
జై లవ కుశ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
త్రివిక్రమ్ మార్క్ స్టైలిష్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడట. 80లలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆ నవల హక్కులను కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ.. కూడా నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే. దీంతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా నవల ఆధారంగానే తెరకెక్కనుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి ఈప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment