Bobby Jasoos
-
దియా మీర్జా పెళ్లికి 'బాబీ జాసూస్' ఆటంకం!
బాలీవుడ్ తెరపై అప్పుడప్పుడు దర్శనమిచ్చి.. ఇటీవల నిర్మాతగా మారిన హైదరాబాద్ అమ్మాయి దియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సాహిల్ సంగాను వచ్చే ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకునేందుకు దియా మీర్జా నిశ్చయించుకున్నారు. నిర్మాత మారిన దియా మీర్జా లవ్ బ్రేక్ అప్ జిందగీ, తాజాగా విద్యాబాలన్ తో బాబీ జాసూస్ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి సాహిల్ తో గత సంవత్సరమే వివాహం జరగాల్సి ఉండేది. అయితే బాబీ జాసూస్ నిర్మాణం కారణంగా 2015 వరకు పెళ్లి వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమం సందర్బంగా సాహిల్, దియా మీర్జాల మధ్య ప్రేమ చిగురించింది. -
అక్టోబర్‌లో దియామీర్జా పెళ్లి
‘బాబీ జాసూస్’ నిర్మాత, బాలీవుడ్ తార దియా మీర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘బాబీ జాసూస్’ సహ నిర్మాత అయిన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంఘాతో తన పెళ్లి అక్టోబర్‌లో జరగనుందని ఆమె చెప్పింది. తమ పెళ్లి భారత్‌లోనే జరుగుతుందని, వచ్చే వారం నుంచే పెళ్లి పనులపై ప్లానింగ్ ప్రారంభించనున్నామని తెలిపింది. -
డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు:దియా మీర్జా
ముంబై:గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న సాహిల్ సంగా- దియా మీర్జాలు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ మధ్యనే వారిద్దరూ బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ద్వారా నిర్మించిన 'బాబీ జాసెస్' చిత్రం విజయం సాధించడంతో మళ్లీ వార్తలో నిలిచారు. కొంత సాహిల్ తో వివాహానికి సంబంధించిన ఊహాగానాలపై దియా తొలిసారి స్పందించింది. ' మా పెళ్లి విషయంలో దాపరికాలు ఏమీ లేవు. మా వివాహం త్వరలోనే జరుగుతుంది. దీనిపై ఎవరూ డిటెక్టివ్ లా వెంటబడనక్కర్లేదు' అంటూ దియా పేర్కొంది. త్వరలో జరిగే తమ వివాహానికి సంబంధించిన వివరాలను ఇప్పుడే చెబితే ఇక చెప్పడానికి ఏముంటుందని ప్రశ్నించింది. సాహిల్ తో మ్యారెజ్ కు ఆత్రుతగా ఉన్న దియా.. ఈ సంవత్సరంలోనే తమ పెళ్లి వేడుకలు ఉంటాయని కచ్చితంగా చెబుతోంది. కాకపోతే డిటెక్టివ్ లా ఎవరూ దీనిపై శోధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మా పెళ్ల్లి తప్పకుండా ఇండియాలోనే జరుగుతుందని.. అది కూడా అక్టోబర్ లోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. దానికి సంబంధించి వివరాలను మరోవారంలో వెల్లడిస్తా నంటూ తెలిపింది. గత ఏప్రిల్ లో తన వ్యాపారి భాగస్వామి అయిన సాహిల్ తో దియా నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. దియామీర్జా, సాహిల్ సంగా కలిసి బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను 2011లో ఏర్పాటుచేశారు. 'లవ్ బ్రేకప్స్ జిందగీ' అనే సినిమాతో నిర్మాణం మొదలుపెట్టి, తాజాగా విద్యాబాలన్‌తో 'బాబీ జాసూస్' చిత్రాన్ని తెరకెక్కించారు. -
'ఖాన్'లతో పనిచేయడానికి సిద్ధం!:విద్యా బాలన్
ముంబై:ఇప్పటివరకూ 'ఖాన్' ల కాంబినేషన్ లో నటించని బాలీవుడ్ విద్యాబాలన్.. వారితో చేయడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్తగా బాలీవుడ్ కు పరిచయమైన ఆలీ ఫజల్ కు జోడీగా నటిస్తున్న 'బాబీ జాసెస్' చిత్రంతో బిజీగా ఉన్న విద్యాబాలన్..ఇక తాను ఖాన్ లతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.' నేను ఇప్పటి వరకూ వారితో పని చేయలేదు.ఫలానా వ్యక్తులతో చేయాలనే ఆంక్షలు కూడా ఏమీ లేవు. తగిన స్క్రిప్ట్ దొరికితే ఆ హీరోలతో యాక్ట్ చేసేందుకు సిద్ధం'అని విద్య తెలిపింది. తన కెరీర్ గురించి ఇప్పటి వరకూ సరైన ప్రణాళికను రచించుకోలేదని.. కేవలం కథా బలాన్ని బట్టే సినిమాలను ఎంపిక చేసుకుంటానని పేర్కొంది. ప్రస్తుతానికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ లతో ప్రాజెక్టులు ఏమీ సిద్దంగా లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా విద్య తెలిపింది. తాజాగా విద్యాబాలన్.. మహేష్ భట్ దర్శకత్వంలో చేయడానికి సంతకం చేసింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ఆరంభంకానుంది. -
ఆయన నన్ను అలా భావించరు
‘‘నా భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ది ఉన్నతమైన వ్యక్తిత్వం. భర్తలందరూ తన భార్యల్ని సొంత ఆస్తులుగా భావిస్తుంటారు. కానీ... నా భర్త నన్ను అలా భావించరు. ఒక వ్యక్తిగా గౌరవిస్తారు. నా అభిమతానికి అడ్డురారు’’అన్నారు విద్యాబాలన్. ఆమె కథానాయికగా రూపొందిన ‘బాబీ జాసూస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్ నేపథ్యంతో కూడిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విద్యా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘పెళ్లి తర్వాత సినీ తారల జీవితాల్లో మార్పులు చోటుచేసుకోవడం సహజం. కానీ... పెళ్లి తర్వాత కూడా నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు. 2007 నుంచి ఏడాదికి ఒకే చిత్రంలో నటిస్తున్నాను. ఇప్పుడూ అదే జరుగుతోంది. దీనికి కారణం నా భర్త సిద్దూనే’’ అని చెప్పారు విద్య. ‘‘పెళ్లికి ముందు నుంచీ సిద్దూతో నాకు రిలేషన్ ఉంది. పెళ్లి తర్వాత కూడా అదే కొనసాగుతోంది. మా ఇద్దరి రంగాలూ వేరైనా... మా వృత్తులను పరస్పర అవగాహనతో గౌరవించుకుంటాం. ప్రేమ విషయంలో మా అమ్మానాన్నలనే మరిపించాడు తను’’ అని విద్యాబాలన్ ఉద్వేగానికి లోనయ్యారు. -
మా ఆయన బోళాశంకరుడు!
‘‘మా ఆయన రాముడు మంచి బాలుడు తరహా. ఆయన మీద నిందలా?’’ అంటున్నారు విద్యాబాలన్. ఆమె ఇలా అనడానికి కారణం ఉంది. ఇటీవల సిద్ధార్ధ్‌రాయ్‌కపూర్ వేరే తారతో చనువుగా ఉంటున్నారనీ, ఈ కారణంగా విద్యా కలవరపడుతున్నారనీ వార్త వినిపించింది. ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోనున్నారని బాలీవుడ్ టాక్. దీని గురించి సిద్ధార్ధ్ బహిరంగంగా స్పందించలేదు. విద్యా మాత్రం తన భర్తపై నిఘా వేశారని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ - ‘‘‘బాబీ జాసూస్’ సినిమాలో నేను డిటెక్టివ్‌గా చేశాను. నిజజీవితంలో ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే, సిద్ధార్ధ్ గురించి బాగా తెలుసు. ఆయన్ను ఎఫైర్ల వ్యవహారంలోకి లాగకండి. మా ఆయన బోళాశంకరుడు’’ అన్నారు విద్యాబాలన్. -
బాబీ జాసూస్ ట్రైలర్ లాంచ్ కు విద్యాబాలన్
-
బాబీ జసూస్ ఫస్ట్‌లుక్ అదుర్స్..!
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బాబీ జసూస్’ చిత్రం ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా ద్వారా డిటెక్టివ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విద్యాబాలన్‌కు మరోసారి అవార్డుల పంట పండడం ఖాయమని చెబుతున్నారు. ‘డర్టీ పిక్చర్’తో బాలీవుడ్లో విద్యాబాలన్‌కు దక్కిన గుర్తింపు అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ సినిమాద్వారా కూడా ఆమెకు మరింత గుర్తింపు దక్కుతుం దంటున్నారు. ప్రైవేటు డిటెక్టివ్‌గా విద్యాబాలన్ వేషధారణ భలే బాగుం దని, ఈ పాత్రద్వారా ఆమె అభిమానులను అలరించడమేకాదు మరోసారి జాతీయ అవార్డును ఎగరేసుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. ‘బర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దియా మీర్జా, ఆమె ప్రియుడు సాహిల్ సంఘా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్ షేఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు శంతను మొయిత్రా స్వరాలు సమకూర్చారు. డిటెక్టివ్‌ల సమక్షంలో ట్రెయిలర్స్ విడుదల... ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్స్‌ను కూడా విభిన్నంగా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ట్రెయిలర్స్‌ను వృత్తిరీత్యా డిటెక్టివ్‌లుగా కొనసాగుతున్న వారి సమక్షంలో కథానాయిక విద్యాబాలన్ విడుదల చేస్తుందని చెబుతున్నారు. ‘అవును నిజమే ట్రెయిలర్స్ విడుదల కార్యక్రమానికి డిటెక్టివ్‌లను ఆహ్వానించాలనుకుంటున్నామ’ని చిత్రబృందం సభ్యుడొకరు తెలిపాడు. కార్యక్రమం నెలాఖరులో ఉండే అవకాశం ఉందని చెప్పాడు. సినిమాల్లో డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్న మొదటి నటిగా విద్యాబాలన్ తనదైన ముద్ర వేస్తుందని, ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. -
‘బాబీ’ బాగా నవ్విస్తుంది
న్యూఢిల్లీ: త్వరలో విడుదలయ్యే బాబీ జసూస్ దియా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని దీని నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ దియా మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది. ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈమె 2011లోనూ లవ్ బ్రేకప్స్ జిందగీ తీసింది. నిర్మాతగా మారడం ఎలా అనిపిస్తోందంటే.. ‘పని చాలా ఎక్కువగా ఉంటుంది. సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టం. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది. ‘ఫ్యాషన్ వేదికలకు రావాలంటే ఇప్పటికీ భయమే. క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఎంతో కంగారుగా అనిపిస్తుంటుంది. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రోత్సాహం శక్తిని ఇస్తుంటుంది. అందుకే పని సులువు అవుతుంది’ అని దియా మీర్జా వివరించింది. -
సినిమా ఒక మత్తు మందు లాంటింది:దియా మీర్జా
న్యూఢిల్లీ: సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టమని బాబీ జసూస్ సినిమా నిర్మాత దియామీర్జా తెలిపింది. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని ఈ చిత్ర నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది. ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది. -
ఉద్యోగం చేసుకోవచ్చుగా అని తిట్టారామె!
చీరకట్టుకు చిరునామా విద్యాబాలన్ అంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ‘అమ్మమ్మల్లా ఈ చీరలూ నువ్వూ..’ అని ఒకప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోలు విద్యాని మొహం మీదే విమర్శించారు. కానీ, అవేం పట్టించుకోలేదామె. ఎక్కడికొచ్చినా తనకు నచ్చినట్లుగా నిండుగా చీరల్లోనే వస్తుంటారామె. ఇప్పుడా బాలీవుడ్ హీరోలు సైతం ‘నువ్వు కట్టడంవల్ల చీరలకే అందం వచ్చింది’ అంటున్నారు. ఇక, ఓ చిత్రకారుడైతే ‘విద్యా.. నువ్వు ఖజురహో శిల్పంలాంటిదానివి. ఆ శిల్పాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మనసులో ముద్రించుకుపోతుంది. నువ్వు కూడా అంతే’ అని అభినందించారట. ఈ విషయాన్ని స్వయంగా విద్యానే చెప్పారు. ఇంతకుమించిన మంచి అభినందన ఏముంటుంది? అని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఖజురహో శిల్పంలాంటి ఈ అందం ఇటీవల చిరిగిన బట్టల్లో, రేగిన జుత్తుతో హైదరాబాద్ రైల్వేస్టేషన్లో అడుక్కున్నారు. ‘బాబీ జాసూస్’ సినిమా కోసమే ఆమె ఈ పని చేశారు. నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్లిపోయి, అక్కడ అడుక్కుంటున్నవాళ్ల పక్కన విద్యా కూర్చున్నారట. తమ పక్కన కూర్చున్నది విద్యా అని వాళ్లకెవరికీ తెలియదు. యూనిట్ సభ్యులు బుర్ఖాలు ధరించి, ఈ సీన్‌ని చిత్రీకరించారని విద్యా చెప్పారు. కాగా, విద్యా అడుక్కుంటున్నప్నుడు, ఓ వృద్ధురాలు వచ్చి, ‘శుభ్రంగా ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా..’ అని అడిగారట. అప్పుడు ఓ నవ్వు నవ్వుకున్నానని విద్యా పేర్కొన్నారు. -
గ్లామర్ నుండి డిగ్లామర్ రోల్స్
-
హైదరాబాద్ వీధుల్లో భిక్షగత్తెగా విద్యాబాలన్
విద్యాబాలన్.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే అద్భుతమైన నటీమణి. తన నిజజీవితంలో అచ్చమైన భారతనారిలా ఉండిపోయే విద్య.. సినిమాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం పాత్ర ఎలా ఉంటే అలా మారిపోతుంది. ఘన్‌చక్కర్ సినిమాలో ఆమె బ్రహ్మాండమైన సల్వార్-కుర్తీలలో మెరిసిపోయింది. దాంతోపాటు పాశ్చాత్య దుస్తులు కూడా వేసుకుని ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెప్పింది. కానీ అలాంటి విద్య... హైదరాబాద్ రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటోందంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం. బాలీవుడ్ నటి విద్యాబాలన్ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద భిక్షాటన చేస్తోంది. సినిమా ఆఫర్లు ఏమీ చేతిలో లేక.. ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి, సొంతూళ్లో అయితే గుర్తుపడతారేమోనని ఇక్కడికొచ్చిందని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. తాజాగా తాను నటిస్తున్న 'బాబీ జాసూస్' అనే సినిమా కోసం ఆమె ఈ కొత్త అవతారంలోకి దిగింది. హైదరాబాద్‌లోని ఓ రైల్వే స్టేషన్ బయట భిక్షగత్తె వేషం వేసుకుని నిజంగానే డబ్బులు అడుక్కునే అమ్మాయిలా కనిపించింది. బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు దియా మీర్జా, సాహిల్ సంఘా. ఈ సినిమా గురించి దియామీర్జా తన ట్విట్టర్ ద్వారా విద్యాబాలన్ కొత్త అవతారాన్ని బయటపెట్టింది. ఈ సినిమా 2014 మధ్యలో ఎప్పుడో విడుదల అవుతుందని భావిస్తున్నారు. -
డిటెక్టివ్ విద్యాబాలన్
నీటుగా చీర కట్టుకుని అభినయించే పాత్రలే కాదు.. హాట్‌గా మినీ డ్రెస్‌లేసుకుని కూడా అద్భుతంగా అభినయించగలరు విద్యాబాలన్. అయితే ఆ అభినయం జుగుప్సాకరంగా మాత్రం ఉండదు. అందుకే ‘డర్టీ పిక్చర్’లో ఆమె కాస్తంత విజృంభించినా ప్రేక్షకులు మెచ్చుకున్నారు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎప్పటికప్పుడు వినూత్న పాత్రలు చేయడానికి ఇష్టపడే విద్యాబాలన్ ఈసారి డిటెక్టివ్‌గా కనిపించబోతున్నారు. తన భర్త సాహిల్ సంగాతో కలిసి నటి దియా మిర్జా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డిటెక్టివ్ పాత్ర చేయాలని కోరగానే విద్యా కథ విన్నారు. ఈ స్టోరీ, తన పాత్ర బాగా నచ్చడంతో ఎగ్జయిట్ అయ్యి, వెంటనే పచ్చజెండా ఊపేశారామె. ఈ చిత్రానికి ‘బాబీ జాసూస్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సమర్ షైక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే, విద్యాబాలన్, దియా మంచి స్నేహితులు. ఈ చిత్రంలో విద్యా నటించడానికి అది కూడా ఓ కారణం. ఈ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఎదురు చూస్తున్నానని విద్యా అంటున్నారు.