీ దాచిపెట్టొద్దు’’‘‘రహస్యమేమీ లేదు సార్..’’ నీళ్ళు నములసాగాడు. ‘‘మీ పాపకు గుండెలోని చిన్న రంధ్రం గురించి డాక్టర్లు ఏమన్నారు’’ అని శ్రీకర్ ప్రశ్నించే సరికి గతుక్కుమన్నాడు కుమార్.‘‘సార్.. ఆ విషయం చెబితే.. డబ్బు కోసం నేనే హత్య చేసానని మీకు అనుమానం వస్తుందని చెప్పాలా వద్దా.. అని సందేహించాను సర్. డాక్టర్లు మరి కొన్ని పరీక్షలు చేస్తే గాని చెప్పలేమన్నారు. నిజం దాచినందుకు క్షమించండి సర్.. ప్లీజ్’’ అని వేడుకున్నాడు కుమార్. ‘‘రాజశేఖరంగారు సినిమాలకు కూడా రాస్తుంటారు కదా.. ఆ రంగంలో ఎవరైనా పోటీదారులున్నారా..’’‘‘పోటీదారుల సంగతి తెలియదు గాని సార్.. కథలకు ఎంతో డిమాండు ఉన్నదన్న విషయం తెలుసు’’‘‘రాజశేఖరంగారు హత్య కాబడ్డ రోజు నువ్వు ఎక్కడున్నావు?’’ ‘‘సార్ గది పక్కనే నాకూ ఒక గది ఇచ్చారు. ఎవరైనా సార్‌తో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు నేను నా గదిలోకి వెళ్ళి కథలు పూర్తి చేస్తుంటాను.ఆ రోజు ఉదయమే వారి అబ్బాయి విశాల్ వచ్చాడు సర్. కాలేజీ మమ్మల్ని బొటానికల్ టూర్ కోసం బెంగళూరు తీసుకెళ్తుంది. అలాగే మైసూర్ కూడా విహార యాత్రకు వెళ్ళి వద్దామని అంటున్నారు.పదివేలు కావాలని అడిగి తీసుకున్నాడు.రాత్రి భోజనం తరువాత సరిచేసిన ఆ నాలుగు కథలను ప్రింటౌట్ తీసి తప్పులుంటే సరిచెయ్యండని సార్కిచ్చి.. నేను నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను.తెల్లవారుజామున లేచి ఫైనల్ ప్రింటౌట్ కాపీలు తీయాల్సి ఉంది. మధ్యరాత్రి నన్నెవరో పిలిచినట్లు వినిపించింది. లేచి గబగబా వెళ్లి సార్ గది తట్టాను. సాధారణంగా సార్ తలుపు గడియపెట్టుకోరు. గదిలోకి వెళ్లి చూస్తే సార్ ముఖంపై దిండు ఉంది. పక్కన టీపాయ్ పైన మేము తయారు చేసిన కథలు.. కంప్యూటరూ.. సార్ సెల్ ఫోన్ కనపడలేదు. నాకు అనుమానమేసి సార్ దిండును పైకి తీశాను. సార్ కనుగుడ్లు నిలబడి ఉన్నాయి. భయంతో రంగయ్యా! అంటూ గట్టిగా అరిచాను. ఎవరూ రాలేదు. భయమేసింది. లేని శక్తి కూడగట్టుకొని ఔట్హౌస్కు పరుగెత్తి,. తలుపుబాదాను. రంగయ్య తలుపు తీశాడు. విషయం చెప్పే సరికి రంగయ్య, రాములమ్మ ఇద్దరూ పరుగు పరుగున నా వెనకాలే వచ్చారు.ఉలుకూ.. పలుకూ.. లేని సార్‌ను చూసి ఏడ్వసాగారు. వెంటనే రాజశేఖరం ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాను. డాక్టరు వచ్చి సార్‌ను పరీక్షించాడు. చనిపోయి దాదాపు గంట కావస్తోందని.. పోలీసులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికి ఇన్స్పెక్టర్ చరణ్ గారు తన బృందంతో వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపారు. నిన్న ఉదయమే బాడీని నాకప్పగించారు’’ అని కుమార్ చెప్తుంటే ఆవేదన అడ్డుపడింది. ఆగిపోయి మౌనంగా రోదించసాగాడు. ‘‘నేను కాలేజీకి ఫోన్ చేసి విషయం చెప్పి విశాల్‌ను అర్జెంటుగా వెనక్కి పంపించమన్నాను. అసలు వారు ఎలాంటి విహారయాత్రలకూ పిల్లలను తీసుకెళ్ళలేదట’’ శ్రీకర్ భృకుటి ముడిపడింది. వెంటనే ఇద్దరూ కలిసి రాజశేఖరం ఇంటికి వెళ్ళారు. విశాల్ గది చూద్దామని లోనికి వెళ్తుంటే.. శ్రీకర్ సెల్ ఫోన్ మోగింది.. ఆన్ చేశాడు. ‘‘హల్లో చరణ్..’’ అన్నాడు శ్రీకర్. అందులో నేనుచెప్పిన విషయం ఏమయ్యింది? అనే అర్థం ప్రస్ఫుటమవుతోంది.‘‘నేనొక మొబైల్ నంబరిస్తాను.ఆ నంబరుకే రాజశేఖరం గత రెండు రోజులుగా పలుమార్లు మాట్లాడాడు. కాని ఆ నంబర్ ఎవరి పేరుమీద రిజిస్టర్ అయిందో.. వివరాలు లేవు’’ఇన్స్పెక్టర్ చరణ్ గొంతు అస్పష్టంగా కుమార్‌కు వినవస్తోంది. ‘‘ఈ నంబర్ ఎవరిదో తెలుసా’’ అంటూ కుమార్‌కు చూపిస్తూ అడిగాడు. ‘‘రచయిత సుందరం నంబర్. అప్పుడప్పుడు కథల విషయంలో ఇరువురు చర్చించుకునే వారు’’‘‘ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు.. పోటీదారులెవరూ తెలియదన్నావ్’’ అంటూ రెట్టించాడు శ్రీకర్. ‘‘ఇతనూ ఒక రచయితనే కదా అనుకున్నాను సర్’’‘‘మరి రచయితల్లోనే కదా.. పోటీ తత్వముండేది. ఏదైనా నా వద్ద దాచొద్దని చెప్పాను. సుందరం రచయిత అనే విషయం చెప్పలేదు. అంటే నిన్నూ అనుమానించక తప్పదు’’ గంభీరంగా అన్నాడు శ్రీకర్.దెబ్బకు ఠారెత్తి పోయాడు కుమార్. విశాల్ గదిలో కొన్ని రహస్యపు కాగితపు ముక్కలు దొరికాయి. వాటిని వాసన చూశాడు శ్రీకర్. ఏదో అనుమాన మేసింది.రాములమ్మను ఒంటరిగా మరో గదిలోకి పిలిచి విచారించాడు. తన అనుమానం నిజమయ్యింది. నిజనిర్థారణ కోసం తన అసిస్టెంట్ అనిల్‌కు ఫోన్ చేద్దామనుకునే సరికి అనిల్ ప్రత్యక్షమయ్యాడు ‘‘సార్.. మీ అనుమానం నిజమే. నేను కాలేజీకి వెళ్ళి విశాల్ గురించి వాకబు చేశాను. విహార యాత్ర అబద్ధం.. విశాల్ అలా అబద్ధాలాడుతూ తన తండ్రి దగ్గర డబ్బు పట్టిస్తాడని.. అ డబ్బుతో మాదక ద్రవ్యాలు కొంటాడని అతని స్నేహితులు కొందరు చెప్పారు. అతని మొబైల్ సిగ్నల్స్..శంషాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుపుతోంది.అదే ప్రాంతంలో సుందరం ఫామ్‌హౌస్ ఉంది’’ అన్నాడు అనీల్.‘‘కమాన్ క్విక్..’’ అంటూ వేగంగా కారు వైపు కదిలాడు శ్రీకర్. ‘‘భేష్.. ఇప్పటికైనా అక్కరకొచ్చే ఒక ఇన్ఫర్మేషనిచ్చావ్’’ అనిల్ పరుగెత్తి కారు డ్రైవ్ చేద్దామని సీట్లో కూర్చున్నాడు. శ్రీకర్ కారు ముందు సీట్లో.. కుమార్ వెనక సీట్లో కూర్చున్నారు. కారు వాయువేగంగా కదిలింది. ‘‘చరణ్.. శంషాబాద్ సుందరం ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నా. అర్జెంటుగా పోలీసు ఫోర్స్‌ను తీసుకొని వచ్చేయ్’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.‘‘సర్.. అక్కడే సుందరంగారు కథలు చెప్తుంటే అతని అసిస్టెంట్ భూషణం టైప్ చేస్తుంటాడు’’ అంటూ మరికొంత సమాచారమిచ్చాడు కుమార్.‘‘భూషణం ఎలాంటి వాడు.. నీకేమైనా తెలుసా’’ కూపీ లాగాడు శ్రీకర్.‘‘అంతగా పరిచయం లేదు సర్. అతను నా కంటే ముందు రాజశేఖరంగారి వద్ద పనిచేసే వాడట. అతని ప్రవర్తన నచ్చక పంపించేశానని సార్ ఒకసారి అన్నారు. ప్రస్తుతం సుందరం దగ్గర పనిచేస్తున్నాడు’’ మళ్ళీశ్రీకర్ ఏమంటాడో.. భూషణం గురించి ముందు చెప్పక పోవడమూ తప్పు చేశానని గిల్టీగా ఫీలయ్యాడు కుమార్.‘‘అదే కుమార్.. నీలో ఉన్న పెద్ద తప్పు. ఏదైనా అడగంది చెప్పడం లేదు. నేర పరిశోధన సమయంలో ఏ విషయమూ దాచొద్దు. సరే అయిందేదో అయింది. నాకు భూషణం మీద అనుమానంగా ఉంది. అనిల్ త్వరగా పోనీయ్’’ అంటూ వేగిర పెట్టాడు శ్రీకర్. వారు ఫామ్‌హౌస్ చేరుకునే సరికి చరణ్ తన బృందంతో అప్పుడే జీపు దిగుతున్నాడు.చరణ్ సంకేతాలందుకొని పోలీసులు తలుపులు బద్దలుకొట్టారు. ఎదురుగా ముగ్గురు రౌడీలు.. పోలీసులను చూడగానే కాళ్ళకు బుద్ధి చెప్పబోయారు. నలుగురు పోలీసులు చుట్టుముట్టి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు భూషణం.. కుమార్ గుర్తించాడు.‘‘విశాల్ ఎక్కడ’’ అని గద్దించాడు ఇన్స్పెక్టర్ చరణ్. భూషణాన్ని సోదా చేసి సెల్ ఫోన్ లాక్కున్నాడు. భూషణం పక్క గదిలోకి కదిలాడు. అంతా వెంబడించారు. మంచంపై విశాల్ మత్తుగా నిద్రపోతున్నాడు. ఇంతగా అలజడి అయినా విశాల్ లేవక పోవడం.. అధిక మొత్తంలో మాదక ద్రవ్యం కన్జ్యూమ్ చేసి ఉంటాడని భావించాడు చరణ్. శ్రీకర్, అనిల్ పక్క గది లోకి వెళ్ళి సోదా చేసారు. రాజశేఖరం గారి పర్సనల్ కంప్యూటర్.. కథలు దొరికాయి. వాటిని తీసుకొచ్చి చరణ్‌కు అందజేశారు.చరణ్ భూషణం సెల్ ఫోన్ లోని ఫొటోలు చూపించాడు. ఇద్దరూ.. చిరునవ్వు నవ్వుకున్నారు. ఇద్దరు పోలీసులను విశాల్ దగ్గర కాపలా పెట్టి లేచాక స్టేషన్‌కు తీసుకురమ్మన్నాడు చరణ్.‘‘చరణ్.. అనిల్, కుమార్‌లను కూడా ఇక్కడే ఉండనిద్దాం. విశాల్ లేచాక ముందుగా రాజశేఖరం గారి అంతిమ సంస్కారం పోలీసుల పర్యవేక్షణలో చేయిద్దాం. కుమార్, అనిల్ ఆ పని చూసుకుంటారు. నేను నీతో స్టేషన్‌కు వస్తాను’’ అని అనుమతి అడిగాడు శ్రీకర్. చరణ్ ఓకే.. అన్నట్టుగా తలూపాడు. ఇద్దరు రౌడీలను, భూషణంను పోలీసు జీపు ఎక్కించారు పోలీసులు.చరణ్, శ్రీకర్ అంతా కలిసి అదే జీబులో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ చరణ్ తనదైన శైలిలో లాఠీ ఝళిపించే సరికి భూషణం గుండె అదిరి పోయింది. లాఠీ రుచి చూడక ముందే..‘‘సర్.. నిజం చెబుతాను’’ అంటూ చరణ్ కాళ్ళపై పడిపోయాడు భూషణం. శ్రీకర్ కనుసైగ చూసి మీడియాను రమ్మన్నాడు చరణ్. ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే దారిలో శ్రీకర్ మీడియాకు ప్రముఖ రచయిత రాజశేఖరం హంతకుడు దొరికాడని చెప్పడం విన్నాడు. మీడియా ముందు భూçషణం నోరు విప్పాడు.‘‘కుమార్ కంటే ముందు రచయిత రాజశేఖరం గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేసేవాడిని. మాది చాలా పెద్ద కుటుంబం. ఖర్చుల కోసం అడ్డదార్లు తొక్కాల్సి వచ్చేది. నాకు కథలు రాయడం రాదు. కేవలం కంప్యూటర్లో టైప్ చేసే వాణ్ణి. ఒకసారి రాజశేఖరంగారి ఒక కథా వస్తువును రచయిత సుందరం గారికి లీక్ చేశాను. తను అధిక మొత్తంలో డబ్బు ఇచ్చాడు. కథలకు అంత డబ్బు వస్తుందని నాకు మొదటి సారిగా తెలిసింది. ఆ కథను డెవలప్ చేసి సుందరం గారు ఒక నిర్మాతకు అమ్మాడు. అది సినిమాగా తీశారు. విజయం సాధించింది. ఆ కథ నాదంటూ రాజశేఖరం నిర్మాతతో గొడవకు దిగాడు. అప్పుడు నా విషయం బయట పడింది. నన్ను అందరి ముందూ తిట్టి ఉద్యోగంలో నుంచి తీసేశాడు రాజశేఖరం. సుందరంగారు నన్ను చేరదీశారు. రాజశేఖరం గారి కథలతో మూడు సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందడం.. సుందరంగారి కథలతో సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం.. ఆలోచనలో పడ్డాం. నాకు విశాల్ సంగతి పూర్తిగా తెలుసు. అతను మత్తు మందుకు బానిస. అది రాజశేఖరం గారికి తెలియదు. పూర్తిగా కథల్లో మునిగి పోయి విశాల్ గురించి పెద్దగా పట్టించుకునే వాడు కాదు. కొడుకుపై నమ్మకమెక్కువ. విశాల్‌ను బుట్టలో వేసుకున్నాను. ముందుగా కొంత మత్తుమందు ఉచితంగా ఇచ్చాను. దాంతో నన్ను పూర్తిగా నమ్మాడు. డబ్బు కోసం మీ నాన్న గారిని బలవంత పెట్టొద్దు. ఎంత కావాలన్నా అంత బ్రౌన్ షుగర్ నీకందిస్తారని నమ్మబలికి సుందరం గారికి పరిచయం చేశాను. రాజశేఖరం గారు కుమార్ సాయంతో మరి కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారని విశాల్ ద్వారా తెలుసుకున్నాను. ఈసారి కథలతో బాటు ఏ ఆధారాలు లేకుండా ల్యాప్‌టాప్‌ను కూడా తస్కరించాలని.. సుందరం గారికి నా పథకం చెప్పాను.మరో పథకం కూడా వేసి.. సినీ జగత్తులో నాకు మరో పోటీ దారుడు లేకుండా చేయి. నీకూ పగ చల్లారినట్టు ఉంటుంది. కుమార్‌ను కూడా లేపెయ్యి. కోటి రూపాయలిస్తానని ఆశ చూపారు సుందరంగారు. కోటి రూపాయలంటే మాటలా! ఒక్క దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టాలనుకున్నాను. తను విహార యాత్రకు వెళ్లాడని తెలుసు.. ఎవరికీ అనుమానం రాదని ఆ రాత్రి రమ్మన్నాడు విశాల్. విశాల్ చెప్పిన సమయానికి వారి ఇంటికి వెళ్ళాను. విశాల్ నన్ను తన గదిలో కూర్చోమన్నాడు. తను రాజశేఖరం గదికి వెళ్ళి కథలు.. పర్సనల్ కంప్యూటర్, సెల్ ఫోన్ తెచ్చిచ్చాడు. వానిని ఒక బ్యాగులో సర్దుకొని రెండుబ్రౌన్ షుగర్ పాకెట్లిచ్చాను. దాన్ని చూడగానే ఆవురావురుమంటూ లాగించాడు విశాల్. అతను అలా ఒరిగి పోగానే నేను రాజశేఖరం గదిలోకి వెళ్ళి దిండు ముఖాన పెట్టి ఊపిరాడకుండా అదిమి పట్టాను. కాసేపటికి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక ‘కుమార్.. కుమార్’ అంటూ గట్టిగా పిలిచాను. కుమార్ వస్తున్నట్లు గమమనించి వెళ్ళి ఆల్మారా వెనుకాల దాక్కున్నాను. కుమార్ వచ్చి రాజశేఖరాన్ని చూస్తుంటే సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాను. కుమార్ రంగయ్య కోసం ఔట్ హౌస్‌కు పరుగెత్తడం చూసి విశాల్‌ను ఎత్తుకొని, బ్యాగు తీసుకొని బయట పడ్డాను. ఇంటికి కాస్తా దూరంగా పార్క్ చేసిన కారులో శంషాబాద్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాను.తెల్లవారు జామున విశాల్ లేచాడు. కాని ఇంకా పూర్తిగా మత్తు వదలినట్లుగా లేదు. వాళ్ల నాన్న గారిని కుమార్ హత్య చేశాడని అనుకుంటున్నారంతా. నీవేలి ముద్రలు టీపాయ్ మీద పడి ఉంటాయి. విహార యాత్రకు వెళ్ళినవాడి వేలి ముద్రలెలా వచ్చాయనే అనుమానం రావచ్చు. నీ విహార యాత్ర అబధ్ధమని తేలితే నిన్నూ అరెస్టు చేయవచ్చు. ఎందుకైనా మంచిది. నువ్వు ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళొద్దని భయపెట్టి.. బలవంతంగా మత్తు మందు ఇంజక్షన్ చేశాను. ఫొటోల ప్రింటౌట్లను మరుసటి రోజు ఉదయమే ఎస్సై గారి క్వార్టర్ గుమ్మం ముందు వేయించాను. కాని నా ఫోన్లో ఫొటోలు డిలీట్ చెయ్యడం మరిచాను’’ అంటూ తల దించుకున్నాడు భూషణం. ‘‘మావాళ్ళు సుందరాన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకు వస్తున్నామని ఇప్పుడే ఫోన్ వచ్చింది. తప్పు చేసిన వారెవరూ చట్టం నుండి తప్పించుకో లేరు. ఈ కేసులో శ్రీకర్, అనిల్‌తో బాటు కుమార్ గూడా నా కెంతగానో సహకరించారు. వారికి నా ధన్యవాదాలు’’ అంటూ విలేకరుల ముందు తన వినమ్రతను చాటుకున్నాడు చరణ్. - క్రైమ్ స్టోరీ -
అక్క కోసం ఓ తమ్ముడి తపన
నాంపల్లి(మునుగోడు): సోదరి ఆచూకీ కోసం ఓ తమ్ముడు పడిన తపన ఇది. పద్నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఆచూకీ లేకుండా పోయిన అక్క కోసం నిరంతరం వెతికాడు అతడు. డిటెక్టివ్‌లా పరిశోధించాడు. చివరికి తన అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే చంపి బావిలో పడేసినట్లు తెలుసుకున్నాడు. ఇద్దరు పిల్లలను అమ్మేసినట్లు వెల్లడి కావడంతో షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోర హనుమంతు హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతనికి నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంక పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా 2004 సంవత్సరంలో పెళ్లి చేసుకుని స్వగ్రామమైన వెంకెపల్లిలో కాపురం పెట్టారు. వారికి ఓ కుమారుడు, కూతురు జన్మించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. హనుమంతు తన భార్య ప్రియాంకను చంపి మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామశివారులోని పాడుబడిన బావిలో పడేశాడు. కుమారుడిని కొండమల్లేపల్లిలో తెలిసిన వారికి విక్రయించాడు. కూతురును హైదరాబాద్‌లో వేరొకరికి అమ్మాడు. అతను మాత్రం మరో వివాహం చేసుకుని స్వగ్రామంలోనే జీవనం సాగిస్తున్నాడు. ప్రియాంక ఎవరిని ప్రేమించిందన్న విషయం ఇంట్లో తెలియకపోవడంతో వారు ఆమె ఆచూకీని వారు కనుక్కోలేకపోయారని తెలుస్తోంది. మూడేళ్లుగా పరిశోధన.. ప్రియాంక సోదరుడు ఉపేందర్‌కు ప్రస్తుతం 21 ఏళ్లు మూడేళ్లుగా అతను అక్క కోసం తిరుగుతున్నాడు. తన అక్క ప్రేమించిన వ్యక్తి హైదరాబాద్‌లో క్రూజర్ డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుసుకున్నాడు. ఆరా తీసి అడ్రస్ కనిపెట్టాడు. వెంకెపల్లికి చేరుకుని సోదరి కోసం వెతికాడు. కానీ ఆమె కనిపించలేదు. ఏమి జరిగిందని గ్రామస్తులవద్ద ఆరా తీశాడు. మూడేళ్ల క్రితమే ప్రియాంకను చంపివేసినట్లు పలువురు గ్రామస్తులు తెలిపారు. ‘నిన్ను కూడా చంపేస్తాడు. వెళ్లిపో’అని చెప్పారు. దీంతో జరిగిన ఘోరాన్ని మొదట ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో చెప్పాడు. వారి సూచనమేరకు మర్రిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ప్రస్తుతం నిందితుడు హనుమంతును అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమదైన శైలిలో విచారణ జరపగా ప్రియాంకను చంపి, ఇద్దరు పిల్లలను విక్రయించినట్లు ఒప్పుకున్నాడని తెలిసింది. ప్రియాంక తమ్ముడు ఉపేందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
లేడీ డిటెక్టివ్‌గా త్రిష
తమిళసినిమా: లేడీ డిటెక్టివ్‌గా అవతారమెత్తనున్నారు నటి త్రిష. కథానాయకి డిటెక్టివ్‌గా నటించడం అన్నది కోలీవుడ్‌లో ఇదే ప్రప్రథం అన్నది గమనార్హం. నటి అనుష్క, నయనతారల తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల అవకాశాలు నటి త్రిషనే వరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో మోహిని, గర్జన, పరమపదం విళైయాడు వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు 96, చతురంగవేట్టై–2, 1818, తదితర 8 చిత్రాలున్నాయి. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. దీనికి కుట్రపయిర్చి అనే టైటిల్ నిర్ణయించారు. శ్రీ గురుజ్యోతి ఫిలింస్ పతాకంపై జీ.వివేకానందన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వర్ణిక్ పరిచయం కానున్నారు. ఈయన దర్శకుడు బాలా వద్ద తారైతప్పటై్ట చిత్రానికి సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్ర విరాలను ఈయన తెలుపుతూ కుట్రపయిర్చి 1980లో సాగే నేర పరిశోధన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఒక హత్య, దాని గురించి ఇన్వెస్టిగేషన్ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నారు. ఇందులో త్రిష ప్రధాన పాత్రను పోషించనున్నారని తెలిపారు. ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌గా నటించనున్నారని చెప్పారు. హీరోయన్ డిటెక్టివ్‌గా నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుందని అన్నారు. తొలి భారతీయ లేడీ డిటెక్టివ్ రజనీ పండిట్‌ను స్ఫూర్తిగా తీసుకుని త్రిష పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే కుట్రపయిర్చి నిజసంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు. ఇందులో త్రిషతో పాటు నటి సురభి, సూపర్ సుబ్బరాయన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి రథన్ సంగీతం, బాబుకుమార్ ఛాయాగ్రహణం అందించనున్నారని చెప్పారు. చిత్రం త్వరలోనే ప్రారంభం అవుతుందని దర్శకుడు తెలిపారు. -
ఆసక్తికరంగా 'అభిమన్యుడు' ఫస్ట్ లుక్
డిటెక్టివ్ గా టాలీవుడ్ కోలీవుడ్ లలో సత్తా చాటిన విశాల్, త్వరలో అభిమన్యుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా తెలుగులో హరి వెంకటేశ్వరా ఫిలింస్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను 2018 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన విశాల్ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. -
సెన్సార్ సర్టిఫికేషన్‌పై విశాల్ కామెంట్స్
ఈ శుక్రవారం డిటెక్టివ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విశాల్, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సార్ సర్టిఫికేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమా సెన్సార్ ను ముంబైకి మార్చేయటంతో సెన్సార్ సర్టిఫికేట్ సాధించటం డిగ్రీ సర్టిఫికేట్ సాధించడమంత కష్టంగా మారిందన్నారు. అదే సమయంలో తమిళ్ తెలుగు భాషల్లో తమ సినిమాను ఒకేసారి రిలీజ్చేయలేకపోవటానికి కారణాలు కూడా తెలిపారు. తమిళ్ లో తమ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో తెలుగులో పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటున్నాయని అందుకే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయటం కుదరటం లేదని తెలిపారు. సెన్సార్ అయిన సినిమా విషయంలో కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం పై కూడా విశాల్ స్పందించారు. సినిమాకు సెన్సార్ సెంట్రల్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత కొంత మంది సినిమాలోని డైలాగ్స్‌ను కట్ చేయమనటం అన్యాయం అన్నారు. అలా కట్ చేసుకుంటూ వెళితే సెన్సార్ సర్టిఫికేట్ తప్ప చూపించడానికి ఏమి మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు. జి హరి దర్శకత్వంలో తెరకెక్కిన డిటెక్టివ్ సినిమాలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు ప్రసన్న మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించారు విశాల్. -
అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్.. రోలింగ్ టైటిల్సే మిగులుతాయి!
‘‘మిస్కిన్ (దర్శకుడు) విచిత్రమైన మనిషి. నేనూ, ఆయన సినిమా చేస్తున్నామనగానే ‘ఇద్దరు సైకోలు కలసి సినిమా చేస్తున్నారు’ అని ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తే... నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందని గట్టి నమ్మకం. ఆయన డిఫరెంట్ సినిమాలు తీస్తారు. ఎనిమిదేళ్లుగా ఇద్దరం సినిమా చేయాలనుకుంటుంటే... ఈ ఏడాది కుదిరింది. హాలీవుడ్ ‘షెర్లాక్ హోమ్స్’ తరహా చిత్రమిది. అక్టోబర్‌లో తమిళ్లో ‘తుప్పరివాలన్’గా విడుదలై సూపర్ హిటై్టంది. తెలుగులోనూ హిట్టవుతుందనే నమ్మకముంది. నా కెరీర్లో వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్’’ అన్నారు విశాల్. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి. హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్’. ఈ నెల 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ– ‘‘ఇందులో అద్వైత భూషణ్‌గా నటించా. ఒక్క పాట కూడా లేకుండా నేను సినిమా చేయడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేశాం’’ అన్నారు. తెలుగులో మీ సిన్మాలు ఎందుకు లేటుగా విడుదలవుతున్నాయి? అనడిగితే.. ‘‘సెన్సార్ సమస్యలే కారణం. తమిళ్ సెన్సార్‌ను ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి సర్టిఫికెట్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ చేతికొచ్చినట్టు ఉంటోంది. ఒక్కోసారి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఉంటే వెనక్కి వెళ్లక తప్పడం లేదు. (నవ్వుతూ...) 10వ తేదీన సినిమా విడుదల కాకుంటే హరిని చంపేస్తా. తెలుగులో నా బలం హరి’’ అన్నారు విశాల్. ‘విజయ్ ‘మెర్సల్’కి మద్దతిచ్చారు. చెన్నైలో వరదలొస్తే హెల్ప్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?’ అనడిగితే... ‘‘సీబీఎఫ్సీ (సెన్సార్) సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల జోక్యం ఏంటి? వాళ్లందరూ డైలాగులు కట్ చేస్తే... చివరికి సిన్మాలో సెన్సార్ సర్టిఫికెట్, రోలింగ్ టైటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఇక, రాజకీయాలు అంటారా? పవర్ ఉంటేనే ప్రజలకు మేలు చేయగలుగుతానని ఫీలైన రోజున రాజకీయాల్లోకి వస్తా. మన రాజకీయ నాయకులు మంచి రాజకీయం చేయాలని నా ఆశ.అప్పుడు నాలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉండదు’’ అని విశాల్ తెలిపారు. మన దేశంలోని సినీ ప్రముఖులందరూ కలసి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీపై ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కార్యక్రమంలో చిత్రనిర్మాత హరి, నటి ఆండ్రియా, మాటల రచయిత రాజేశ్ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరితో.... అనేదిఅమ్మాయి ఇష్టమే! క్యాస్టింగ్ కౌచ్... (హీరోయిన్లపై లైంగిక వేధింపులు/పడకగదికి వస్తే సిన్మాలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం)... ఇప్పుడీ అంశం ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది! కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో సామాన్యులు ‘మీ టూ’ పేరుతో ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ‘‘క్యాస్టింగ్ కౌచ్, మీటూ’లపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆండ్రియాను అడిగితే... ‘‘ఇండస్ట్రీలో నాకెలాంటి లైంగిక ఇబ్బందులూ ఎదురుకాలేదు. ఒకవేళ ఎదురైతే సినిమాలు వదులుకోవడానికి నేను సిద్ధమే. అయినా... ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగతం. మగవాళ్లు డిసైడ్ చేయాల్సిన విషయం కాదిది. మరొకరు బలవంతం చేయకూడదు’’ అన్నారు. ప్రేమ పెళ్లే... జనవరిలో! ఇంట్లో కోప్పడుతున్నారు... ‘పెళ్లెప్పుడు?’ అని! డిసెంబర్లో ‘నడిగర్ సంఘం’ ఓన్ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ నెక్ట్స్ మంత్... జనవరిలో పెళ్లి చేసుకుంటా. ‘పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?’ అని ‘సాక్షి’ అడగ్గా... ‘‘లవ్ మ్యారేజే (ప్రేమ పెళ్లే)! నాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదండీ’’ అని నవ్వేశారు విశాల్. -
డిటెక్టివ్?
లాంగ్ కోట్, తలకు హ్యాట్, మెలితిరిగిన మీసాలు... జనరల్‌గా డిటెక్టివ్ అంటే ఈ లుక్‌లోనే ఊహించుకుంటాం. ఓసారి ఎన్టీఆర్‌ని ఈ లుక్‌లో ఊహించి చూడండి. గెటప్ అదిరింది కదూ! ఏ సినిమాలో ఎన్టీఆర్ ఈ లుక్‌లో కనిపించనున్నారంటే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో అని ఫిల్మ్‌నగర్ టాక్. 1980లలో వచ్చిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ ఆ నవల హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేయనున్నారనే వార్త వచ్చింది. అయితే, త్రివిక్రమ్ రైట్స్ తీసుకున్న నవల డిటెక్టివ్ బేస్డ్ అట. అందుకని, ఎన్టీఆర్ చేయబోతున్నది డిటెక్టివ్ పాత్ర అని చాలామంది ఫిక్సయ్యారు. ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ ఆ నవల తీసుకున్నారా? లేక వేరే సినిమాకా? అనేది త్వరలోనే తెలుస్తుంది. అన్నట్లు... త్రివిక్రమ్ గత చిత్రం ‘అ ఆ’ కూడా ఓ నవల ఆధారంగా రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. -
డిటెక్టివ్ పాత్రలో ఎన్టీఆర్
జై లవ కుశ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడట. 80లలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆ నవల హక్కులను కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ.. కూడా నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే. దీంతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా నవల ఆధారంగానే తెరకెక్కనుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి ఈప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
అవినీతి ఐఏఎస్.. డిటెక్టివ్ జంటకు ఝలక్
థానే : ఓ సీనియర్ సివిల్ సర్వీస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో డిటెక్టివ్ దంపతులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు థానే పోలీసులు ప్రకటించారు. ప్రైవేట్ డిటెక్టివ్ సతీష్ మంగలే ఆయన భార్య శ్రద్ధాలు ఐఏఎస్ అధికారి రాధేశ్యామ్ మోపల్వార్ను ఏడు కోట్లు చెల్లించాలంటూ గత కొంత కాలంగా బెదిరిస్తున్నారు. అక్టోబర్ 23న ఆ డబ్బును నాసిక్ హైవేలో ఉన్న ఖరేగావ్ టోల్ ఫ్లాజా వద్ద అప్పగించాలని.. లేకపోతే రాధేశ్యామ్ అవినీతి గుట్టును బయటపెడతామని వాళ్లు బెదిరించారు. దీంతో మోపల్వార్ ఆ ఫోన్లను నేరుగా థానే పోలీసులకు అనుసంధానం చేశారు. బెదిరింపులు నిజమని నిర్థారించుకున్న తర్వాత చివరకు ఓ కానిస్టేబుల్‌ను మారువేషంలో కోటి రూపాయలు ఇచ్చి దొంబివాలీలో ఆ దంపతులు అద్దెకు ఉంటున్న ఇంటికి పంపించారు. అనంతరం డబ్బు తీసుకుంటుడగా వారిని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ దంపతులతోపాటు వారికి సహకరించిన అనిల్ వేద్మెహతాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్న రెండు ల్యాప్ ట్యాప్‌లు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు పెన్ డ్రైవ్‌లు, 15 సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు థానే పోలీసులు వెల్లడించారు. కాగా, మహారాష్ట్ర రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థకు రాధేశ్యామ్ గతంలో వైస్ చైర్మన్‌గా వ్యవహరించేవారు. అవినీతి ఆరోపణలు వెలుగు చూడటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగష్టులో ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే సతీష్ మంగలే లీక్ చేసిన ఆడియో సంభాషణల మూలంగానే ఆయన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఓ వాదన ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి టేపులు భయటపెడతామంటూ బెదిరించి ఆ డిటెక్టివ్ దంపతులు రాధేశ్యామ్‌ను మరోసారి బెదిరించినట్లు తెలుస్తోంది. -
'డిటెక్టివ్' మూవీ స్టిల్స్
-
నవంబర్‌లో స్పెషల్ డిటెక్టివ్!
‘మీ ఫీజెంత?’ అడుగుతాడు డిటెక్టివ్‌ని ఓ వ్యక్తి. కేసు తెలిస్తే కానీ ఫీజుకు కమిట్ అవ్వనంటాడు. అతను స్పెషల్ డిటెక్ట్వ్. కేసులో క్లూస్ వాటంతట అవే దొరకాలని చూడడు. దొరికేవరకు వెతుకుతాడు. వన్స్ కమిట్ అయితే ఆ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ముగించాల్సిందే. పోలీసులు కూడా అప్పుడప్పుడు అతని హెల్ప్ తీసుకుంటుంటారు. అయితే ఇలాంటి స్పెషల్ డిటెక్టివ్‌కు ఓ మర్డర్ మిస్టరీ సవాల్‌లా నిలిచింది. ఆ మిస్టరీని ఆ ఎలా చేధించాడు? ఈ క్రమంలో అతనిపై ఎవరైనా ఎటాక్ చేశారా? వంటి ఆసక్తికర అంశాలతో తమిళంలో రూపొందిన చిత్రం ‘తుప్పరివాలన్’. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి.హరి నిర్మించారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా కథానాయికలు. ఈ సినిమాను తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో వచ్చే నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘తమిళంలో విశాల్ కెరీర్లో ఫస్ట్ వీక్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిది. తెలుగులోనూ సూపర్‌హిట్ అవుతుంది’’ అన్నారు నిర్మాత హరి. ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి స్వరకర్త. -
చేతి పట్టీ
వాళ్లిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. వందన తన ఇష్టపూర్వకంగానే ఆ యువకుడితో భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ ఆటో ఎక్కింది. ఫుటేజ్‌ను తన పెన్ డ్రైవ్‌లో వేసుకున్నాడు డిటెక్టివ్ శిరీష్. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీస్ స్టేషన్ హడావిడిగా ఉంది. జూ పార్క్ వద్ద ఉన్న చెట్ల గుబురుల్లో పోలీసులకు ఒక యువతి శవం దొరికింది. ఆమె ఒంటిమీద హోటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు ఉంది.‘‘సర్! మీకోసమే ఎదురుచూస్తున్నాం’’ అన్నాడు ఇంటి యజమాని. ఆయన కూతురునే దుండగులు ఎత్తుకుపోయారు. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. ఆయన చాపిన చేతిని అందుకుని కరచాలనం చేశాడు డిటెక్టివ్ శిరీష్. వాళ్లిద్దరూ ఎదురెదురుగా డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. శిరీష్ చేతిలో ఒక యువతి ఫొటో ఉంచాడు తండ్రి. యువతికి పదిహేడూ, పద్దెనిమిది ఉంటుంది వయసు. అందగత్తె. ‘‘హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తోంది. నిన్న రాత్రి తన ఇన్స్టిట్యూట్ నుండి తిరిగివస్తూ తప్పిపోయింది’’ అన్నాడు తండ్రి. తరువాత ఆయనే చెప్పుకొచ్చాడు. ఆయన కూతురు పేరు వందన. నిన్న రాత్రి ఏడున్నర తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఆఫ్ అయిపోయింది. ఇంటికి సాధారణంగా ఎనిమిది గంటల లోపు చేరుకుంటుంది వందన. రాత్రి పది అవుతున్నా సరే రాకపోయేసరికి పోలీసులకు తెలియపరచాడు వందన తండ్రి. వందన స్నేహితుల వివరాలు అడిగాడు డిటెక్టివ్ శిరీష్. వాళ్ల ఫోన్ నంబర్లతో పాటు అందించాడు వందన తండ్రి. ‘‘మీ ఇంటి పైవాటాలో ఉంటున్న రామభద్రాన్ని పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు?’’ అడిగాడు శిరీష్. ‘‘అదేనండీ అయోమయంగా ఉంది! ఆయన మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిని అపహరించినట్టు ఆయనను అనుమానిస్తున్నారు పోలీసులు. ఆయన కొడుకులూ, కూతుళ్లూ ఇతర నగరాల్లో ఉన్నారు. బాగా బ్రతికిన మనిషి. తన పెన్షన్ డబ్బులతో ఇక్కడే జీవిస్తున్నాడు ఆయన. ఎవరి జోలికీ వెళ్లే రకం కాదు’’ అన్నాడు వందన తండ్రి. ఆయనకు భార్య కూడా లేదట! ‘‘రామభద్రం నిన్న సాయంకాలం బయటికి వెళ్లారు. రాత్రి ఏ సమయంలో వచ్చారో తెలియదు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన మా అమ్మాయితో మాట్లాడేడట. కొంత కాలం నుండి మా అమ్మాయిని తన మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు ఆయన. అదే చివరి ఫోన్ కాల్. కాల్ డేటా సంపాదించారు పోలీసులు. రామభద్రం గారి ఫోన్ డేటా దొరికింది. ప్రశ్నించడానికి తమ స్టేషన్‌కి తీసుకుపోయారు’’ మరిన్ని వివరాలు చెప్పాడు వందన తండ్రి. ‘‘ఆయన మీద మీకు అనుమానం లేదు కదా!’’ అడిగాడు డిటెక్టివ్ శిరీష్. ‘‘లేదండీ! తన సొంత మనవరాలి కంటే ఎక్కువగా అభిమానిస్తాడు రామభద్రం గారు’’ అన్నాడు వందన తండ్రి. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా మగ స్నేహితులు ఉన్నారా?’’ అడిగాడు డిటెక్టివ్ శిరీష్. ‘‘ఇందాక మీకు అందించిన స్నేహితుల వివరాల్లో కుమార్ అన్నవాడు మా ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. అతడిని మా అమ్మాయి ఇష్టపడుతోందని మా అనుమానం’’ ‘‘అతడి ఇల్లు ఎక్కడ?’’ అడిగాడు డిటెక్టివ్ శిరీష్. వందన తండ్రి చిరునామా ఇచ్చాడు. డిటెక్టివ్ శిరీష్ బయలుదేరాడు. ఆయన కారు రాంనగర్ రెండో వీధిలో అయిదో ఇంటి ముందు ఆగింది. కుమార్ ఇంట్లోనే దొరికాడు. ‘‘వందనను చివరిసారి ఎప్పుడు కలుసుకున్నావ్?’’ అడిగాడు డిటెక్టివ్ శిరీష్. కుమార్ ఆశ్చర్యంగా చూసి, ‘‘ఎందుకు సార్ అలా అడుగుతున్నారు?’’ అని అడిగాడు. వందన కనిపించకుండా పోయే సంగతి వివరించాడు డిటెక్టివ్ శిరీష్. ‘‘నిన్ననే కలుసుకున్నానండీ! తన ఇన్స్టిట్యూట్కు వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది వందన’’ అన్నాడు కుమార్.‘‘మీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారా?’’ కుమార్ మొహంలో ఒక విచిత్రమైన భావన వెలువడి మెరుపులాగా మాయమైంది. డిటెక్టివ్ శిరీష్ పెదిమలు బిగించాడు.‘‘ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి ఏమిటండీ! పైగా మా ఇద్దరికీ ఏమంత వయసు ముంచుకొచ్చిందనీ! కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేయాలి ఇద్దరమూ’’‘‘రామభద్రం అనే ఓ ముసలాయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారట. వందనను ఆయన ఎక్కడో దాచిపెట్టాడని పోలీసులకు అనుమానం’శిరీష్ మాటలు ముగించకముందే కలగజేసుకున్నాడు కుమార్.‘‘రామభద్రం అంటే వందన వాళ్లింట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే కదండీ? వందనను ఆయన తన మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడట. వందనకు వాళ్ల సంబంధం ఇష్టం లేదు. రామభద్రంగారంటే వందనకు కోపంగా కూడా ఉంది. అలా అని చెప్పి రామభద్రంగారు అపకారం చేసే మనిషని భావించలేము.’’ తన నోట్ పుస్తకంలో ఈ సంగతి రాసుకున్నాడు డిటెక్టివ్ శిరీష్. ‘‘రాత్రి నుండి వందన తన ఇంటికి చేరుకోలేదు. నీ అభిప్రాయం ఏమిటి?’’ అడిగాడు డిటెక్టివ్ శిరీష్.‘‘వందన ఎప్పుడైనా ఆగిపోతే కేవలం మా ఇంట్లో మాత్రమే ఆగిపోతుందండీ. మా చెల్లెలూ, వందనా మంచి ఫ్రెండ్స్’’‘‘అయితే వందన ఎక్కడున్నట్టూ?’’‘‘ఈ రకంగా కూడా అవకాశం ఉంది. రామభద్రం గారు ఆమెను ఢిల్లీ పంపించి ఉంటారు. రహస్యంగా. ఎవరినో తోడు ఇచ్చి. లేకపోతే పోలీసులు మాత్రం ఆయనను అకారణంగా ఎందుకు ప్రశ్నిస్తూ ఉంటారు?’’‘‘అంతే అయి ఉండాలి కుమార్!’’కుమార్ మొహంలో కావాల్సినంత ఉపశమనం.‘‘రామభద్రమే మీ వందనను అపహరించి ఉంటే కేసు సులువుగా తేలిపోయినట్టే!’’ అంటూ శిరీష్ అక్కడి నుండి బయలుదేరాడు. మధ్య దారిలో వందన తండ్రి ఆయనను కలుసుకున్నాడు. ఆయన చేతికి ఒక పట్టీ ఇచ్చాడు. పబ్స్‌లో ప్రవేశించేటప్పుడు చేతికి కట్టే పట్టీ అది. నగరంలో ఉన్నపబ్స్లో రకరకాల పట్టీలు కడుతూ ఉంటారు.‘‘ఈ పట్టీ మా అమ్మాయి దుస్తుల్లో దొరికిందండి’’ అన్నాడు వందన తండ్రి. ∙∙ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ బోధించే ఇన్స్టిట్యూట్కి చుట్టుపక్కల ఉన్న పబ్స్‌లో దర్యాప్తు మొదలుపెట్టాడు డిటెక్టివ్ శిరీష్. వందన పోలికలు కల యువతిని వాళ్లు ఎవ్వరూ గుర్తుపట్టలేదు. వాళ్లు తమ వినియోగదారుల చేతులకు కట్టే పట్టీలు కూడా వేరే విధంగా ఉన్నాయి. ఉమర్ ఖయ్యూమ్ పబ్‌లో మాత్రం అదే పట్టీ. వందన ఆ పబ్‌కు వస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. వందనతో పాటు కుమార్ కూడా వచ్చేవాడట.పబ్‌లో సీసీ కెమెరాలు పకడ్బందీగా పని చేస్తున్నాయి. ముందు రాత్రి ఫుటేజ్‌లో వందన కనిపించలేదు. అంటే గత రాత్రి వందన ఈ పబ్‌కి రాలేదు. రోడ్డువైపు అమర్చిన కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలించాడు డిటెక్టివ్ శిరీష్.రోడ్డుమీద ఒక ఆటోరిక్షా వద్ద వందన ఒక యువకుడితో కలిసి మాట్లాడుతోంది. సమయం రాత్రి 8:17.వాళ్లిద్దరూ కలిసి ఆటో ఎక్కారు. వందన తన ఇష్టపూర్వకంగానే ఆ యువకుడితో భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ ఆటో ఎక్కింది. ఫుటేజ్‌ను తన పెన్ డ్రైవ్‌లో వేసుకున్నాడు డిటెక్టివ్ శిరీష్. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీస్ స్టేషన్ హడావిడిగా ఉంది. జూ పార్క్ వద్ద ఉన్న చెట్ల గుబురుల్లో పోలీసులకు ఒక యువతి శవం దొరికింది. ఆమె ఒంటిమీద హోటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కు సంబంధించిన గుర్తింపు కార్డు ఉంది.రామభద్రం గారిని విడుదల చేశారు పోలీసులు. ‘‘వందనను హత్య చేసింది కుమార్ అని మీకు ఎప్పుడు అనుమానం కలిగింది?’’ అడిగాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ సంగతే కుమార్‌ను అడిగాను. కుమార్ మొహంలో ఒక నిరసన భావన వెలువడి క్షణంలో మాయమైంది. అంతకు ముందు వరకూ రామభద్రం గారిని అనుమానించనక్కర్లేదన్న కుమార్ అటు తరువాత వందనను ఆయన ఢిల్లీ పంపించి ఉంటారని నాలో లేని పోని ఒక అనుమానం ప్రవేశపెట్టాడు. అంటే వందన కొంత కాలంపాటు కనిపించకుండా పోతే ఆమె ఢిల్లీలోనే ఉన్నట్టు మనం భావించాలన్నమాట. నేను నమ్మినట్టు కనిపించాను. అతడి మొహంలో గొప్ప రిలీఫ్ వ్యక్తమయ్యింది.వాళ్లిద్దరూ ఉమర్ ఖయ్యూమ్ పబ్ వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి ఏడు గంటల తర్వాత పబ్ వద్ద వాళ్లిద్దరూ కలిసి ఆటో రిక్షా ఎక్కారు. అంతకుముందే వందనను హత్య చెయ్యాలని నిర్ణయించుకుని ఉన్నాడు కుమార్. ఆమె తనను పెళ్లి గురించి విపరీతంగా హింస పెడుతోందని కుమార్ ఇబ్బంది పడుతున్నాడు. ఫలితంగా ఘర్షణ, అటుతరువాత హత్య ఒకదాని వెనుక ఒకటి తోసుకువచ్చి ఉంటాయి’’ అన్నాడు డిటెక్టివ్ శిరీష్. పబ్‌లో సీసీ కెమెరాలు పకడ్బందీగా పని చేస్తున్నాయి. ముందు రాత్రి ఫుటేజ్‌లో వందన కనిపించలేదు.అంటే గత రాత్రి వందన ఈ పబ్‌కి రాలేదు. రోడ్డువైపు అమర్చిన కెమెరాల ఫుటేజ్ కూడా పరిశీలించాడు డిటెక్టివ్ శిరీష్. రోడ్డుమీద మాత్రం ఒక ఆటోరిక్షా వద్ద వందన ఒక యువకుడితో కలిసి మాట్లాడుతోంది. సమయం రాత్రి 8:17. -
డిటెక్టివ్ యాక్షన్
మాస్ హీరో విశాల్ ‘డిటెక్టివ్’గా తెలుగు ప్రేక్షకులముందుకొస్తున్నారు. ఆయన హీరోగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుప్పరివాలన్’. తమిళ్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి, విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ‘డిటెక్టివ్’ పేరుతో ఈ నెలలోనే తెలుగులో విడుదల కానుంది. నిర్మాత జి. హరి మాట్లాడుతూ– ‘‘మొదటి వారంలోనే ‘తుప్పరివాలన్’ 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విశాల్ కెరీర్లోనే మొదటివారం హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘డిటెక్టివ్’ తెలుగు ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. విశాల్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, కెమెరా: కార్తీక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి. -
డిటెక్టివ్ మూవీ స్టిల్స్
-
పథకం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 28 కారు దిగి రైఫిల్‌తో నడుస్తూ అడవిలోకి వెళ్తూ దాన్లో రెండు గుళ్లని నింపాడు. అతనికి అడపా దడపా రైఫిల్ పేలుతున్న శబ్దం వినిపించింది. దాన్ని బట్టి, తాజా బూటు ముద్రలని బట్టి ఇరవై నిమిషాల్లో క్లాక్స్టన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. రేండల్ మోర్గాన్ డిటెక్టివ్ కథా రచయిత. అతను సృష్టించిన డిటెక్టివ్ పాత్ర పేరు స్పడ్ మోరన్. అతను హంతకుల్ని సమర్థవంతంగా పట్టుకుంటూంటాడు. అలాంటిది తనే హత్య చేయాల్సి వస్తుందని రేండల్ ఎన్నడూ భావించలేదు. అంతే కాదు. తను అందుకు ఓ డిటెక్టివ్ సేవని తీసుకోవాల్సి వస్తుందని కూడా భావించలేదు. ‘‘వాళ్ళిద్దరూ రూమ్ నంబర్ ఇరవై ఏడులో ఉన్నారు’’ ప్రైవేట్ డిటెక్టివ్, రేండల్కి ఫోన్ చేసి చెప్పాడు. ‘‘థాంక్యూ.’’ ‘‘వాళ్లని కలిపి ఫొటో తీయమంటారా?’’ డిటెక్టివ్ ప్రశ్నించాడు. ‘‘అవసరం లేదు. మీ చెక్ రెండు రోజుల్లో పోస్ట్‌లో అందుతుంది. ఇక మీరు వెళ్లవచ్చు.’’ వెంటనే రేండల్ కారులో ఆ హోటల్‌కి చేరుకున్నాడు. బార్లో కూర్చున్న తన భార్య లోరెన్... ఆమె ప్రియుడు, తన మిత్రుడు అయిన క్లాక్స్టన్ కనిపించారు. వాళ్లు అప్పుడే హోటల్ గదిలోంచి బయటికి వచ్చి ఉంటారని భావించాడు. రేండల్ వారి దగ్గరికి వెళ్లాడు. వాళ్ల మీద అనుమానం లేనట్లుగా, అనుకోకుండా చూసినట్లుగా నటించాడు. తన భార్య భయపడింది కానీ క్లాక్స్టన్ భయ పడలేదని గుర్తించాడు. తన మిత్రుడు క్లాక్స్టన్ ఆ రోజు వేటకి వెళ్తున్నాడని రేండల్ తన భార్య ద్వారా తెలుసుకున్నాడు. అతన్ని చంపదల్చుకున్న రేండల్... డిటెక్టివ్ కథా రచయితగా అప్పటికే ఓ పథకాన్ని ఆలోచించి ఈ అవకాశం కోసమే వేచి ఉన్నాడు. తన జేబులో రివాల్వర్, కొన్ని గుళ్లు ఉంచుకుని హంటింగ్ రైఫిల్‌ని తీసి కారులో దాచాడు. ఆ రైఫిల్ అమెరికన్ సైనికులు శత్రువుల నించి స్వాధీనం చేసుకున్న వియత్నమీస్ రైఫిల్. చాలాకాలం క్రితం దాన్ని వేలం పాటలో కొన్నాడు క్లాక్స్టన్. దాన్ని అతను తనకి బహుమతిగా ఓ పుట్టినరోజున ఇచ్చిన సంగతి తన భార్యతో సహా ఎవరికీ తెలీదు. దాని గురించి పోలీసులు విచారిస్తే, అది క్లాక్స్టన్కి చెందినదనే తెలుస్తుంది. అవసరమైన వస్తువుల్ని కారులో ఉంచుకుని మధ్యాహ్నం మూడు గంటలకి అద్దె కారులో ముప్పావు గంట దూరం లోని అడవికి బయదేరాడు రేండల్. కారుని పార్కింగ్ ఏరియాలో ఆపాడు. అతను ఊహించినట్లుగా క్లాక్స్టన్ కారు తప్ప ఇంకే కారూ లేదు. సమీప గ్రామంలో జరిగే సినిమా షూటింగ్ చూడటానికి అంతా వెళ్లారు. కారు దిగి రైఫిల్‌తో నడుస్తూ అడవిలోకి వెళ్తూ దాన్లో రెండు గుళ్లని నింపాడు. అతనికి అడపా దడపా రైఫిల్ పేలుతున్న శబ్దం వినిపించింది. దాన్ని బట్టి, తాజా బూటు ముద్రలని బట్టి ఇరవై నిమిషాల్లో క్లాక్స్టన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. తను రాసే కథలో అయితే, క్లాక్స్టన్కి తనకి సంభాషణ ఇలా సాగుతుంది అనుకున్నాడు. ‘‘క్లాక్స్టన్! నిన్ను చంపడానికి వచ్చాను.’’ ‘‘నన్నా? లేళ్లనా?’’ క్లాక్స్టన్ నవ్వుతూ అడుగుతాడు. ‘‘మార్పు కోసం నిన్ను.’’ ‘‘నాతో ఎందుకు జోక్ చేస్తున్నావు?’’ ‘‘జోక్ కాదు. లోరెన్కి నీకు మధ్య జరిగే గ్రంథం గురించి నాకు తెలుసు.’’ బహుశా వారిద్దరి మధ్య పోట్లాట కూడా తను రాస్తాడు. చివరికి క్లాక్స్టన్ని విజయవంతంగా చంపుతాడు. రేండల్ ఓ చెట్టు చాటు నించి క్లాక్స్టన్ ఛాతీకి రైఫిల్‌ని గురిపెట్టాడు. ఓ బండ రాయి మీద కూర్చుని కదలకుండా సిగరెట్ తాగుతున్న క్లాక్స్టన్ ఛాతిలో రెండు గుళ్లు దిగేలా కాల్చడం రేండల్కి తేలికైంది. నెమ్మదిగా అతని దగ్గరికి నడిచి వెళ్లి కాలితో తన్ని చూశాడు. మరణించాడు. తనతో తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్‌లో అతని దుస్తులు విప్పదీసి వేశాడు. సమీపంలోని వాగులోకి అతని నగ్న శరీరాన్ని తోసేశాడు. అది మిసిసిపీ నదిలోంచి సముద్రంలోకి కొన్ని గంటల్లో వెళ్లిపోతుంది. నీళ్లు పైనించి వాలుగా కిందకి ప్రవహిస్తూండ డంతో దారిలోని కొండ రాళ్లకి కొట్టుకుని ఆ శరీరం గుర్తుపట్టలేనట్ల్లుగా చిన్నాభిన్నం అవుతుంది. అతని రైఫిల్‌ని, సిగరెట్ పీకని చూసి, తర్వాత పోలీసులు క్లాక్స్టన్ వాగులో పడి మరణించి ఉంటాడని భావిస్తారు. ఛాతిలోంచి రాలిన రక్తపు బొట్లు కొన్ని నేలమీద పడ్డాయి. అవి కనపడకుండా వాటి మీదకి బండరాయిని నెట్టాడు. కొద్ది దూరంలో కొండ మీంచి లోయలోకి ఆ దుస్తుల కవర్ని విసిరేసి తిరిగి పార్కింగ్ ప్లేస్‌కి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని చూసి రేండల్ కొద్దిగా ఉలిక్కిపడ్డాడు. ‘‘మీ లెసైన్స్ని చూపించండి’’ పోలీస్ మర్యాదగా అడిగాడు. రేండల్ తన భయాన్ని అణచుకుంటూ డ్రైవింగ్ లెసైన్స్ తీసి చూపించాడు. ‘‘నేనడిగింది ఇది కాదు. మీ హంటింగ్ లెసైన్స్ని.’’ ‘‘నాకది లేదు.’’ ‘‘అది లేకుండా వేటకి రావడం నేరం అని మీకు తెలీదా?’’... కాస్త సీరియస్‌గానే అన్నాడు పోలీస్. వెంటనే రేండల్ మొహం పాలిపోయింది. ‘‘మీరు రెండుసార్లు రైఫిల్ పేల్చిన చప్పుడు నాకు వినిపించింది.’’ ‘‘ఉడతల్ని కాల్చాను.’’ ‘‘ఈ అడవిలో ఉడతలు ఈ సీజన్లో ఉండవు. మీరు కాల్చింది జింకలనే కదా?’’ అవునన్నట్లుగా తల ఊపాడు. ‘‘పదండి. వాటిని స్వాధీనం చేసుకోవాలి. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి’’ అతను కోరాడు. రేండల్కి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. కథలో ఇలాంటి సందర్భం వస్తే కొన్ని గంటల పాటు ఆలోచించి రేండల్ సరైన సమాధానం రాసేవాడు. కాని ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు. రేండల్కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. (జాన్ లట్జ్ కథకి స్వేచ్ఛానువాదం) -
నటించడం మొదలెట్టాక నా ఆలోచన మారింది
సోహా అలీఖాన్ ‘మొదట నేను డిటెక్టివ్ కావాలనుకున్నాను. యుక్త వయసులో లాయర్ కావాలనుకున్నా. ఇంకా ఏవేవో చేయాలనుకున్నా. రాయాలని కూడా అనుకున్నా. చివరికి నటినయ్యా. సిటీబ్యాంక్‌లో ఏడాదిన్నర పాటు పనిచేసిన తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ఒకప్పుడు సినిమా అంటే ఏముంది? పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం.. అంతే కదా అనుకున్నా. నటించడం మొదలుపెట్టాక నా ఆలోచన మారింది. మనలోని ప్రతిభను వెలికితీసే నటనకు అవకాశం ఇచ్చే పాత్రలు కూడా ఉన్నాయని గుర్తిస్తున్నాను. షర్మిల తల్లి పాత్రలు చేసిన సినిమాలన్నింటిలోనూ చనిపోతుంది. నిజానికి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. అయితే, తల్లిపాత్రలు చేయడంలో ఎటువంటి నష్టం కలగదనే విషయంలో ఆమెతో నేను అంగీకరిస్తాను. ఈ ఏడాది అక్టోబరు 30న రిలీజ్ అవుతున్న నా సినిమాలో నేను ముగ్గురు బిడ్డల తల్లిగా చేస్తున్నా. చాలా మంది యువకులు తాము అభిమానించేలా యుక్తవయసు మహిళలనే తెరపై చూడాలని కోరుకుంటారు. అలాంటి యవతులతో మాత్రమే ఫాంటసైజ్ చేసుకుంటారనేది నిజం (నవ్వు). ఏదేమైనా మన దేశం రెండు రకాల కాలాల్లో జీవిస్తోంది. ఒకటేమో 12వ శతాబ్ధంలో అయితే, మరొకటి ఆధునిక భారతదేశాన్ని నడిపిస్తోంది. ఈ రెండు యుగాల మనస్తత్వాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగే సత్తా మన మహిళలకు ఉంది’. -
యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్!
నేరాలను, నేరస్థులను గుర్తించడంలో షెర్లాక్ హోమ్స్ చూపిన ప్రతిభాపాటవాలు మనల్ని అబ్బురపరుస్తాయి. కల్పిత పాత్రే అయినా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులున్నారు. నేరాలు ఘోరాలు, అవినీతి అక్రమాలు నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక కాలంలో డిటెక్టివ్‌ల అవసరం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుత సమాజంలో అపరాధ పరిశోధకులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అందుకే అపరాధ పరిశోధనను కెరీర్‌గా ఎంచుకుంటే అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, క్లయింట్ల అభిమానాన్ని సొంతం చేసుకోవచ్చు. పరిశోధకులకు చేతినిండా పని అపరాధ పరిశోధకులకు డిటెక్టివ్ ఏజెన్సీలు, న్యాయ సేవా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కౌన్సిళ్లు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలున్నాయి. కేసుల ముడి విప్పేందుకు న్యాయవాదులు, పోలీసులు కూడా డిటెక్టివ్‌ల సహాయం కోరుతుంటారు. విడాకులు, దత్తత, తప్పిపోయినవారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం.. వంటి వ్యవహారాల్లో వీరి ప్రమేయం తప్పనిసరి. సమాజంలో అభద్రతాభావం, నేరాలు ఉన్నంతకాలం అపరాధ పరిశోధకులకు చేతినిండా పని దొరుకుతుంది. డిటెక్టివ్‌లో తమ వృత్తిలో పేరు తెచ్చుకోవాలంటే అన్ని అంశాల్లో ఎంతోకొంత పరిజ్ఞానం అవసరం. లా, సైకాలజీ, సోషియాలజీ, టోపోగ్రఫీ, ఆయుధాలు, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిలాసఫీ, అనాటమీ వంటి సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలి. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, పరిజ్ఞానం, అనుభవంతోపాటు సేవలను మార్కెట్ చేసుకొనే నైపుణ్యంపైనే డిటెక్టివ్‌ల విజయం ఆధారపడి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు: డిటెక్టివ్లకు మంచి పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ పెంచుకోవాలి. న్యాయ పరిజ్ఞానం అవసరం. నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే లక్షణం ముఖ్యం. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. చేపట్టిన బాధ్యతలను పూర్తిచేసేందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓర్పు, సహనం అలవర్చుకోవాలి. వెర్బల్, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ వృత్తిలో సవాళ్లు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. వీటిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. అర్హతలు: డిటెక్టివ్‌గా మారేందుకు ప్రత్యేకంగా విద్యార్హతలు అంటూ లేవు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సులు చేసినవారు అపరాధ పరిశోధకులుగా వృత్తిలో రాణించొచ్చు. క్లయింట్లను మెప్పించడానికి, మెరుగైన సేవలు అందించడానికి మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ స్కిల్స్ ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ ఉండడం తప్పనిసరి. డిటెక్టివ్‌గా మారాలనుకునేవారు మొదట ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ల వద్ద సహాయకులుగా చేరి, అనుభవం సంపాదించాలి. తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్, కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్స్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ డిటెక్టివ్స్ వంటి సంస్థల వెబ్సైట్లలో ఔత్సాహికులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. వేతనాలు: అపరాధ పరిశోధకులు తమ అనుభవం, పనితీరు ఆధారంగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో ఏడాదికి రూ.1.25 లక్షల నుంచి రూ.2.5 లక్షలు ఆర్జించే అవకాశం ఉంది. న్యాయ పరిజ్ఞానం ఉన్న డిటెక్టివ్లకు కార్పొరేట్ సంస్థల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. ఈ రంగంలో అనుభవాన్ని బట్టి సీనియర్ ఇన్వెస్టిగేటర్, టీమ్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్: www.du.ac.in/du/ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ-ఆగ్రా వెబ్సైట్: www.dbrau.ac.in యూనివర్సిటీ ఆఫ్ మైసూరు వెబ్సైట్: www.unimysore.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. వెబ్సైట్: జ్ట్టిఞ://nicfs.nic.in/ -
మా ఆయన బోళాశంకరుడు!
‘‘మా ఆయన రాముడు మంచి బాలుడు తరహా. ఆయన మీద నిందలా?’’ అంటున్నారు విద్యాబాలన్. ఆమె ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్ వేరే తారతో చనువుగా ఉంటున్నారనీ, ఈ కారణంగా విద్యా కలవరపడుతున్నారనీ వార్త వినిపించింది. ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. దీని గురించి సిద్ధార్ధ్ బహిరంగంగా స్పందించలేదు. విద్యా మాత్రం తన భర్తపై నిఘా వేశారని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ - ‘‘‘బాబీ జాసూస్’ సినిమాలో నేను డిటెక్టివ్‌గా చేశాను. నిజజీవితంలో ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే, సిద్ధార్ధ్ గురించి బాగా తెలుసు. ఆయన్ను ఎఫైర్ల వ్యవహారంలోకి లాగకండి. మా ఆయన బోళాశంకరుడు’’ అన్నారు విద్యాబాలన్.