మా ఆయన బోళాశంకరుడు! | I don't have to turn detective for my husband: Vidya Balan | Sakshi
Sakshi News home page

మా ఆయన బోళాశంకరుడు!

Published Sun, Jun 1 2014 11:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మా ఆయన బోళాశంకరుడు! - Sakshi

మా ఆయన బోళాశంకరుడు!

 ‘‘మా ఆయన రాముడు మంచి బాలుడు తరహా. ఆయన మీద నిందలా?’’ అంటున్నారు విద్యాబాలన్. ఆమె ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్ వేరే తారతో చనువుగా ఉంటున్నారనీ, ఈ కారణంగా విద్యా కలవరపడుతున్నారనీ వార్త వినిపించింది. ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. దీని గురించి సిద్ధార్ధ్ బహిరంగంగా స్పందించలేదు. విద్యా మాత్రం తన భర్తపై నిఘా వేశారని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ - ‘‘‘బాబీ జాసూస్’ సినిమాలో నేను డిటెక్టివ్‌గా చేశాను. నిజజీవితంలో ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే, సిద్ధార్ధ్ గురించి బాగా తెలుసు. ఆయన్ను ఎఫైర్ల వ్యవహారంలోకి లాగకండి. మా ఆయన బోళాశంకరుడు’’ అన్నారు విద్యాబాలన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement